🌹🍀 04, JANUARY 2023 TUESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 04, JANUARY 2023 TUESDAY, బుధవారం, సౌమ్య వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 306 / Bhagavad-Gita -306 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -26వ శ్లోకము.
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 153 / Agni Maha Purana - 153 🌹 🌻. శాలగ్రామ పూజా విధానము - 2 / Mode of worshipping Śālagrāma- 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 018 / DAILY WISDOM - 018 🌹 🌻 18. వ్యక్తుల మధ్య వారి అవగాహనలో తేడా ఉంది / 18. There is a Difference among Individuals in their Perception 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 283 🌹
6) 🌹. శివ సూత్రములు - 20 / Siva Sutras - 20 🌹 🌻6. శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 4 / Śakticakrasandhāne viśvasaṁhāraḥ - 4 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹04, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, రోహిణి వ్రతరం, Pradosh Vrat, Rohini Vrat 🌺*
*🍀. శ్రీ గణేశ హృదయం - 2 🍀*
3. సిద్ధిబుద్ధిపతిం వందే బ్రహ్మణస్పతిసంజ్ఞితమ్ |
మాంగల్యేశం సర్వపూజ్యం విఘ్నానాం నాయకం పరమ్
4. ఏకవింశతి నామాని గణేశస్య మహాత్మనః |
అర్థేన సంయూతాన్యేవ హృదయం పరికీర్తితమ్
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సత్యతేజస్సు క్రిందికి దిగివచ్చి మనస్సును ప్రేరేపించి నడిపించ వలెనని గాయత్రీ మంత్రం కోరుతున్నది. ఆ తేజస్సు క్రిందికి దిగి వచ్చినప్పుడు దానిని భరించడం ఎల్లరకూ సాధ్యం కాదు. దానిని భరించగల సామర్థ్యమే యోగ సాధనాధికార సంపతికి సూచకం. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
తిథి: శుక్ల త్రయోదశి 24:02:28
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: రోహిణి 18:49:59 వరకు
తదుపరి మృగశిర
యోగం: శుభ 07:07:05 వరకు
తదుపరి శుక్ల
కరణం: కౌలవ 11:00:39 వరకు
వర్జ్యం: 10:01:20 - 11:46:52
మరియు 25:01:38 - 26:48:06
దుర్ముహూర్తం: 11:58:32 - 12:43:02
రాహు కాలం: 12:20:47 - 13:44:14
గుళిక కాలం: 10:57:20 - 12:20:47
యమ గండం: 08:10:26 - 09:33:53
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:42
అమృత కాలం: 15:17:56 - 17:03:28
సూర్యోదయం: 06:46:58
సూర్యాస్తమయం: 17:54:36
చంద్రోదయం: 15:44:40
చంద్రాస్తమయం: 04:28:10
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: : శుభ యోగం - కార్య జయం
18:49:59 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 306 / Bhagavad-Gita - 306 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 26 🌴*
*26. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |*
*భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ||*
🌷. తాత్పర్యం :
*ఓ అర్జునా! దేవదేవుడైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచుచున్న సర్వమును, భవిష్యత్తులో జరుగనున్న వానినన్నింటిని ఎరుగుదును. అలాగుననే జీవులందరిని నేను ఎరుగుదురు. కాని నన్నెవ్వరును ఎరుగరు.*
🌷. భాష్యము :
సాకార, నిరాకారతత్త్వములకు సంబంధించిన వివాదము ఇచ్చట స్పష్టముగా విశదీకరింపబడినది. మాయావాదులు తలచురీతిగా శ్రీకృష్ణభగవానుని రూపము మాయ (భౌతికము) అయినచో, సాధారణజీవుల వలె అతడును దేహమును మార్చును గడచిన జన్మను మరచిపోవలెను. దేహదారులెవ్వరును గడచిన జన్మను గుర్తుంచుకొనుట, రాబోవు జన్మమును గూర్చి భవిష్యత్తు పలుకుట లేక ప్రస్తుతజన్మము యొక్క ఫలితమును ఊహించుట చేయలేరు. కనుకనే వారు భూత, భవిష్యత్, వర్తమానములును తెలియరని తీర్మానింపవచ్చును. భౌతికసంపర్కము నుండి ముక్తిని పొందనిదే ఎవ్వరును భూత, భవిష్యత్, వర్తమానములను ఎరుగజాలరు.
సాధారణ మావవునకి భిన్నముగా శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తాను భూతకాలమున గడచిన సర్వమును, వర్తమానమున జరుగుచున్న సమస్తమును, భవిష్యత్తులో జరుగనున్న వానినన్నింటిని సంపూర్ణముగా తెలియుదనిని స్పష్టముగా పలికియున్నాడు. లక్షలాది సంవత్సరముల క్రిందట సూర్యదేవుడైన వివస్వానునకు జ్ఞానోపదేశము చేసిన విషయమును శ్రీకృష్ణుడు జ్ఞప్తి యందుంచుకొనినట్లు మనము భగవద్గీత యొక్క చతుర్థాధ్యాయమున గాంచియున్నాము. సర్వజీవహృదయములలో పరమాత్మ రూపున నిలిచియున్నందున అతడు సర్వజీవులను సైతము ఎరిగియున్నాడు. కాని శ్రీకృష్ణుడు ఆ విధముగా సర్వజీవుల యందు పరమాత్మగా నిలిచియున్నను మరియు దేవదేవునిగా స్థితుడై యున్నను అల్పజ్ఞులైనవారు (నిరాకారబ్రహ్మానుభూతిని బడయగలిగినప్పటికిని) అతనిని పరమపురుషునిగా ఎరుగుజాలకున్నారు. నిక్కముగా శ్రీకృష్ణభగవానుని దేహము అవ్యయమైనది మరియు నశ్వరము కానిది. అతడు సూర్యుడైనచో మాయ మేఘము వంటిది.
భౌతికజగత్తులోని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు కలిగిన ఆకాశమును ఒక్కక్కమారు మేఘములు తాత్కాలికముగా కప్పివేసినను వాస్తవమునకు అది మన దృష్టిని కప్పివేయుటయే యగును. ఏలయన సూర్యచంద్రాదులు వాస్తవమునకు కప్పబడరు. అలాగుననే మాయ సైతము శ్రీకృష్ణభగవానుని కప్పలేదు. అతడే తన అంతరంగశక్తిచే అల్పజ్ఞులైనవారికి గోచరించక యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 306 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 7 - Jnana Yoga - 26 🌴*
*26. vedāhaṁ samatītāni vartamānāni cārjuna*
*bhaviṣyāṇi ca bhūtāni māṁ tu veda na kaścana*
🌷 Translation :
*O Arjuna, as the Supreme Personality of Godhead, I know everything that has happened in the past, all that is happening in the present, and all things that are yet to come. I also know all living entities; but Me no one knows.*
🌹 Purport :
Here the question of personality and impersonality is clearly stated. If Kṛṣṇa, the form of the Supreme Personality of Godhead, were māyā, material, as the impersonalists consider Him to be, then like the living entity He would change His body and forget everything about His past life. Anyone with a material body cannot remember his past life, nor can he foretell his future life, nor can he predict the outcome of his present life; therefore he cannot know what is happening in past, present and future. Unless one is liberated from material contamination, he cannot know past, present and future.
Unlike the ordinary human being, Lord Kṛṣṇa clearly says that He completely knows what happened in the past, what is happening in the present, and what will happen in the future. In the Fourth Chapter we have seen that Lord Kṛṣṇa remembers instructing Vivasvān, the sun-god, millions of years ago. Kṛṣṇa knows every living entity because He is situated in every living being’s heart as the Supersoul.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 153 / Agni Maha Purana - 153 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 47*
*🌻. శాలగ్రామ పూజా విధానము - 2🌻*
పిమ్మట పూర్వాది దిక్కలందు ఋగ్వేదాది వేదచతుష్టయమును పూజించి, అధారశక్తిని, అనంతుని, పృథివిని, యోగపీఠమును పద్మమును, సూర్యమండలమును, చంద్రమండలమును, బ్రహ్మాత్మక వహ్నిమండలమును పూజించి, ద్వాదశాక్షరిచే అసనముపై శిలాస్థాపనముచేసి పూజింపవలెను.
పిదప మూల మంత్రమును విభజించియు, సంపూర్ణ మంత్రముచేతను క్రమపూర్వకముగా పూజింపవలెను. పిదప ప్రణవముచే పూజించి మూడు ముద్రలు చూపవలెను. నిష్వక్సేన - చక్ర- క్షేత్రపాలుల ముద్రలు చూపవలెను.
ఇంతవరకును చెప్పినది శాలగ్రామ మధ్యమ పూజ.
ఇంతవరకును చెప్పినది శాలగ్రామ మధ్యమ పూజ. ఇపుడు నిష్పలపూజ చెప్పబడుచున్నది. వెనుకటి వలెనే షోడశదలకమలముతో కూడిన మండలము చేయవలెను. దానిపై శంఖ-చక్ర-గదా-ఖడ్గములను, గురువు మొదలగువారిని వెనుక చెప్పినట్లుగనే పూజింపవలెను. పూర్వోత్తర దిశలయందు వరుసగా ధనుర్బాణములను పూజింపవలెను. ప్రణవముచే అసనము సమర్పించి, ద్వాదశాక్షరిచే శిలాన్యాసము చేయవలెను. ఇపుడు మూడవదైన కనిష్ఠ పూజను (సఫలపూజన) చెప్పుచున్నాను, వినుము. అష్టదల కమలముపై వెనుకటివలె గుర్వాదిపూజ చేయవలెను. పిదప అష్టాక్షర మంత్రముచే అసనము సమర్సించి, ఆ మంత్రముచేతను, శిలను స్థాపించవలెను.
అగ్ని మహాపురాణమునందు శాలగ్రామ పూజాకథనమను నలుబది ఏడవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 153 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 47
*🌻Mode of worshipping Śālagrāma - 2 🌻*
7. The Vedas, Ṛgveda etc. (should be worshipped) in the east etc. (The serpent) Ananta (which is) the support of the earth, the seat of worship, the lotus, the three orbs—sun, moon and fires (should be worshipped).
8. The seat (should consist) of twelve letters[2] (forming the mystic formula of the God). Having placed (the God) there, the stone should be worshipped with the individual syllables and the whole of the sacred syllable in order.
9-10. Then one should worship with the vedic sacred syllables accomplished by the syllables such as the gāyatrī, etc. and praṇava on the east and other directions. Then the three mudrās of the Viṣvaksena (Viṣṇu), the disc and the Kṣetrapāla should be shown. This is the first variety of the worship of śālagrāma. Then I shall describe the one with no merits.
11. One should draw a circle as before with sixteen radii and with a lotus. One should then worship the preceptor and others with a conch, disc, mace and sword.
12. The bow and the arrows (should be placed) in the east and the north. The seat should be placed with the vedic (syllables). The stone should be placed with the (sacred) twelve syllables[3] of the lord. Listen to the third variety of worship.
13. One should draw a lotus having eight radii and worship the preceptor and others as before. Having offered the seat with the eight sacred letters[4] one should place the stone with the same (formula). One should worship ten times with that (formula). It is then accomplished by gāyatrī etc.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 18 / DAILY WISDOM - 18 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 18. వ్యక్తుల మధ్య వారి అవగాహనలో తేడా ఉంది 🌻*
*ప్రపంచం యొక్క భౌతికరూపం అనేది విశ్వ చైతన్యం లేదా ప్రపంచ-మనస్సు యొక్క వస్తురూపంగా శక్తి ప్రక్షేపన. ప్రపంచంలోని ప్రతిదీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. ఆ సంబంధాలు అన్ని మనకు అర్థం కావు. విషయాలు అందరూ ఒకే పద్ధతిలో గ్రహించరు. అనేక మంది వ్యక్తులచే కుర్చీ యొక్క అవగాహనలు ఒకే రకమైన స్పృహకు చెందినవి కావు.*
*మనుషులు ఆలోచించే పద్ధతి అందరివీ ఒకేలా ఉండవు. వాటిని రూపందించడంలో ప్రతి ఒక్కరికీ వారి ప్రత్యేక వైఖరి ఉంటుంది. ప్రతి మానవునికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వ ఉనికికి కారణమయిన శక్తులు అందరిలోనూ ఒకే నాణ్యతను కలిగి ఉండవు. వ్యక్తుల మధ్య వారి అవగాహన మరియు ఆలోచనలో తేడా ఉంటుంది. ఒకరి స్వయం చైతన్యంలో భాగం కాని దాని గురించిన అవగాహన కలిగి ఉండటం అసాధ్యం.*
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 18 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 18. There is a Difference among Individuals in their Perception 🌻*
*The form of the world is the projection of the objective force of the Universal Consciousness or the World-Mind. Everything in the world is a network of unintelligible relations. Things are not perceived by all in the same fashion. The perceptions of a chair by many individuals are not of the same category of consciousness.*
*They differ in the contents of their ideas which are the effects of the particular modes of the tendency to objectification potentially existent in the individuals. The forces of distraction which constitute the individual consciousness are not of the same quality in everyone. There is a difference among individuals in their perception and thinking. It is impossible to have a knowledge of anything that does not become a content of one’s own consciousness.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 283 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. దేవుడికి ప్రపంచానికి మధ్య వేర్పాటు లేదు. అంతా దైవత్వమే. ప్రపంచం దేవ నిర్మితం. భౌతికవాదానికి, ఆధ్యాత్మిక వాదానికి మధ్య విభజన అనవసరం. ఆ రెండూ కలిసే వున్నాయి. కాబట్టి చిన్ని విషయాల్లో ఆనందించు. 🍀*
*కొన్ని ప్రాపంచికమయినవని మరికొన్ని పవిత్రమైనవని అనుకోకు. ఆనందించగలిగిన వ్యక్తికి అన్నీ పవిత్రమైనవే. దేవుడికి ప్రపంచానికి మధ్య వేర్పాటు లేదు. అంతా దైవత్వమే. ప్రపంచం దేవ నిర్మితం. దేవుడు ప్రపంచం నిర్మించిన వాడు కాడా? వ్యక్తి ఆనందించగలిగితే విభజనలెందుకు? పువ్వు విత్తనం నించి వచ్చింది. మరి విత్తనం? రెండూ ఒకటే. ఈ ప్రపంచానికి అది తీరం.*
*భౌతికవాదానికి, ఆధ్యాత్మిక వాదానికి మధ్య విభజన అనవసరం. ఆ రెండూ కలిసే వున్నాయి. కాబట్టి చిన్ని విషయాల్లో ఆనందించు. తలస్నానం చేసి తన్మయించు. టీ తాగి ఆనందించు. ఎట్లాంటి ప్రత్యేకతలూ ఆపాదించకు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 020 / Siva Sutras - 020 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 6. శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 4 🌻*
*🌴. అనేక శక్తుల కలయికలో ద్వందాత్మకమైన విశ్వం నాశనం అవుతుంది. 🌴*
*శివుని లాగానే, శక్తి కూడా ఈ కార్యకలాపాలలో దేనిలోనూ తనను తాను బంధించుకోదు. అయినప్పటికీ ఆమె విశ్వంలో జరిగే అన్ని కార్యకలాపాలకు పూర్తి నియంత్రణను కలిగి ఉంది. ఈ శక్తులన్నింటి కలయిక (సంధానం) ఉన్నప్పుడు, విశ్వం కరిగిపోయినట్లు (సంహారః) కనిపిస్తుంది.*
*వివిధ రకాల చైతన్యాల కలయిక జరిగినప్పుడు, ఒకే చైతన్యం ఉద్భవిస్తుంది, దానిని భైరవ అని పిలుస్తారు. ఒక యోగి ఈ విధంగా ధ్యానం చేసినప్పుడు, అతను కాలాన్ని మరియు స్థలాన్ని అధిగమించి భైరవునితో ఐక్యం అవుతాడు. ఈ మహాచైతన్యంలో ముప్పై ఆరు తత్వాలు కరిగిపోతాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 020 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻6. Śakticakrasandhāne viśvasaṁhāraḥ - 4 🌻*
*🌴. In union of multitude of powers is destruction of the differentiated universe. 🌴*
*As in the case of Shiva, Śaktī also does not associate Herself in any of these activities, though She is in full command of all the activities that unfold in the universe. When there is a union (sandhāna) of all these śaktis, the universe appears as dissolved (saṁhāraḥ). When the union of different types of consciousness takes place, there emerges a single consciousness, which is called Bhairava.*
*When a yogi meditates this way, he is able to transcend time and space and become one with Bhairava. This is the consciousness where all the thirty six tattvas are incinerated in the fire of supreme consciousness that burns within.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Comments