🌹🍀 05 - OCTOBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 05, బుధవారం, అక్టోబరు 2022 సౌమ్య వాసరే WEDNESDAY 🌹
🌹. విజయదశమి - దశపాప హర దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Vijayadashami - DasaPapa Hara Dasami to All. 🌹
2) 🌹 కపిల గీత - 73 / Kapila Gita - 73 🌹 సృష్టి తత్వము - 29
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 112 / Agni Maha Purana - 112 🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 247 / Osho Daily Meditations - 247 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 405 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹05, October 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
🌹. విజయదశమి - దశపాప హర దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Vijayadashami - DasaPapa Hara Dasami to All. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : విజయదశమి, దసరా, Dashara, Vijayadashami 🌺*
*🍀. శ్రీ దుర్గా స్తోత్రం 🍀*
*దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా ।*
*సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా ॥*
*సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా ।*
*భూమిజా నిర్గుణాఽఽధారశక్తి శ్చానీశ్వరీ తథా ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : పేదరికాన్ని తొలగించినంత మాత్రాననే మానవులకి, సమాజానికిక కష్టాలూ, సమస్యలూ ఉండబోవనీ అపోహ చెందబోకు. అది మొదటగా తీరవలసిన కనీసపు అవసరం మాత్రమే. లోని ఆత్మ అవ్యవస్థితిలో ఉన్నంతకాలం బయట ఆశాంతీ, విప్లవమూ, కల్లోలమూ తప్పవు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-దశమి 12:01:03 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: శ్రవణ 21:16:19 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: సుకర్మ 08:21:27 వరకు
తదుపరి ధృతి
కరణం: గార 12:01:03 వరకు
వర్జ్యం: 02:36:00 - 04:05:36
మరియు 25:00:20 - 26:30:04
దుర్ముహూర్తం: 11:40:34 - 12:28:14
రాహు కాలం: 12:04:24 - 13:33:47
గుళిక కాలం: 10:35:02 - 12:04:24
యమ గండం: 07:36:17 - 09:05:40
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:27
అమృత కాలం: 11:33:36 - 13:03:12
సూర్యోదయం: 06:06:54
సూర్యాస్తమయం: 18:01:55
చంద్రోదయం: 15:00:33
చంద్రాస్తమయం: 01:27:32
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మకరం
ఛత్ర యోగం - స్త్రీ లాభం 21:16:19
వరకు తదుపరి మిత్ర యోగం -
మిత్ర లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విజయదశమి - దశపాప హర దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి , Happy Vijayadashami - DasaPapa Hara Dasami to All. 🌹*. 5-10-2022
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. దశపాప హర దశమి - దసరా అంతరార్ధం 🌻*
*దేవి ప్రసీద, పరిపాలయ, నోరి భీతేః నిత్యం, యదా సుర వధా దధునైవ , సద్యః*
*పాపాని సర్వ జగతాం ప్రశమం నయాశు - ఉత్పాతపాక జనితారిశ్చ,మహోప సర్గాన్*
*ఓ దేవి ! రాక్షసులను చంపి నువ్వు మమ్మల్ని ఎలా కాపాడావో, అలాగే మమ్మల్ని ఎప్పుడూ శత్రు భయం నుంచి కాపాడు. అన్ని కాలాల్లోని పాపాలను, ఉత్పాతాల ద్వారా సూచింపబడి, అతి ఘోరంగా మారే ఉత్పాతాల విపత్తులను త్వరగా శమింప జేయి.*
*🍀. దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే ’’దశ హర‘’ అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా . 🍀*
*🔱. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ఈ రోజును దశపాప హర దశమి అని కూడా అంటారు. అవి పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకుంటూ అందరికి దసరా - దశపాప హర దశమి శుభాకాంక్షలు. 🔱*
*🍀. శ్రీ దుర్గా స్తోత్రం 🍀*
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే
మధుకైటభ విద్రావ విధాత్రి వరదే నమః
రూపం దేహి జయం దేహిం యధోదేహి ద్విషో జహి
మహిషాసుర సంహారీ విధాత్రీ వరదే నమః
రూపం దేహి జయం దేహిం యదోదేహి ద్విషో జహి
ధూమ్రలోచన దర్పఘ్నీ విధాత్రీ వరదే నమః
రక్తబీజ కులచ్చేత్రి చణ్ణముణ్ణ విమర్దినీ
నిశుంభ శంభమదినీ తదా దూమ్రాక్షమర్దినీ
వందితాజ్ఞ్రియుగేదే వైర్దేవీ సౌభాగ్య దాయనీ
అచిన్త్యరూప చరితే సర్వశత్రు వినాశినీ
సతేభ్యస్సర్వదా భక్త్వా చణ్ణకే దురితావహే
స్తువర్భో భక్తి పూర్వంత్వాం చణ్ణకే వ్యాధినాశినీ
చణ్ణకే సతతం యేత్వామర్చయ న్తీహభక్తితః
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకై
దేహిమే దేవి కళ్యాణం దేహిమే విపులాం శ్రియమ్
సురా సురశిరోరత్న నిఘ్నుష్టచర్ణామ్బుజే
ప్రచణ్ణదైత్య దర్పఘ్నీ చణ్ణికే ప్రణతాయ మే
విద్యావవంత యశస్వంతం లక్ష్మీవంతంచమాంకురు
చతుర్భుజ చతుర్వక్త్వంస్తుతే పరమేశ్వరీ
ఇంద్రాణీపతి సధ్బావన పూజితే పరమేశ్వరీ
దేవీ ప్రచండరణ్ణ దైత్యదర్ప వినాశినీ
దేవీ భక్తజనోద్దామా దత్తానన్దోదయాన్వితే
పుత్త్రాన్దేహి ధనం దేహి సర్వాన్కామాంశ్చ దేహిమే
రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జహి
సత్నీం మనోరమాందేహి మనోవిత్తాను సారిణీమ్
తారిణీం దుర్గసంసార సాగరస్య కులోద్భవామ్
ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నరః
స తు సప్తశతీ సజ్జ్యావర మాప్నోతి సంపదః
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 73 / Kapila Gita - 73🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 29 🌴*
*29. తైజసాత్తు వికుర్వాణాద్బుద్ధితత్త్వమభూత్సతి|*
*ద్రవ్యస్ఫురణవిజ్ఞానమింద్రియాణామనుగ్రహః॥*
*పూజ్యురాలా! తైజస (రాజస) అహంకారమున వికారము కలుగుటచే దానినుండి బుద్ధితత్ప్వము ఉత్పన్నమయ్యెను. వస్తువులను స్ఫురింపజేయు విజ్ఞానము ఇంద్రియ వ్యాపారములకు సహాయపడుట అనగా పదార్ధముల విశేషజ్ఞానము కలిగించుట అనునవి ఈ బుద్ధియొక్క కార్యములు.*
*ఈ తైజసాహంకారం వలన పుట్టేదే బుద్ధి తత్వం. ఈ బుద్ధి తత్వము వలన కలిగేది ద్రవ్య స్పురణ విజ్ఞ్యానం. ఇలాంటి దాని వలననే అన్ని ఇంద్రియములూ ఏర్పడి పని చేస్తాయి. బుద్ధి లేకపోతే ఇంద్రియములు చేసినా తెలియదు. కన్ను చూసినా, బుద్ధికీ మనసుకూ అనుసంధానం లేనప్పుడు ఎదురుగా ఉన్నా గమనించలేము. బుద్ధినీ మనసునూ పరమాత్మ యందు లగ్నం చేస్తే ఏమి చూసినా మనకి అంటదు. అందుకే విద్యాతురానాం నరుచిః నపక్వం అంటారు. రాజసాహంకారం వలన అనుగ్రహించబడి, సాత్వికాహం కారము వలన పుట్టినవి ఇంద్రియాలు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 73 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 29 🌴*
*29. taijasāt tu vikurvāṇād buddhi-tattvam abhūt sati*
*dravya-sphuraṇa-vijñānam indriyāṇām anugrahaḥ*
*By transformation of the false ego in passion, intelligence takes birth, O virtuous lady. The functions of intelligence are to help in ascertaining the nature of objects when they come into view, and to help the senses.*
*Intelligence is the discriminating power to understand an object, and it helps the senses make choices. Therefore intelligence is supposed to be the master of the senses. The perfection of intelligence is attained when one becomes fixed in the activities of Divine consciousness. By the proper use of intelligence one's consciousness is expanded into Divine Consciousness.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 112 / Agni Maha Purana - 112 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 35*
*🌻. పవిత్రాది వాసనము - 1🌻*
అగ్నిదేవుడు చెప్పెను :- సంపాతాహుతిచేత పవిత్రలను తడిపి వాటి అధివాసనము చేయవలెను. నృసింహ మంత్రమును జపించి, వాటిని అభిమంత్రించి, అస్త్రమంత్రముచే (అస్త్రాయ ఫట్ ) వాటిని సురక్షితములు చేయవలెను. పవిత్రలకు వస్త్రములు చుట్టి ఉండగనే పాత్రములో ఉంచి వాటిని అభిమంత్రించవలెను. బిల్వాదిసంసృష్ట మైన జలముతో, మంత్రోచ్చారణపూర్వకముగ వాటిని ఒకటి రెండు సార్లు ప్రోక్షించవలెను.
కుంభపాత్రమునందు పవిత్రలను ఉంచి, గురువు, వాటి రక్షణనిమిత్తము, ఆ పాత్రను తూర్పున సంకర్షణమంత్రముతో దంతచాష్ఠమును, ఉసరికాయను, దక్షిణమున ప్రద్యుమ్నమంత్రముతో భస్మమును, తిలలను, పశ్చిమమున నారాయణమంత్రముతో కుశోదకమును ఉంచవలెను. పిమ్మట అగ్నేయమునందు హృదయమంత్రముతో కుంకుమమును, గోరోచనమును, ఈశాన్యదిక్కు నందు శిరోమంత్రముతో ధూపమును, నైరృతి దిక్కునందు శిఖామంత్రముతో దివ్యమూలపుష్పములను, వాయవ్యదిక్కునందు కవచమంత్రముతో చందన-జల-అక్షత-దధి-దూర్వలను దొన్నెలో ఉంచవలెను. మండపమును త్రిసూత్రముతో చుట్టి మరల అన్ని ప్రక్కల ఆవాలు చల్లవలెను.
ఏ క్రమమున దేవతల పూజ జరిగినదో ఆ క్రమముననే ఆ దేవతలకు, వారి వారి మంత్రముల నుచ్చరించుచు గంధపవిత్రము లర్పింపవలెను. ద్వారపాలాదులకు గూడ నామమంత్రములతో గంధపవిత్రము లర్పింపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 112 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 35*
*🌻 Mode of consecration of an image - 1 🌻*
Agni said:
1. Having sprinkled with the residual offering one should perform consecration of the sacred, subtle, and chanted mystic formulae of the manlion. form.
2-3. Consecration of the vessels covered by the clothes should be done with mystic syllables. The vessels on which water is sprinkled once or twice with bel (leaves), should be placed near the pitcher. Having pronounced the protective spell the priest should place stick for (cleansing) the teeth and myrabolan on the east with (the recitation of syllable for) Saṅkarṣaṇa.
4. The ashes, sesamum, and cowdung-mixed earth (should be consecrated)on the south with (syllable for) Pradyumna, in the west with (that of) Aniruddha and in the north with that of Nārāyaṇa.
5. Then the waters along with the kuśa grass (should be assigned) to the south-east with the heart, the saffron and pigment on the north-east with the head, the incense on the southwest with the tuft.
6. Then the principal beautiful flowers (should be assigned) to the north-west with the armour. The sandal, water, unbroken rice, curd, and dūrvā (grass) are placed in small cups (made of leaves).
7-8. The chamber having been encircled by three threads,. the articles kept ready should be thrown again. Then in one’s. own order of adoration one should offer perfumes and (other) articles, at the foot of the gate or at the pitcher of Viṣṇu with sacred syllables. One should then worship the radiant, beautiful form of Viṣṇu capable of destroying all sins.
9. “I conceive on thy limbs, the deity who grants all coveted things”. After having worshipped him by (showing) the incense, lamp etc., one should approach the gate-way.
10. One should offer pavitra[1] along with perfumes, flowers and unbroken grains. The radiant pavitra of Viṣṇu (is capable) of destroying all sins.
11. I hold on my limbs (the pavitra) for the accomplishment of virtue, desire and worldly benefits. The pavitra is-offered to the other attendant deities and to the preceptor (seated) on a seat.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 247 / Osho Daily Meditations - 247 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 247. అశాంతి 🍀*
*🕉. మానవుడు దాదాపు ఎనిమిది గంటల శ్రమతో ప్రకృతిచే సృష్టించబడ్డాడు. క్రమంగా, నాగరికత పురోగమిస్తున్నందున, సాంకేతికత మానవ శ్రమను ఎక్కువగా స్వాధీనం చేసుకున్నందున, మనకు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏమీ లేదు. అది ఇప్పడు సమస్యగా మారింది. 🕉*
*గతంలో, ప్రజలు భరించేంత శక్తి లేకపోవడంతో బాధపడ్డారు. ఇప్పుడు మనం వాడే శక్తి కంటే ఎక్కువ శక్తితో బాధపడుతున్నాం. అది అశాంతి, న్యూరోసిస్, పిచ్చిగా మారుతుంది. శక్తి ఉండి, సరిగ్గా ఉపయోగించకపోతే అది పుల్లగా మారుతుంది, చేదుగా మారుతుంది. మేము ప్రతిరోజూ శక్తిని సృష్టిస్తాము మరియు దానిని ప్రతిరోజూ ఉపయోగించాలి. మీరు దానిని కూడబెట్టు కోలేరు; మీరు దాని గురించి దురదృష్టవంతులు కాలేరు. గతంలో వేటగాళ్లుగా, రైతులుగా కష్టపడి పనిచేసేవారు. ఆ రకమైన పని అంతరించి పోయింది. సమాజాలు మరింత సంపన్నమైనవి మరియు మరింత శక్తిని కలిగి ఉన్నాయి కాబట్టి అశాంతి తప్పదు. అందువల్ల అమెరికన్లు ప్రపంచంలో అత్యంత విరామం లేని వ్యక్తులు, మరియు అందులో భాగంగా వారు అత్యంత సంపన్న సమాజం.*
*ప్రస్తుతం పనిని సులువుగా చేయాలనే ఆలోచనను మనం విరమించుకోవాలి-ఎందుకంటే అది గతం. శక్తి తక్కువగా ఉన్నప్పుడు మరియు పని ఎక్కువగా ఉన్నప్పుడు, దానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు అది విలువైనది కాదు. కాబట్టి మీ శక్తిమంతమైన ఆటలు, పరిగెత్తడం వంటి వాటిని ఉపయోగించడానికి మార్గాలను కనుగొనండి --మరియు దానిలో ఆనందించండి. శక్తిని ఖర్చు చేయండి, ఆపై మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతత బలవంతపు నిశ్చలతకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీరు మిమ్మల్ని బలవంతం చేయవచ్చు, మీరు శక్తిని ఎక్కువ కలిగి ఉన్నప్పుడు దానిని అణచివేయవచ్చు, కానీ అది మీరు అగ్నిపర్వతం మీద కూర్చున్నట్టు వుంటుంది, మరియు లోపల స్థిరమైన వణుకు ఉంటుంది. మీరు నిలువ వున్న శక్తిని ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత తాజా శక్తి అందుబాటులోకి వస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 247 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 247. RESTLESSNESS 🍀*
*🕉. The human being is created by nature for almost eight hours' hard work. By and by, as civilization has progressed and technology has taken over much of human labor, we don't have anything that requires hard work, and that has become a problem. 🕉*
*In the past, people suffered because they didn't have enough energy to cope. Now we are suffering from more energy than can be used. That can become restlessness, neurosis, madness. If energy is there and not used rightly it goes sour, becomes bitter. We create energy every day, and it has to be used every day. You cannot accumulate it; you cannot be a miser about it. In the past, people were working hard as hunters and farmers. By and by that kind of work has disappeared, and societies are more affluent and have more and more energy; so restlessness is bound to be there. Hence the Americans are the most restless people in the world, and part of it is that they are the most affluent society.*
*We should drop the idea of utility-because that is of the past. When energy was less and work was more, utility had meaning. Now it is no longer a value. So find ways to use your energy games, jogging, running--and delight in it. Use the energy, and then you will feel very calm. That calmness will be totally different from a forced stillness. You can force yourself, you can have energy and repress it, but you are sitting on a volcano, and there is a constant trembling inside. The more energy you use, the more fresh energy will become available.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 405 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀*
*🌻 405. 'శివదూతీ' - 2 🌻*
*అట్లే పుణ్య స్త్రీ ఎదురుగా వచ్చుట, ఆహారము గొనుచున్న జంతువు గోచరించుట, జంతువులుగాని పక్షులు గాని ఎడమ నుండి కుడికి దారిన సాగుట, పండ్లు పాలు మంగళకర ద్రవ్యములు కన్పట్టుట- ఇత్యాది శకునము లన్నియూ శ్రీమాత పంపు శుభ శకునములు. శకునములను గూర్చి ప్రత్యేకముగ ఒక శాస్త్రమున్నది. ఈ శాస్త్రము ద్వారా రాబోవు శుభములు తెలియవచ్చును. ప్రకృతి యందీ విధముగ దూతల ద్వారా శ్రీమాత సందేశములను పంపు చుండును. అట్లే తన దర్శన స్పర్శన సందేశములను కూడ పంపును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih
Shivaduti shivaradhya shivamurtishivankari ॥ 88 ॥ 🌻*
*🌻 405. 'Shivadhooti' - 2 🌻*
*Similarly, a pious woman coming in front of you, an animal munching on food, animals or birds moving from left to right, appearance of fruits, milk and other auspicious things - all these omens are good omens sent by Srimata. There is a special science about omens. The auspicious things to come can be known through this science. In these manners, Mother's messages are sent through various messengers of nature. She also sends messages of clairvoyance, clairaudience, and of divine touch.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments