top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 13 - OCTOBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀

🌹🍀 13 - OCTOBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 11 - OCTOBER - 2022 TUESDAY గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 77 / Kapila Gita - 77 🌹 సృష్టి తత్వము - 33

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 116 / Agni Maha Purana - 116 🌹

4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 251 / Osho Daily Meditations - 251 🌹

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 407 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 407 -2 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹13, October 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi 🌻*


*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 13 🍀*


*13. ముగ్ధేందునిష్యందవిలోభనీయాం మూర్తిం తవానంద సుధాప్రసూతిం*

*విపశ్చితశ్చేతసి భావయంతే వేలాముదారామివ దుగ్ధ సింధోః ॥*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఒక అసత్యాన్ని ఖండించడమో, ఒక అశుభాన్ని నివారించడమో చేయవలసిన సందర్భంలో కూడ మనం చింతించ వలసినది సత్యాన్ని గురించీ, శుభాన్ని గురించే కాని, అసత్యాన్ని గురించీ, అశుభాన్ని గురించీ కాదు. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ చవితి 27:10:45 వరకు

తదుపరి కృష్ణ పంచమి

నక్షత్రం: కృత్తిక 18:42:39 వరకు

తదుపరి రోహిణి

యోగం: సిధ్ధి 13:53:44 వరకు

తదుపరి వ్యతీపాత

కరణం: బవ 14:33:34 వరకు

వర్జ్యం: 05:55:30 - 07:37:34

దుర్ముహూర్తం: 10:04:19 - 10:51:29

మరియు 14:47:16 - 15:34:26

రాహు కాలం: 13:30:38 - 14:59:04

గుళిక కాలం: 09:05:22 - 10:33:48

యమ గండం: 06:08:32 - 07:36:57

అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:25

అమృత కాలం: 16:07:54 - 17:49:58

సూర్యోదయం: 06:08:32

సూర్యాస్తమయం: 17:55:55

చంద్రోదయం: 20:28:22

చంద్రాస్తమయం: 09:03:33

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: వృషభం

లంబ యోగం - చికాకులు, అపశకునం

18:42:39 వరకు తదుపరి ఉత్పాద

యోగం - కష్టములు, ద్రవ్య నాశనం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. కపిల గీత - 77 / Kapila Gita - 77🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 33 🌴*


*33. అర్థాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుర్లింగత్వమేవ చ|*

*తన్నాత్రత్వం చ నభసో లక్షణం కవయో విదుః॥*


*పదార్థమును బోధింప చేయుట, వక్త ఎదురుగా ఉన్నను, చాటుగా ఉన్నను అతనిని గుర్తించునట్లు చేయుట, ఆకాశము యొక్క సూక్ష్మతన్నాత్ర రూపముగా అగుట - అనునవి శబ్దము యొక్క లక్షణములు అని విద్వాంసులు చెప్పెదరు.*


*శబ్దం అంటే ఏమిటి: శబ్దమంటే అర్థమునకు ఆశ్రయం. ఒక వస్తువును చూడగానే "ఇది వస్త్రమూ, ఇది గోడ " అంటాము. గోడ, వస్త్రము అనేది శబ్దము. దాన్ని వస్తువును చూచి చెబుతున్నాము. అంటే అర్థమునకు ఆశ్రయం. భగవంతుని గురించి చెప్పేది శబ్దం. పరమాత్మ శబ్దముతోనే తెలియబడతాడు. తెలిసినట్లు తెలవడానికి తెలిపేది శబ్దం, "నేను ఫలానా వస్తువూ చూచాను" అని శబ్దముతోటే చెబుతాము. చూచేవాడికి కూడా శబ్దమే ప్రమాణం (ద్రష్టుః లింగం). చూచిన వాటికీ ప్రమాణం, చూచినట్లు ప్రమాణం. ఒక వస్తువును చూచినట్లు నమ్మించాలి అంటే అది ఎలా ఉంటుందో చెప్పాలి. తెలుసుకున్నవాడు తెలుసుకున్నది తెలుసుకున్నట్లు చెప్పాలంటే ప్రమాణం శబ్దం.*


*ఆకాశం అంటే ఏమిటి? శబ్దము గుణముగా కలిగినది ఆకాశం. ధ్వని కలిగించేది ఆకాశం. ధ్వనికి మూలం రెండు వస్తువుల ఒరిపిడి. దూరముగా ఉన్నవి దగ్గరైతే ఘర్షణ అంటాము. ఒక చోట ఉన్న ఆకాశాన్ని అనాకాశముగా చేయాలి.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 77 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 33 🌴*


*33. arthāśrayatvaṁ śabdasya draṣṭur liṅgatvam eva ca*

*tan-mātratvaṁ ca nabhaso lakṣaṇaṁ kavayo viduḥ*


*Persons who are learned and who have true knowledge define sound as that which conveys the idea of an object, indicates the presence of a speaker screened from our view and constitutes the subtle form of ether.*


*It is very clear herein that as soon as we speak of hearing, there must be a speaker; without a speaker there is no question of hearing. Therefore the Vedic knowledge, which is known as śruti, or that which is received by hearing, is also called apauruṣa. Apauruṣa means "not spoken by any person materially created." It is stated in the beginning of Śrīmad-Bhāgavatam, tene brahma hṛdā. The sound of Brahman, or Veda, was first impregnated into the heart of Brahmā, the original learned man (ādi-kavaye). How did he become learned? Whenever there is learning, there must be a speaker and the process of hearing. Every word we hear has a meaning behind it. As soon as we hear the word "water," there is a substance—water—behind the word.*


*Similarly, as soon as we hear the word "God," there is a meaning to it. If we receive that meaning and explanation of "God" from God Himself, then it is perfect. But if we speculate about the meaning of "God," it is imperfect. When we speak of seeing, there must be form. By our sense perception, the beginning experience is the sky. Sky is the beginning of form. And from the sky, other forms emanate. The objects of knowledge and sense perception begin, therefore, from the sky.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 116 / Agni Maha Purana - 116 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 37*


*🌻. సర్వదేవ పవిత్రారోపణ విధి - 1🌻*


అగ్నిదేవుడు చెప్పెను:- ఇపుడు సమస్తదేవతాపవిత్రారోపణవిధానమును సంక్షేపముగ చెప్పుచున్నాను. వినుము. పైన చెప్పిన లక్షణములు గల పవిత్రములనే దేవతలకు సమర్పింపవలెను. వాటిలో "స్వరసము" "అనలగము" అని రెండు భేదములున్నవి. మొదట ఇష్టదేవతను ఈ క్రింద చెప్పిన విధముగ ఆహ్వానింపవలెను. -


"జగత్తునకు కారణమైన బ్రహ్మాదేవా! పరివారసహితుడవై ఇచటకు రమ్ము. నేను ని న్నాహ్వానించుచున్నాను. రేపు ప్రాతఃకాలమునందు నీకు పవిత్రకము సమర్పింపగలడు". మరునాడు మరల ఈ విధముగ ప్రార్థించుచు పవిత్రకములు సమర్పింపవలెను. " జగతృష్టికర్తలైన విధాతా! నీకు నమస్కారము. ఈ పవిత్రకమును స్వీకరింపుము. నా పవిత్రత్వము కొరకై నీకు దీనిని సమర్పించుచున్నాను. ఇది సంవత్సర మంతయు జరుగు పూజఫలము నిచ్చునది."


"వేదవేత్తలను రక్షీంచు శివా! దేవా! నీకు నమస్కారము. ఈ పవిత్రకమును స్వీకరింపుము. దీనిచే మణులతో పగడములతో, మందార కుసుమాదులతో నీకు సంవత్సర మంతయు చేయు పూజ దీనిచే సంపన్న మగుగాక". "ఓ పవిత్రకమా! నేను చేయు ఈ వార్షికపూజను యథావిధిగ సుసంపన్నము చేసి, నీవు స్వర్గలోకమునకు పొమ్ము".


సూర్యదేవా! నీకు నమస్కారము. ఈ పవిత్రకము స్వీకరింపుము. పవిత్రము చేయగల దును ఉద్ధేశ్యముతో దీనిని నీకు సమర్పించుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజకు ఫలము నివ్వగలదు." "గణశా! నీకు నమస్కారము. ఈ పవిత్రము స్వీకరింపుము. పవిత్రము చేయుటకై దీనిని ఇచ్చుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజ ఫల మిచ్చును."


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 116 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 37*

*🌻 The investiture of sacred thread for all gods - 1 🌻*


Agni said:


1. Listen to (the description of the mode of) investiture for all deities. The thread is the primary characteristic as. well as its yellow orpiment.


2. O the cause of the universe! come here along witḥ the attendant gods. I invite you in the morning and offer this sacred thread.


3. O the creator of the universe. Salutations to you! Accept this sacred thread for the sake of purification (and which) conveys the fruits of the annual worship.


4. O God Śiva! Salutations to you! Accept this sacred thread along with garlands of gems and corals and mandāra flowers.


5-6. O lord of the learned in the Vedas! Let this be your annual worship. After having accomplished this annual worship of mine according to the rules, O articles of worship! go to heavens after being discarded by me. O lord Sun! Salutations to you. Accept this article of worship.


7. O Lord Śiva! Salutations to you. Accept this article of worship which is capable of yielding fruits of annual worship for the sake of purification.


8. O lord of gaṇas! Salutations to you. Accept this article of worship which is capable of yielding fruits of anual worship for the sake of purification.


9. O goddess Śakti! Salutations to you. Accept this.article of worship which is capable of yielding fruits of annual worship for the sake of purification.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹







*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 251 / Osho Daily Meditations - 251 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 251. స్వయంచాలక నియంత్రణ 🍀*


*🕉. నవ్వులో, ఏడుపులో, ప్రేమలో, కోపంలో --ఎప్పుడూ పరిమితిని మించకూడదని మనకు నేర్పించ బడింది. 🕉*


*ప్రతి దానికీ ఒక పరిమితి ఉంది, మరియు మనం పరిమితికి మాత్రమే అనుమతించ బడ్డాము, ఆపై మేము వెనక్కి తగ్గాలి. నవ్వులో, ఏడుపులో, ప్రేమలో, కోపంలో --ఎప్పుడూ పరిమితిని మించ కూడదని మనకు నేర్పించ బడింది. సుదీర్ఘ నియంత్రణ తర్వాత ఇది స్వీయ నియంత్రణ యంత్రం లాగా దాదాపు స్వయం చాలకం అవుతుంది. మీరు కొంత వరకు వెళతారు, అప్పుడు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలో ఏదో జరుగుతుంది. నేను అనియంత్రణను నేర్పుతాను, ఎందుకంటే నియంత్రణ లేనప్పుడు మాత్రమే మీరు స్వేచ్ఛ పొందుతారు.*


*తారుమారు చేయడానికి, నిర్దేశించడానికి వెనుక మనస్సు లేకుండా శక్తి ఆకస్మికంగా కదులుతున్నప్పుడు, విపరీతమైన ఆనందం ఉంటుంది. చెట్లు తక్కువ స్థాయిలో ఉంటాయి కానీ మరింత ఆనందంగా ఉంటాయి. మరియు జంతువులు కూడా; అవి తక్కువ స్థాయిలో ఉంటాయి కానీ మరింత ఆనందంగా ఉంటాయి. అందుకు కారణం వాటికి ఎలా నియంత్రించు కోవాలో తెలియకపోవడమే. చెట్లు, పువ్వులు మరియు పక్షుల కంటే మనం చాలా ఆనందంగా ఉండగలము, కానీ మనం ఒక ఉచ్చును నివారించాలి, మనల్ని మనం నియంత్రించుకునే ఉచ్చు.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 251 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 251. THERMOSTAT 🍀*


*🕉. We have been taught never to get out of control in anything -- in laughter, in crying, in love, in anger--never to go beyond the limit. 🕉*


*There is a limit to everything, and we have been allowed only up to the limit, and then we have to hold back. After a long conditioning it becomes almost automatic, like a thermostat. You go to a certain extent, then suddenly something happens in the unconscious. Something clicks, and you stop. I teach how to "uncontrol," because only in uncontrol will you become free. And when the energy is moving spontaneously with no mind behind it to manipulate, to direct, to dictate, then there is tremendous bliss.*


*The trees exist on a lower plane but are more blissful. And so are the animals; they exist on a lower plane but are more blissful. And the reason is that they don't know how to control. We can be more blissful than the trees and the flowers and the birds, but we have to avoid one trap, the trap of controlling ourselves.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹





*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 407 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 407 - 2🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।*

*శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀*


*🌻 407. 'శివమూర్తి'- 2 🌻*


*'శివమూర్తి' అనగా మంగళకరమగు మూర్తి అని అర్థము. మంగళకరమగు రూపములన్నియూ శ్రీమాత రూపములే. వానియం దామె సాన్నిధ్యము మిక్కుటముగ నుండును. ఈ కారణముగనే మన సంప్రదాయమున సర్వమూ మంగళప్రదముగ ఏర్పరచుకొనుట జరుగు చున్నది. గృహమున మామిడి తోరణములు, ముఖ ద్వారము వద్ద ముగ్గులు, గడపలకు పసుపు కుంకుమలు, ఇంటియందు సుగంధ ద్రవ్యములు, దీపములు, గంధము, పసుపు, కుంకుమ- ఇత్యాది వస్తువుల వాడకము, ప్రభాతమున మంగళ వాయిద్యములు, ఇంటి యందు దూడతో కూడిన ఆవు, ముత్తైదువ, పువ్వులు పండ్లు- ఇట్లు ఎన్నియో మన సంప్రదాయమున పెద్దలు మంగళకరమగు వస్తువులను మరియు ఆచారములను చేర్చిరి. ఇవి అన్నియూ శివప్రదములు, శివమూర్తులు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 407 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*


*🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih*

*Shivaduti shivaradhya shivamurti shivankari ॥ 88 ॥ 🌻*


*🌻 407. 'Shivamurthi'- 2 🌻*


*'Shivamurthy' means the personification of auspice. All the forms of auspices are forms of Sri Mata only. Srimata is closely associated with auspices. It is for this reason that in our tradition, everything is done auspiciously with good will. Mango arches in the house, Rangolis at the front door, Turmeric in the doorways, fragrant oils in the house, lamps, sandalwood, turmeric, saffron - use of such auspicious instruments at dawn, cow with calf in the house, woman with husband, flowers and fruits - like these many things and good customs, elders declared them as auspicious in our tradition. These are all bringers and personifications of auspices.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page