🌹🍀 19 - DECEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 19 - DECEMBER - 2022 MONDAY, సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 297 / Bhagavad-Gita -297 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -18వ శ్లోకము.
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 659 / Sri Siva Maha Purana - 659 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 010 / DAILY WISDOM - 010 🌹 10. విముక్తి పొందిన వ్యక్తికి విశ్వంతో సంబంధం లేదు - The Liberated One has No Relatin to the Universe
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 275 🌹
6) 🌹. శివ సూత్రములు - 12 / Siva Sutras - 12 🌹. 4. జ్ఞానాధిష్ఠానం మాతృక - 3 - Jñānādhiṣṭhānaṁ mātṛkā - 3
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹19, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సఫల ఏకాదశి, Saphala Ekadashi 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 12 🍀*
*21. ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరిరుహో నభః |*
*సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః*
*22. అధర్షణో ధర్షణాత్మా యజ్ఞహా కామనాశకః |*
*దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సర్వార్పణ బుద్ధి - ఏవో కొన్ని భౌతిక వస్తువులను లేక ఏవో కొన్ని కోరికలను వదలుకొనడం ఇవే బలి సమర్పణమని భావించబోకు. ప్రతి ఆలోచనా, ప్రతి కర్మ, ప్రతి భోగానుభవం - అంతా నీలోని భగవంతునికి సమర్పణ చెయ్యి. భగవంతునిలోనే నీ పద సంచారం జరగనీ. నీ నిద్ర, నీ మెలకువ కూడ నివేదన చెయ్యి. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 26:33:04 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: చిత్ర 10:31:23 వరకు
తదుపరి స్వాతి
యోగం: అతిగంధ్ 27:21:36 వరకు
తదుపరి సుకర్మ
కరణం: బవ 15:02:42 వరకు
వర్జ్యం: 15:58:36 - 17:32:12
దుర్ముహూర్తం: 12:35:08 - 13:19:31
మరియు 14:48:17 - 15:32:39
రాహు కాలం: 08:03:19 - 09:26:32
గుళిక కాలం: 13:36:10 - 14:59:22
యమ గండం: 10:49:44 - 12:12:57
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:34
అమృత కాలం: 04:04:04 - 05:40:48
మరియు 25:20:12 - 26:53:48
సూర్యోదయం: 06:40:07
సూర్యాస్తమయం: 17:45:47
చంద్రోదయం: 02:17:25
చంద్రాస్తమయం: 14:12:58
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ముద్గర యోగం - కలహం
10:31:23 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 298 / Bhagavad-Gita - 298 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 18 🌴*
*18. ఉదారా: సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |*
*ఆస్థిత: స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్*
🌷. తాత్పర్యం :
*ఈ భక్తులందరును నిస్సంశయముగా ఉదాత్తులే యైనను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైనవానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవ యందు నియుక్తుడై నందున అతడు అత్యుత్తమ మరియు పరమగతియైన నన్ను తప్పక పొందగలడు.*
🌷. భాష్యము :
జ్ఞానమునందు పూర్ణత్వము లేని భక్తులు శ్రీకృష్ణభగవానునకు ప్రియులు కాజాలరని ఎన్నడును భావింపరాదు. భక్తులందరును ఉదాత్తులేయని భగవానుడు పలుకుచున్నాడు. ఏ ప్రయోజనము కొరకైనను భగవానుని దరిచేరువారలు మాహాత్ములని పిలువబడుటయే అందులకు కారణము. తామొనరించు భక్తికి ప్రతిఫలముగా ఏదేని లాభమును కోరు భక్తులను సైతము భగవానుడు ఆమోదించును. వారి భక్తి యందు ప్రేమభావ వినిమయము ఉండుటయే అందులకు కారణము. ఆ ప్రేమలోనే వారు భగవానుని కొంత విషయలాభమును గోరి, అది ప్రాప్తించిన పిమ్మట తృప్తి చెంది మరింతగా భక్తిలో పురోగతి నొందుదురు.
కాని జ్ఞానపూర్ణుడైన భక్తుడు కేవలము భక్తి, ప్రేమలతో శ్రీకృష్ణభగవానుని సేవించుటయే ఏకైక ప్రయోజనముగా భావించి యున్నందున ఆ భగవానునికి అత్యంత ప్రియుడగును. అట్టివాడు భగవానుని తలచకుండా లేదా అతనిని సేవించకుండా క్షణకాలమును జీవింపలేడు. అదే విధముగా భగవానుడు సైతము అట్టి భక్తుని యెడ మిగుల ప్రియుడై యుండి అతని నుండి దూరుడు కాకుండును.
శ్రీమద్భాగవతము (9.4.68) నందు భగవానుడు ఇట్లు పలికెను.
సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహమ్ |
మదన్యత్ తే న జానన్తి నాహం తేభ్యో మనాగపి
“భక్తులు సదా నా హృదయమునందు నిలిచియుందురు మరియు నేనును సదా భక్తుల హృదయమునందు వసింతును. వారు నన్ను తప్ప అన్యమును ఎరుగరు మరియు నేనును వారిని ఎన్నడును మరువను. నాకు, వారికి నడుమ ఒక సన్నిహిత సంబంధము కలదు. అట్టి జ్ఞానపూర్ణులైన శుద్ధభక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడును దూరము కానందునే నాకు అత్యంత ప్రియులై యున్నారు.”
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 298 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 7 - Jnana Yoga - 18 🌴*
*18. udārāḥ sarva evaite jñānī tv ātmaiva me matam*
*āsthitaḥ sa hi yuktātmā mām evānuttamāṁ gatim*
🌷 Translation :
*All these devotees are undoubtedly magnanimous souls, but he who is situated in knowledge of Me I consider to be just like My own self. Being engaged in My transcendental service, he is sure to attain Me, the highest and most perfect goal.*
🌹 Purport :
It is not that devotees who are less complete in knowledge are not dear to the Lord. The Lord says that all are magnanimous because anyone who comes to the Lord for any purpose is called a mahātmā, or great soul. The devotees who want some benefit out of devotional service are accepted by the Lord because there is an exchange of affection. Out of affection they ask the Lord for some material benefit, and when they get it they become so satisfied that they also advance in devotional service. But the devotee in full knowledge is considered to be very dear to the Lord because his only purpose is to serve the Supreme Lord with love and devotion. Such a devotee cannot live a second without contacting or serving the Supreme Lord. Similarly, the Supreme Lord is very fond of His devotee and cannot be separated from him.
In the Śrīmad-Bhāgavatam (9.4.68), the Lord says:
sādhavo hṛdayaṁ mahyaṁ
sādhūnāṁ hṛdayaṁ tv aham
mad-anyat te na jānanti
nāhaṁ tebhyo manāg api
“The devotees are always in My heart, and I am always in the hearts of the devotees. The devotee does not know anything beyond Me, and I also cannot forget the devotee. There is a very intimate relationship between Me and the pure devotees. Pure devotees in full knowledge are never out of spiritual touch, and therefore they are very much dear to Me.”
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 659 / Sri Siva Maha Purana - 659 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 17 🌴*
*🌻. గణేశుడు మరల జీవించుట - 3 🌻*
ఇపుడు గిరిజా దేవి ప్రసన్నురాలైనచో మనకు స్వస్థత చేకూరును. లేనిచో కోటి ప్రయత్నములను చేసిననూ ప్రయోజనము లేదు (20). శివుడు కూడా లోకపు పోకడను అనుసరించి దుఃఖితుడాయెను. అనేక లీలలను నెరపుటలో పండితుడగు శివుడు ఆ సమయములో అందరినీ మోహింపజేసెను (21). దేవతలందరి నడుము విరిగెను. క్రోధముతో మండిపడుతున్న పార్వతి యెదుట నిలబడుటకు వారెవ్వరూ సాహసించలేదు (22). ఓ మునీ! తనవాడు గాని, పరాయి వాడు గాని, దేవత గాని, రాక్షసుడు గాని, గణములు గాని, దిక్ పాలకుడు గాని, యక్షుడు గాని, కిన్నరుడు గాని, మహర్షి గాని, (23), విష్ణువు గాని, బ్రహ్మ గాని, శంకర ప్రభుడు గాని ఒక్కడైననూ గిరిజా దేవి యెదుట పిలబడుటకు సమర్ధుడు కాలేకపోయెను (24).
మండిపడుతూ సర్వమును కాల్చివేసే ఆ తేజస్సును చూచి వారందరు మిక్కిలి భీతిల్లి బహుదూరములో నిలబడిరి (25). ఓ నారదమునీ! ఇంతలో దివ్యమగు దర్శనము గల నీవు దేవతలకు, గణములకు సుఖమును కలిగించుట కొరకై అచటకు వచ్చితివి (26). బ్రహ్మనగు నాకు, శివునకు, విష్ణువునకు ప్రణమిల్లి దగ్గరకు వచ్చి నీవు అందరినీ కలిసి కర్తవ్యమును గూర్చి విచారించితివి(27). దేవతలందరు మహాత్ముడవగు నిన్ను సంప్రదించిరి. వారు నిన్ను ' ఈదుఃఖము శాంతిచు విధమెయ్యది?' అని ఏకకంఠముతో ప్రశ్నంచిరి(28).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 659🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 17 🌴*
*🌻 The Resuscitation of Gaṇeśa - 3 🌻*
20. “Only when the goddess Pārvatī is pleased can there be a relief; not otherwise, even with our maximum efforts.
21. Even Śiva who is an expert in different sports and is deluding us all, seems distressed like an ordinary man.
22. When the hips of all the gods are broken and Pārvatī is fiery in rage, none of them dare stand before her.
23-24. Whether a person belonging to her or to others, whether a god, a demon, a Gaṇa, a guardian of the quarters, a Yakṣa, a Kinnara, a Sage, Brahmā, Viṣṇu or even lord Śiva himself, none could stand before Śiva.
25. On seeing her dazzling brilliance, burning all round, all of them were frightened and they stayed far away.
26. In the meantime, O sage Nārada, you of divine vision came there for the happiness of the gods and Gaṇas.
27. After bowing to me, Brahmā, Viṣṇu and Śiva and discussing jointly, he said—“Let us think and act together.”
28. The gods then discussed with you of noble soul “How could our misery be quelled.” They then said.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 10 / DAILY WISDOM - 10 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 10. విముక్తి పొందిన వ్యక్తికి విశ్వంతో సంబంధం లేదు 🌻*
*సంపూర్ణత్వంలో బాహ్యానికి అంతరానికి అంతర్గత సంబంధం లేనట్లైతే, విముక్తి పొందిన వ్యక్తి కూడా విశ్వంతో అలాంటి సంబంధాన్ని కలిగి ఉండడు, ఎందుకంటే వ్యక్తి మరియు విశ్వం యొక్క భేదం సంపూర్ణత్వంలో చెరిపివేయబడుతుంది. అలాగే, 'విముక్తి అంటే సంపూర్ణత్వం యొక్క అనుభవం' అని మరియు 'విముక్తి పొందిన ఆత్మ ఇతరులను విమోచించే పనిపై శ్రద్ధ వహిస్తుంది అని, విముక్తి పొందిన తర్వాత కూడా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది' అని చెప్పడం అశాస్త్రీయం.*
*సాపేక్ష కార్యాచరణ మరియు సంపూర్ణత్వం రెండూ ఒకే సిద్ధాంతంలో భాగం కాలేవు. ఈ రెండూ ఒకేసారి ఉంటాయని వాదిస్తే, ఆ సిద్ధాంతంలో శాస్త్రీయత లోపిస్తుంది. సంపూర్ణత్వానికి రెండవది ఏమీ లేదు, అందువల్ల అక్కడ కోరిక మరియు చర్య లేదు. సంపూర్ణత్వం కంటే తక్కువగా ఉన్న ఏదైనా ముక్త స్థితిగా పరిగణించబడదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 10 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 10. The Liberated One has No Relatin to the Universe 🌻*
*If the Absolute does not have any external or internal relation to itself, the liberated one cannot have any such relation to the universe, because the distinction of the individual and the universe is negated in the Absolute. It is illogical to say, at the same time, that “liberation means Absolute-Experience” and that “the liberated soul is concerned with the work of redeeming others, and even on getting liberated, retains its individuality.”*
*Relative activity and Absolute Being are not consistent with each other. If it is argued that both these are compatible, it is done at the expense of consistency. The Absolute has nothing second to it, and hence no desire and no action. Anything that falls short of the Absolute cannot be regarded as the state of Liberation.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 275 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మన అస్తిత్వం సమస్త ఆకాశాన్ని కోరుతుంది. లేని పక్షంలో ప్రతిదీ నిశ్చేతనంగా నిలబడిపోతుంది. మనిషి ఎటువంటి హద్దులకు సంతృప్తి పడకూడదు. ఎప్పుడు ఎటువంటి హద్దు ఎదురయినా దాన్ని దాటి వెళ్ళాలి. 🍀*
*పరిమితుల్లో వుండడం అంటేే చీకటిలో వుండడమే. అమర్యాదకరమే. కారణం మన అస్తిత్వం సమస్త ఆకాశాన్ని కోరుతుంది. అప్పుడే అది నాట్యం చేస్తుంది. పాట పాడుతుంది. లేని పక్షంలో ప్రతిదీ నిశ్చేతనంగా నిలబడిపోతుంది. అప్పుడు విహరించడానికి ఆకాశముండదు. కదలడానికి స్థలముండదు. అప్పుడు మనిషి హద్దుల్లో వుండాలి.*
*శరీర హద్దులో, మనసు హద్దులో, ఉద్వేగాల హద్దులో ఆగాలి. ఇవి హద్దులకున్న పరిమితులు. ఈ హద్దుల్ని రూపాంతరం చెందించాలి. మనిషి ఎటువంటి హద్దులకు సంతృప్తి పడకూడదు. ఎప్పుడు ఎటువంటి హద్దు ఎదురయినా దాన్ని దాటి వెళ్ళాలి. అన్నిట్నీ మార్చాలి. నువ్వు శాశ్వతత్వాన్ని సమీపించినపుడు నువ్వు అస్తిత్వాన్ని సమీపిస్తావు. ఇంటికి చేరుతావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 12 / Siva Sutras - 12 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻4. జ్ఞానాధిష్ఠానం మాతృక - 3 🌻*
*🌴. తల్లి నుండి జ్ఞానానికి ఆధారం అక్షరాలు.🌴*
*మాతృకగా, ఆమె వాచకం మరియు వాక్యం రెండింటినీ నియంత్రిస్తుంది. వాచకం అక్షరాలను సూచిస్తుంది మరియు వాక్కు అనేది వాచకం ద్వారా సూచించబడిన వస్తువులను సూచిస్తుంది. అక్షర సమూహం వాచకం. ఆ అమరిక యొక్క అర్థం వాక్కు. వాక్యానికి మూలం వాచకం. అమ్మ శబ్దాన్ని ఉద్భవింపజేసింది, లేదా శబ్దానికి కారణం అవుతుంది కాబట్టి, ఆమెను శబ్ద బ్రహ్మం అంటారు. ఆమె వర్ణమాలలకు మూలం మరియు వాటి ధ్వని (ఉచ్చారణ) ద్వారా వస్తువులు తెలుసుకుంటారు. అందుకే శక్తి విశ్వం యొక్క సృష్టికర్తగా పిలువబడుతుంది.*
*వస్తుమయ ప్రపంచాన్ని సృష్టిస్తున్నప్పుడు, ఆమె భ్రాంతికరమైన మాయా ప్రపంచాన్ని కూడా సృష్టించింది. ఈ మాయ వలన ఆమెను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇది సూత్రం 2లో చర్చించి నట్లుగా అజ్ఞానానికి దారి తీస్తుంది. ఈ సహజమైన అజ్ఞానం కారణంగా, ఏకత్వ భావనను కోల్పోయి వస్తువుల మధ్య భేదం తద్వారా వాటి మధ్య వ్యత్యాసాన్ని సృష్టించుకుంటారు. బ్రహ్మం సర్వవ్యాపి అయినప్పుడు, ఈ విశ్వంలో ఉన్న వస్తువులన్నీ కేవలం అతని ప్రతిబింబాలు మాత్రమే. కానీ అజ్ఞానం కారణంగా, వివిధ పేర్లతో వివిధ ఆకారాలు మరియు రూపాలను గమనిస్తాడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 12 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻4. Jñānādhiṣṭhānaṁ mātṛkā - 3 🌻*
*🌴. The basis of knowledge from Mother is alphabets.🌴*
*As Mātṛkā, She controls both vācakā and vācyā. Vācakā refers to the letters and vācyā refers to the objects referred by vācakā. For example ‘a door’ comprising of alphabets to form the world table, is vācakā and the same table as an object is known as vācyā. The cause of vācyā is vācakā. Since She originates sound, or becomes the cause of the sound, She is called Śabda Brahman. She is the source of alphabets and their sound (pronounciation) through which objects are known. Hence Śaktī is called as the Creator of the universe.*
*While creating the objective world, She also created illusionary world (māyā), causing deception making Her unaffordable to be comprehend fully. This leads to ignorance as discussed in sūtrā 2. Because of this innate ignorance, one develops the ability of differentiation to draw comparisons. When the Brahman is omnipresent, all the objects that exist in this universe are merely His reflections. But due to the inborn ignorance, one notices different shapes and forms by different names.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Comments