🌹🍀 25, JANUARY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 25, JANUARY 2023 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 316 / Bhagavad-Gita -316 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 06 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 163 / Agni Maha Purana - 163 🌹 🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 3 / Characteristics of an image of the Goddess - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 028 / DAILY WISDOM - 028 🌹 🌻 28. మనకు ఏది కావాలో అది మాత్రమే చూస్తాము మరియు పొందుతాము / Whatever We Want, that Alone We See and Obtain🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 293 🌹
6) 🌹. శివ సూత్రములు - 30 / Siva Sutras - 30 🌹
🌻 8. జ్ఞానం జాగృత, 9. స్వప్నో వికల్పం, 10. అవివేకో మాయా సుషుప్తం - 3 / 8.Jñānaṁ jāgrat, 9. Svapno vikalpāḥ, 10. Aviveko māyāsauṣuptam - 5🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹25, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*🍀. గణేశ జయంతి శుభాకాంక్షలు, Ganesha Jayanti Good Wishes to All 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : గణేశ జయంతి, Ganesha Jayanti 🌺*
*🍀. శ్రీ గణేశ హృదయం - 5 🍀*
7. చిత్తప్రకాశం వివిధేషు సంస్థం
లేపావలేపాది వివర్జితం చ |
భోగైర్విహీనం త్వథ భోగకారకం
చింతామణిం తం ప్రణమామి నిత్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సాధకుడు ప్రేమించ వలసినది దైవమును మాత్రమే. అతడలా దైవమును పూర్తిగా ప్రేమించ గలిగినప్పుడే ఇతరులను సక్రమంగా ప్రేమించ గలుగుతాడు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల చవితి 12:35:25 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: పూర్వాభద్రపద 20:06:27
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: పరిఘ 18:15:44 వరకు
తదుపరి శివ
కరణం: విష్టి 12:39:25 వరకు
వర్జ్యం: 03:52:08 - 05:20:40
మరియు 29:14:24 - 30:45:48
దుర్ముహూర్తం: 12:05:41 - 12:50:54
రాహు కాలం: 12:28:17 - 13:53:03
గుళిక కాలం: 11:03:32 - 12:28:17
యమ గండం: 08:14:00 - 09:38:46
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 12:43:20 - 14:11:52
సూర్యోదయం: 06:49:14
సూర్యాస్తమయం: 18:07:20
చంద్రోదయం: 09:42:21
చంద్రాస్తమయం: 21:52:01
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య
ప్రాప్తి 20:06:27 వరకు తదుపరి
లంబ యోగం - చికాకులు, అపశకునం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 316 / Bhagavad-Gita - 316 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 06 🌴*
*06. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యన్తే కలేవరమ్ |*
*తం తమేవైతి కొన్తేయ సదా తద్భావభావిత: ||*
🌷. తాత్పర్యం :
*ఓ కౌంతేయా! దేహమును త్యజించునపుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును.*
🌷. భాష్యము :
అతిక్లిష్టమైన మరణసమయమున మనుజుడు తన భావమును మార్చుకొను విధానము ఇచ్చట వివరింపబడినది. జీవితారంభమున శ్రీకృష్ణుని తలచుచు శరీరమును విడుచువాడు ఆ భగవానుని దివ్యభావమునే పొందగలడు. కాని కృష్ణునకు అన్యమైనదానిని చింతించువాడు సైతము అదే దివ్యస్థితిని పొందగలడనుట ఏమాత్రము సత్యము కాదు. ఈ విషయమును ప్రతియొక్కరు అతిజాగ్రత్తతో గమనింపవలెను. కాని మనస్సు సరియైన స్థితిలో నుండగా మరణించుట ఎట్లు సంభవము? ఉదాహరణమునకు భరతమహారాజు మహానుభావుడే అయినను అంత్యకాలమున ఒక జింకను తలచినందున తదుపరి జన్మలో జింకదేహమును పొందవలసివచ్చెను. జింకదేహములో అతడు పూర్వజన్మ స్మృతులను కలిగియున్నను ఆ జంతుశరీరముననే కొనసాగవలసివచ్చెను. జీవితకాలము నాటి ఆలోచనలే ప్రోగుపడి మరణసమయమున మనుజుని ఆలోచనలను ప్రభావితము చేయును గనుక, ప్రస్తుత దేహమే తరువాతి దేహమును తయారు చేయుచున్నదని పలుకవచ్చును.
అనగా ప్రస్తుత జన్మమున సత్త్వగుణమున నిలిచి సదా శ్రీకృష్ణుని తలచినచో అంత్యకాలమున శ్రీకృష్ణుని స్మరించుట ఎవ్వరికైనను సాధ్యము కాగలదు. అదియే దివ్యమైన శ్రీకృష్ణుని ధామము చేరుటకు మనుజునికి తోడ్పడును. అనగా మనుజడు దివ్యమైన శ్రీకృష్ణసేవలో సంపూర్ణముగా నిమగ్నుడైనచో అతని తరువాతి దేహము దివ్యమే(ఆధ్యాత్మికమే) కాగలదు గాని భౌతికము కాజాలదు. కనుక హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మాహామంత్ర కీర్తనమే అంత్యకాలమున మనుజుని స్థితిని జయప్రదముగా మార్చుటకు ఉత్తమవిధానమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 316 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 06 🌴*
*06. yaṁ yaṁ vāpi smaran bhāvaṁ tyajaty ante kalevaram*
*taṁ tam evaiti kaunteya sadā tad-bhāva-bhāvitaḥ*
🌷 Translation :
*Whatever state of being one remembers when he quits his body, O son of Kuntī, that state he will attain without fail.*
🌹 Purport :
The process of changing one’s nature at the critical moment of death is here explained. A person who at the end of his life quits his body thinking of Kṛṣṇa attains the transcendental nature of the Supreme Lord, but it is not true that a person who thinks of something other than Kṛṣṇa attains the same transcendental state. This is a point we should note very carefully. How can one die in the proper state of mind? Mahārāja Bharata, although a great personality, thought of a deer at the end of his life, and so in his next life he was transferred into the body of a deer. Although as a deer he remembered his past activities, he had to accept that animal body. Of course, one’s thoughts during the course of one’s life accumulate to influence one’s thoughts at the moment of death, so this life creates one’s next life.
If in one’s present life one lives in the mode of goodness and always thinks of Kṛṣṇa, it is possible for one to remember Kṛṣṇa at the end of one’s life. That will help one be transferred to the transcendental nature of Kṛṣṇa. If one is transcendentally absorbed in Kṛṣṇa’s service, then his next body will be transcendental (spiritual), not material. Therefore the chanting of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare is the best process for successfully changing one’s state of being at the end of one’s life.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 163 / Agni Maha Purana - 163 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 50*
*🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 3 🌻*
లక్ష్మి (వైష్ణవీ శక్తి) కుడిచేతులలో చక్ర-శంఖములను, ఎడమ చేతులలో గదా కమలములను ధరించును. వారాహీ శక్తి మహిషముపై ఎక్కి దండ-శంఖ-చక్ర-గదలను ధరించును. ఐంద్రీశక్తి సహస్ర నేత్రములు గలది. ఐరావతముపై ఎక్కి వజ్రము ధరించి యుండును. ఐంద్రీదేవీ పూజ వలన కార్యసిద్ధి లభించును. చాముండ కండ్లు చెట్టు తొఱ్ఱలవలె లోతుగా ఉండును. శరీరము మాంసరహితమై అస్థి పంజరమువలె నుండును. నేత్రములు మూడు. మాంసహీనమగు శరీరమునందు ఆస్థులు మాత్రమే సారముగ మిగిలియుండును జుట్టుపైకి లేచి ఉండును. అణగి ఉండదు. ఏనుగు చర్మమును ధరించును. ఎడమ చేతులలో కపాలము, పట్టిశము, కుడిచేతులలో శూలము, ఖడ్గము ఉండును శవముపై ఎక్కి ఎముకల ఆభరణములు ధరించును.
వినాయకుని ఆకారము మనుష్యా కారసకదృశముగా నుండును. పొట్ట చాల పెద్దది. ముఖము ఏనుగల ముఖము; తొండము చాల పొడవుగా నుండును. యజ్ఞోపవీతము ధరించి యుండును. ముఖము వెడల్పు ఏడుకళలు. తొండము పొడవు ముప్పదియారు అంగుళములు నాడి (కంఠముపై నున్న ఎముక) విస్తారము పండ్రెండు కళలు, మెడ ఒకటిన్నర కళల ఎత్తు ఉండును. కంఠప్రదేశము విస్తారము ముప్పదియారు. అంగుళములు. గుహ్య ప్రదేశము ఒకటిన్నర అంగుళములు. నాభి-ఊరుపుల విస్తారము పండ్రెండు అంగుళములు. కాళ్లు, పాదాల ప్రమాణము కూడ ఇంతయే. కుడి చేతులలో తన దంతమును, పరుశువును. ఎడమచేతులలో లడ్డు, నల్లకలువ ధరించి యుండును.
మయూరారూఢడై ఉన్న కుమారస్వామికి ఇరువైపుల సుముఖీ, బిడాలాక్షి అనుమాతృకలును, శాఖ-విశాఖులను అనుజులనును నిలచి యుందురు. రెండు హస్తములు, బాలరూపము, కుడిచేతిలో శక్తి, ఎడమ చేతిలో కోడి ఉండును. ముఖములు ఒకటి కాని, ఆరుకాని నిర్మింపవచ్చును. గ్రామములోని విగ్రహమునకు ఆరు లేదా పండ్రెండు హస్తములుండవలెను. వనము నందు స్థాపించు విగ్రహమున మాత్రము రెండు భుజములే ఉండవలెన. ఆరు కుడి భుజములలో శక్తి బాణ-పాశ-ఖడ్గ-గదా-తర్జనీ ముద్రలును, ఎడమ చేతులలో నెమలి పింఛము, ధనస్సు, ఖేటము, పతాక, అభయముద్ర, కుక్కటము ఉండవలెను. రుద్రచర్చిక గజచర్మధరించి ఎడమ చేతిలో కాపాలము, కర్తరి ధరించి, కుడి చేతిలో శూల-పాశములను ధరించి, ముఖమును. ఒక పాదమును ఎత్తి ఉండును. ఈ దేవి అష్ట భూజారూపమున గూడ పూజింపబడును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 163 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 50
*🌻Characteristics of an image of the Goddess - 3 🌻*
20. (The form of) Lakṣmī should hold the disc, and conch in the right (hand) (and) the mace and lotus in the left (hand). (The form of) Vārāhī should be mounted on the buffalo and hold the stick, conch, sword and goad.
21-25. (The image of) Aindrī conferring success should be represented as having thousand eyes and holding the thunderbolt in the left hand.
Cāmuṇḍā may have three eyes deeply sunken, a skeleton form devoid of flesh, erectly standing hair, emaciated belly, clad in tigerskin and holding a skull and spear in the left hand and a trident and scissor in the right standing on the dead body of a man and wearing a garland of bones. (The image of) Vināyaka should have a human body, big belly, elephant face, big trunk and sacred thread. The mouth measuring 7 kalās in breadth while the trunk should measure 36 finger-breadths in length. The neck should be 12 kalās in girth and 10 kalās in height. The throat-region should be 36 finger (in length). The space about the region of anus should have the breadth of half a finger.
26. (The region of) the navel and thigh should be of twelve (fingers) as also the leg from the ankle to the knee and the feet. He should be represented as holding his own tusk made into an axe in the right hand and the laḍḍuka (a ball of sweet) and lotus flower in the left.
27. (The image of) Skanda, the lord (of the universe) also known as Śākha and Viśākha, (is represented) as a boy possessing two arms and riding a peacock (with the images of) Sumukhī and Viḍālākṣī[2].
28-29. The god may be represented as having a single face or six faces, six hands or twelve hands carrying the spear and a cock in the right hand. In the village or the forest (it should have) two arms. (He should bear) the spear, arrow, noose, nistriṃśa (sword), goad and tarjanī (a kind of weapon) in the six right hands and the spear in the left hand.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 28 / DAILY WISDOM - 28 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 28. మనకు ఏది కావాలో అది మాత్రమే చూస్తాము మరియు పొందుతాము 🌻*
*కోరికల యొక్క కేంద్రాలు ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు మార్చుకుంటాయి. వాటి వెంట పడుతూ ఆనందాన్ని కోరుకునే వ్యక్తి ఎప్పుడూ అశాంతిలో ఉంటాడు. ఈ కోరికల శృంఖలాల వల్ల జనన మరణ చక్రం కొనసాగుతూ బలోపేతం అవుతూ ఉంటుంది. అజ్ఞానం మరియు చీకటి మధ్య జీవిస్తూ, అహంకారంతో, తాము జ్ఞానులమని అనుకుంటూ, అజ్ఞానులు నిరంతరం తమ రూపాలను మరియు స్వభావాలను మార్చుకునే ఇంద్రియ వస్తువులలో శాంతిని కోరుకుంటారు.*
*వస్తువులకు విలువ వాటి యొక్క బాహ్య రూపానికి ఇవ్వబడింది. ఈ బాహ్య రూపం అనేది పరమాత్మ నుండి తాను వేరు అని, బాహ్య వస్తు సంపర్కం ద్వారా తాను వృద్ధి చెందుతానని అనుకునే ఒక అజ్ఞాన పూరిత సంకల్పశక్తి చేత సృష్టించబడింది. గ్రహించిన దాని స్వభావం గ్రహించిన స్వభావం ద్వారా బలంగా ప్రభావితమవుతుంది. కోరిక యొక్క రూపం మారిన క్షణం, కోరికను ముందుకు తెచ్చే చైతన్యకేంద్రం యొక్క అవసరాలకు అనుగుణంగా వస్తువు కూడా తనను తాను మార్చుకున్నట్లు కనిపిస్తుంది. మనకు ఏది కావాలో, అది మాత్రమే మనం చూస్తాము మరియు పొందుతాము.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 28 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 28. Whatever We Want, that Alone We See and Obtain 🌻*
*The desire-centres shift themselves from one object to another and the pleasure-seeker is left ever at unrest. The chain of metempsychosis is kept unbroken and is strengthened through additional desires that foolishly hope to bring satisfaction to the self. Living in the midst of ignorance and darkness, conceited, thinking themselves learned, the deserted individuals seek peace in the objects of sense that constantly change their forms and natures.*
*The objective value in an object is an appearance created by the formative power of the separative will to individuate and multiply itself through external contact. The nature of that which is perceived is strongly influenced by the nature of that which perceives. The moment the form of the desire is changed, the object also appears to change itself to suit the requirements of the centre of consciousness that projects forth the desire. Whatever we want, that alone we see and obtain.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 293 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మనిషి అపూర్వ అనుభూతి తల్లి గర్భంలో వుంది. వ్యక్తి తను పసిబిడ్డనని, ఈ అనంత విశ్వం తల్లి గర్భమని భావించాలి. ధ్యానమొక్కటే నువ్వు విశ్వ గర్భంలోకి వెళ్ళడానికి సహకరిస్తుంది. 🍀*
*తల్లి గర్భంలో ప్రతి బిడ్డా ఆనందంగా వుంటుంది. అక్కడ బిడ్డ ఏమీ కాడు. అమెరికా అధ్యక్షుడు కాడు. ప్రపంచంలోని గొప్ప కోటీశ్వరుడు కాడు. అతను దేన్నీ సొంతం చేసుకోడు. కానీ అతని ఆనందం అనంతం. సైకాలిజిస్టులు తల్లి గర్భంలో వున్న ఆనందాన్నే మనిషి జీవితమంతా వెతుకుతూ వుంటాడని అంటారు. మనిషి అపూర్వ అనుభూతి తల్లి గర్భంలో వుంది. ఆన్ని చెరిపెయ్యలేం. ఐతే దాన్ని మళ్ళీ మనం సులభంగా పొందవచ్చు.*
*వ్యక్తి తను పసిబిడ్డనని, ఈ అనంత విశ్వం తల్లి గర్భమని భావించాలి. మతం దాన్ని నొక్కి చెప్పాలి. సహకరించాలి. అప్పుడు నీకు విశ్వానికి మధ్య ఘర్షణ వుండదు. అప్పుడు నీకు ఆందోళన వుండదు. ఘర్షణ వుండదు. విశ్వం నీకు సంబంధించిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. నీలో హఠాత్తుగా ఆనందం మొదలవుతుంది. ధ్యానమొక్కటే నువ్వు విశ్వ గర్భంలోకి వెళ్ళడానికి సహకరిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 030 / Siva Sutras - 030 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 8. జ్ఞానం జాగృత 🌻 🌻 9. స్వప్నో వికల్పం 🌻 🌻 10. అవివేకో మాయా సుషుప్తం - 5🌻*
*🌴. జాగృత - స్పృహ, జ్ఞానం : స్వప్నం - ఊహ, కలలు : సుషుప్తి - అజ్ఞానం, మాయ. 🌴*
*మరో విధంగా చెప్పాలంటే, అజ్ఞానం (అవిద్య) అనేది గాఢనిద్ర యొక్క స్థితి తప్ప మరొకటి కాదు, ఇక్కడ మానసిక కార్యకలాపాలు లేదా శారీరక శ్రమ జరగవు. ఈ మూడు సూత్రాలలో చర్చించ బడుతున్నది లౌకిక స్థాయి చైతన్యం మాత్రమే. స్పృహ యొక్క తుర్యా మరియు తుర్యాతీత యొక్క ఉన్నత స్థాయిలు ఈ శ్రేణిలో తరువాత చర్చించ బడతాయి.*
*పైన చర్చించినవి సాధారణ మానవులకు సంబంధించినవి. కానీ, యోగులు మినహాయింపు. వారి చైతన్య స్థాయి సాధారణ మానవుల చైతన్య స్థాయికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంతర్శరీరాల్ని స్థూలతతో అనుసంధానం చేసి శాశ్వతంగా ఆ స్థితిలో ఉండగలిగేవారే యోగులు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 030 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 8.Jñānaṁ jāgrat 🌻 🌻9. Svapno vikalpāḥ 🌻 🌻 10. Aviveko māyāsauṣuptam - 5 🌻*
*🌴. Knowledge is Jagrat: Fancy is Svapna. Ignorance, Maya, is Susupti 🌴*
*To put it other way, it says that ignorance (avidyā) is nothing but the state of deep sleep, where neither mental activity nor physical activity takes place. What is being discussed in these three aphorisms is only the mundane level of consciousness. There are higher levels of consciousness turya and turyātīta that will be discussed later in this series.*
*What is discussed above pertains to normal human beings. But, yogis are exceptions. Their level of consciousness is totally different from the consciousness level of ordinary humans. Yogis are those who are able to connect microcosm with macrocosm and remain in that position perpetually.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Kommentare