🌹26, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
🍀. వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు, Sri Panchami, Vasantha Panchami, Republic Day Good Wishes to All 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం, Vasantha Panchami , Republic Day 🌺
🍀. శ్రీ సరస్వతి ధ్యానము 🍀
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : చేసే కర్మ ఏదైనా భావం ముఖ్యం. నిష్కాముడవు, నిరహంకారుడవునై, సమచిత్తంతో, జయాపజయములకు, లాభనష్టములకూ వికారం చెందక, ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరుని కోసం, సమస్త కర్మమూ ఈశ్వర శక్తియే చేస్తున్న ఎరుక గలిగి చేసెడీ ఏ కర్మయైనా ఆత్మార్పణకు సాధనమే అవుతుంది. 🍀
🌹. వసంత పంచమి విశిష్టత :- సరస్వతీదేవి మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది. ''చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా'' అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.🌹
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల పంచమి 10:29:12 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 18:58:08
వరకు తదుపరి రేవతి
యోగం: శివ 15:28:21 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బాలవ 10:32:12 వరకు
వర్జ్యం: 05:14:24 - 06:45:48
దుర్ముహూర్తం: 10:35:23 - 11:20:38
మరియు 15:06:54 - 15:52:09
రాహు కాలం: 13:53:22 - 15:18:13
గుళిక కాలం: 09:38:49 - 11:03:40
యమ గండం: 06:49:08 - 08:13:58
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 14:22:48 - 15:54:12
సూర్యోదయం: 06:49:08
సూర్యాస్తమయం: 18:07:55
చంద్రోదయం: 10:21:54
చంద్రాస్తమయం: 22:47:53
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
18:58:08 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentarios