🌹🍀 27, JANUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 27, JANUARY 2023 FRIDAY, శుక్రవారం, బృగు వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 317 / Bhagavad-Gita -317 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 07 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 164 / Agni Maha Purana - 164 🌹 🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 4 / Characteristics of an image of the Goddess - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 029 / DAILY WISDOM - 029 🌹 🌻 29. వస్తువుగా మారడం విషయం యొక్క లక్ష్యం / 29. Becoming the Object Seems to be the Aim of the Subject 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 294 🌹
6) 🌹. శివ సూత్రములు - 31 / Siva Sutras - 31 🌹
🌻 8. జ్ఞానం జాగృత, 9. స్వప్నో వికల్పం, 10. అవివేకో మాయా సుషుప్తం - 3 / 8.Jñānaṁ jāgrat, 9. Svapno vikalpāḥ, 10. Aviveko māyāsauṣuptam - 6🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹27, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద షష్టి, Skanda Shasti 🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -29 🍀*
29. సురసఙ్ఘశుభఙ్కరి జ్ఞానప్రదే
మునిసఙ్ఘప్రియఙ్కరి మోక్షప్రదే ।
నరసఙ్ఘజయఙ్కరి భాగ్యప్రదే
శరణం శరణం జయలక్ష్మి నమః ॥
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ప్రాణ, మనఃకోశముల నతిక్రమించి ఆత్మానుభవం పొందిన వారు ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ వుండవలసిన పనిలేదు. ఆత్మకు కేవలం తన ఉనికిలోనే ఆనందమున్నది. ఒక పని చేయడానికి గాని, చేయక పోవడానికి గాని దానికి పరిపూర్ణ స్వేచ్ఛ కలదు. ఏదైనా ఒక పని చేస్తే అది ఆ పనికి బద్ధమై చేస్తున్నదనడానికి ఎంత మాత్రమూ వీలులేదు.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల షష్టి 09:11:06 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: రేవతి 18:38:45 వరకు
తదుపరి అశ్విని
యోగం: సిధ్ధ 13:21:04 వరకు
తదుపరి సద్య
కరణం: తైతిల 09:13:06 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 09:04:54 - 09:50:12
మరియు 12:51:23 - 13:36:41
రాహు కాలం: 11:03:49 - 12:28:44
గుళిక కాలం: 08:13:56 - 09:38:52
యమ గండం: 15:18:36 - 16:43:33
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 29:54:30 - 43:58:50
సూర్యోదయం: 06:49:00
సూర్యాస్తమయం: 18:08:28
చంద్రోదయం: 10:59:48
చంద్రాస్తమయం: 23:42:05
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: శ్రీవత్స యోగం - ధన
లాభం , సర్వ సౌఖ్యం 18:38:45 వరకు
తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 317 / Bhagavad-Gita - 317 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 07 🌴*
*07. తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |*
*మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయ; ||*
🌷. తాత్పర్యం :
*కావున ఓ అర్జునా! సర్వకాలముల యందును నీవు నన్నే (శ్రీకృష్ణుని) తలచుచు నీ విధ్యుక్తధర్మమైన యుద్ధము నొనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు.*
🌷. భాష్యము :
అర్జునునకు ఒసగబడిన ఈ ఉపదేశము కామ్యకర్మల యందు మునిగియుండెడి సర్వజనులకు అత్యంత ముఖ్యమైనది. విధ్యుక్తధర్మములను లేదా కర్మలను త్యజించుమణి భగవానుడిచ్చట తెలుపుటలేదు. అనగా వాటిని వారు కొనసాగించుచునే హరేకృష్ణమహామంత్ర జప,కీర్తనముల ద్వారా శ్రీకృష్ణుని స్మరించవలెను.
ఈ పద్ధతి మనుజిని భౌతికకల్మషము నుండి ముక్తిని చేసి, మనోబుద్ధులను కృష్ణుని యందు నియుక్తమగునట్లు చేయగలదు. దివ్యమైన శ్రీకృష్ణుని నామమును కీర్తించుట ద్వారా మనుజుడు అసంశయముగా దివ్యలోకమగు కృష్ణధామమును చేరగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 317 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 07 🌴*
*07. tasmāt sarveṣu kāleṣu mām anusmara yudhya ca*
*mayy arpita-mano-buddhir mām evaiṣyasy asaṁśayaḥ*
🌷 Translation :
*Therefore, Arjuna, you should always think of Me in the form of Kṛṣṇa and at the same time carry out your prescribed duty of fighting. With your activities dedicated to Me and your mind and intelligence fixed on Me, you will attain Me without doubt.*
🌹 Purport :
This instruction to Arjuna is very important for all men engaged in material activities. The Lord does not say that one should give up his prescribed duties or engagements. One can continue them and at the same time think of Kṛṣṇa by chanting Hare Kṛṣṇa.
This will free one from material contamination and engage the mind and intelligence in Kṛṣṇa. By chanting Kṛṣṇa’s names, one will be transferred to the supreme planet, Kṛṣṇaloka, without a doubt.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 164 / Agni Maha Purana - 164 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 50*
*🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 4 🌻*
రుద్రచర్చిక గజచర్మధరించి ఎడమ చేతిలో కాపాలము, కర్తరి ధరించి, కుడి చేతిలో శూల-పాశములను ధరించి, ముఖమును. ఒక పాదమును ఎత్తి ఉండును. ఈ దేవి అష్ట భూజారూపమున గూడ పూజింపబడును. మండమాలను డమరువును ధరించినపుడు ఆమెయే 'రుద్రచాముండ'అని చెప్పబడును. ఆమె నాట్యము చేయును. అందుచే 'నట్యేశ్వరి' అని కూడ ఈమెకు పేరు.
ఈమె నాలుగు ముఖములతో ఆసనముపై కూర్చున్నప్పుడు ''చతుర్ముఖీ మహాలక్ష్మీ'' (మహాలక్ష్మి యొక్క తామస మూర్తి) అని చెప్పబడును. ఈమె తన చేతులలో నున్న నరులను గుఱ్ఱములను, దున్నలను, ఏనుగులను తినుచుండును. సిద్ధ చాముండకు పది భుజడములు, మూడు నేత్రములు ఉండును. కుడి చేతులలో శస్త్రమును, ఖడ్గమును, మూడు డమరువులను ధరించును, ఎడమ చేతులలో గంట, ఖేటకము, మంచపుకోడు, త్రిశూలము, (డాలు) ధరించి యుండును.
సిద్ధ యోగీశ్వరీ దేవి సంపూర్ణ సిద్ధినిచ్చును. ఈదేవికి స్వరూపమైన మరియొక సక్తి యున్నధి, ఈమె శరీరకాంతి ఎఱ్ఱగా నుండును. పాశాంకుశములను ధరించిన ఈమెకు 'ఖైరవి' అని పేరు. రూప విద్యాదేవికి పండ్రెండు భుజములుండును. ఈ దేవులందరును శ్మశానములో ఆవిర్భవింతురు. భయంకరముగ నుందురు, ఈ ఎనమండుగురు దేవులకును (రుద్ర, చండ, అష్టభుజ లేతా రుద్ర చాముండ, సిద్దయోగీశ్వరి భైరవి, రూపవిద్య) ''అంబాష్టకము'' అని పేరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 164 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 50
*🌻Characteristics of an image of the Goddess - 4 🌻*
30-31. (The image of) Rudracarcikā (the manifestation of) the goddess may have a bow adorned by the plume of peacock, club, banner, protective posture, cock, skull, scissors, trident and noose in the right and left hands. (She should also be) clad in the elephant hide, with her leg raised up and the little drum placed on the head.
32. Hence she (is known as) Rudracāmuṇḍā, the goddess of dancing and one who is dancing. This (goddess herself), having four faces and in the sitting posture (is known as) Mahālakṣmī.
33-34. (The goddess) having ten hands and three eyes (holding) (different) weapons, sword and ḍamaru (little drum) in the right hand and the bell, club, staff with a skull at one end and trident in the left (hand) and eating men, horses, buffaloes and elephants held in the hand is called Siddhacāmuṇḍā.
35. That goddess accomplishes everything and is (known (as) Siddhayogeśvarī. She is also represented in another form endowed with the noose and goad and red (in complexion).
36. (The goddess) Bhairavī who has an embodiment of beauty is endowed with twelve arms. These are (all) (spoken as) fierce (forms) arising from the cremation ground. The above are remembered as the eight forms of the goddess.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 29 / DAILY WISDOM - 29 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 29. వస్తువుగా మారడం విషయం యొక్క లక్ష్యం 🌻*
*తాను కోరుకున్న వస్తువుగా స్వయంగా మారడం అనేది కోరుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఉద్దేశం. విషయానికి వస్తువు యొక్క సామీప్యత ఎంత ఎక్కువ అంటే, విషయానికి మరియు వస్తువుకు మధ్య దూరం ఎంత తక్కువగా ఉంటే, వస్తువు అంత ఎక్కువ ఆనందాన్ని పొందుతుంది. దీని ద్వారా విషయము మరియు వస్తువు మధ్య ఎంత సామీప్యత ఉంటే అంత ఆనందం అయినప్పుడు, అత్యున్నత ఆనందం విషయం వస్తువులో కరిగిపోయినప్పుడు మాత్రమే వస్తుందని మనం ఊహించగలం.*
*గ్రహణశక్తి మరియు సాపేక్షత లేని చోట, విషయం మరియు వస్తువు కలిసిపోయి కేవలం ఉనికి ఉంటే , అదే అత్యున్నత ఆనందానికి నిలయం. ఈ చైతన్య రాశి అనేది జ్ఞానం యొక్క ఏకీకరణ. ఇక్కడ అది తెలుసుకునే సాధనం కాదు. దానిలోని సారాంశం, ఉనికి మరియు దానిలో భాగం. ఉపనిషత్తులు ఈ సత్యం వైపు మన దృష్టిని మరల్చడానికి ఆసక్తిని కలిగి ఉన్నాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 29 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 29. Becoming the Object Seems to be the Aim of the Subject 🌻*
*Becoming the object seems to be the aim of the subject in its processes of desireful knowledge. The greater the proximity of the object to the subject, that is, the lesser the distance between the subject and the object, the greater is the happiness derived; whereby we are able to deduce that the least distance, nay, the loss of distance itself in a state of identity, a state of infinite oneness, where things lose their separateness.*
*Where perception and relatedness are no more, where the subject and the object coalesce and mere ‘Be’-ness seems to be the reality, should be the abode of supreme bliss. This consciousness-mass is the one integration of knowledge where it is no more a means of knowing but the essence, the existence and the content in itself. The Upanishads are keen about turning our attention to this truth.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 294 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. సాధారణంగా మనం సంక్షోభంలో వుంటాం. సంక్లిష్టంగా వుంటాం. వైరుధ్యాలతో వుంటాం. మనకి సమన్వయం కావాలి, స్పష్టత ఏర్పడాలి. అప్పుడే అస్తిత్వపు సత్యం అవగాహనకు వస్తుంది. అదెప్పుడూ లోపలనే వుంది.🍀*
*సత్యం కేవలం గాఢమయిన లోపలి సమశృతి గుండా మాత్రమే తెలుస్తుంది. సాధారణంగా మనం సంక్షోభంలో వుంటాం. సంక్లిష్టంగా వుంటాం. వైరుధ్యాలతో వుంటాం. మనలో ఒకరు 'యిది చెయ్యి' అంటారు. యింకొకరు 'ఇది చెయ్యకు' అంటారు. యిద్దరూ మనలోనే వున్నారు. మనసులోనే వున్నారు. మనం పగిలిన గాజు పాత్రలం. మనిషి పరిస్థితి అది. మనకి సమన్వయం కావాలి, స్పష్టత ఏర్పడాలి.*
*ఆ సమన్వయం ఏర్పడితే గొప్ప సంగీతం మొదలవుతుంది. అప్పుడే అస్తిత్వపు సత్యం అవగాహనకు వస్తుంది. అదెప్పుడూ లోపలనే వుంది. మనసు పెట్టే అల్లరిలో మనం గుర్తించం. ఈ లోపలి సంక్షోభం ఎప్పుడు చల్లబడుతుందో మనకు సన్నని సంగీతం వినపడుతుంది. అపుడు వ్యక్తి నిస్సందేహంగా 'ఇది నా స్వరం' నాలోంచీ ఆలపిస్తోంది' అని గ్రహిస్తాడు. అప్పుడు జీవితం ఆలయమవుతుంది. లేకుంటే మనం గాలిమేడలవుతాం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 031 / Siva Sutras - 031 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 8. జ్ఞానం జాగృత 🌻 🌻 9. స్వప్నో వికల్పం 🌻 🌻 10. అవివేకో మాయా సుషుప్తం - 6🌻*
*🌴. జాగృత - స్పృహ, జ్ఞానం : స్వప్నం - ఊహ, కలలు : సుషుప్తి - అజ్ఞానం, మాయ. 🌴*
*యోగిన్ అంటే కలపడం. అతని ఏకాగ్రత ఎప్పుడూ కేంద్రీకృతమై ఉంటుంది. జాగ్రుదావస్థ లో సైతం, అతను అత్యున్నత వాస్తవికత అయిన శివునితో అనుసంధానమై ఉంటాడు. అతని ఇంద్రియ గ్రహణాలు కేవలం తన స్థూల శరీరాన్ని కాపాడుకోవడానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి. శరీరం లోపల ఉన్న శివునికి కవచం మాత్రమే. స్థూల విషయాలేవీ అతనికి ఆసక్తి కలిగించవు. అతని మనస్సులో అన్యమయిన ముద్రలు లేనప్పుడు, అతని స్వప్న స్థితిలో కూడా, అతను శివునితో ఐక్యంగా ఉంటాడు.*
*అతని అంతర్గత అవగాహనల్లో భౌతిక వాసనలు లేకపోవడం వల్ల శివుడు కాకుండా వేరే కలని వారు కనరు. అతని ఇంద్రియ గ్రహణశక్తి వాటి ఉద్దేశించిన ప్రయోజనాలను దాదాపుగా కోల్పోయి ఉంటాయి. అందువల్ల శివుని గురించి కాకుండా వేరొక దాని గురించి కలలు కనడానికి ఎటువంటి ముఖ్యమైన ముద్రలు కలిగించవు. ఎటువంటి మార్పులు లేకుండా, అతని చైతన్యం అతని గాఢ నిద్ర స్థితిలో సమాధి దశలోకి ప్రవేశిస్తుంది. అతను తన స్వంత ఇష్టానుసారం సమాది స్థితిలోకి ప్రవేశిస్తాడు. వాస్తవానికి చాలా సార్లు అతను సమాది దశలోనే ఉంటాడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 031 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 8.Jñānaṁ jāgrat 🌻 🌻9. Svapno vikalpāḥ 🌻 🌻 10. Aviveko māyāsauṣuptam - 6 🌻*
*🌴. Knowledge is Jagrat: Fancy is Svapna. Ignorance, Maya, is Susupti 🌴*
*Yogin means yoking. His concentration is always focused. Even in active state (Jāgrat), he remains connected with Shiva, the Ultimate Reality. His sensory perceptions are limited to merely maintain his gross body that merely acts a cover for Shiva within. None of the gross matters is of any interest to him. In the absence of extraneous impressions in his mind, in his dream state also, he remains united with Shiva.*
*His internal perceptions do not undergo any significant changes to cause a dream other than Shiva. His sensory perceptions would have almost lost their intended utilities and therefore do not cause any significant impressions to dream about something else other than his own Shiva. Without any modifications, his consciousness enters the stage of samādi, in his deep sleep state. He enters the state of samādi at his own will and in fact most of the times he remains in the stage of samādi.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Comments