top of page
Writer's picturePrasad Bharadwaj

28 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹28, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹


శుభ శనివారం, Saturday, స్థిర వాసరే


🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Good Wishes to all 🍀


మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ


ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి, Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami 🌻


🍀. శ్రీ సూర్య ప్రార్థన 🍀


ధ్యాయేత్సూర్యమనంత కోటికిరణం తేజోమయం భాస్కరం

భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్


ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం

భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : జీవన్ముక్తావస్థ - జీవన్ముక్తుడు బంధరహితుడై చరిస్తాడు. ఏ కర్మయూ అతనిని బంధించ నేరదు. ఏలనంటే, అహంకార స్ఫురణ అతనిలో ఉండదు గనుక . కర్మ చేయునది అతని యందలి విశ్వ ప్రకృతి గాని, అతడు గాదు. విశ్వప్రకృతి కతీతమైన పరతత్వంతో తాదాత్మ్యం చెంది పరిపూరుడై యుండుటయే అతనికి సహజ లక్షణం అవుతుంది.🍀


🌹. రథసప్తమి విశిష్టత (సంక్షిప్త) 🌹


మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.


🌷🌷🌷🌷🌷



శుభకృత్‌, శిశిర ఋతువు,


ఉత్తరాయణం, మాఘ మాసం


తిథి: శుక్ల-సప్తమి 08:44:17 వరకు


తదుపరి శుక్ల-అష్టమి


నక్షత్రం: అశ్విని 19:07:13 వరకు


తదుపరి భరణి


యోగం: సద్య 11:54:27 వరకు


తదుపరి శుభ


కరణం: వణిజ 08:45:18 వరకు


వర్జ్యం: 15:01:10 - 16:39:06


మరియు 29:12:00 - 30:53:00


దుర్ముహూర్తం: 08:19:32 - 09:04:53


రాహు కాలం: 09:38:53 - 11:03:55


గుళిక కాలం: 06:48:51 - 08:13:52


యమ గండం: 13:53:57 - 15:18:59


అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50


అమృత కాలం: 11:45:18 - 13:23:14


సూర్యోదయం: 06:48:51


సూర్యాస్తమయం: 18:09:01


చంద్రోదయం: 11:37:38


చంద్రాస్తమయం: 00:35:44


సూర్య సంచార రాశి: మకరం


చంద్ర సంచార రాశి: మేషం


యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం


19:07:13 వరకు తదుపరి ధ్వాoక్ష


యోగం - ధన నాశనం, కార్య హాని


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Kommentare


Post: Blog2 Post
bottom of page