🌹🍀 29 - DECEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 29 - DECEMBER - 2022 TUESDAY, గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. గురు గోవింద్ సింగ్ జయంతి శుభాకాంక్షలు, Good Wishes on Guru Gobind Singh Jayanti 🍀
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 303 / Bhagavad-Gita -303 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -23వ శ్లోకము.
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 150 / Agni Maha Purana - 150 🌹 🌻. శాలగ్రామాది మూర్తి వర్ణనము - 1 / Characteristics of different Śālagrāma stones- 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 015 / DAILY WISDOM - 015 🌹 🌻 15. వైవిధ్యాన్ని నొక్కి చెప్పడం అంటే సంపూర్ణతను తిరస్కరించడం / To Assert Diversity is to Deny Absoluteness🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 280 🌹
6) 🌹. శివ సూత్రములు - 17 / Siva Sutras - 17 🌹. 🌻6. శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 1 / Śakticakrasandhāne viśvasaṁhāraḥ - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹29, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
🍀. గురు గోవింద్ సింగ్ జయంతి శుభాకాంక్షలు, Good Wishes on Guru Gobind Singh Jayanti🍀
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : గురు గోవింద్ సింగ్ జయంతి, Guru Gobind Singh Jayanti 🌺*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 21 🍀*
*21. పరిస్ఫురన్నూపురచిత్రభాను – ప్రకాశనిర్ధూత తమోనుషంగా*
*పదద్వయీం తే పరిచిన్మహేఽంతః ప్రబోధరాజీవ విభాతసంధ్యామ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : క్రీడారంగంలో మితిమీరిన ఆటకోటితనం కూడదు. జీవితరంగంలో మితిమీరిన గంభీరముద్ర తగదు. రెండింటి యందునూ ఆటకోటితనపు స్వేచ్ఛతోపాటు గంభీరమైన కట్టుబాటును మనం అలవరించుకోడం అవసరం.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: శుక్ల-సప్తమి 19:18:38 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: పూర్వాభద్రపద 11:45:31
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: వ్యతీపాత 11:45:58 వరకు
తదుపరి వరియాన
కరణం: గార 07:56:57 వరకు
వర్జ్యం: 21:12:24 - 22:47:08
దుర్ముహూర్తం: 10:26:54 - 11:11:19
మరియు 14:53:24 - 15:37:49
రాహు కాలం: 13:41:13 - 15:04:30
గుళిక కాలం: 09:31:23 - 10:54:40
యమ గండం: 06:44:50 - 08:08:06
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:39
అమృత కాలం: 04:04:40 - 05:36:32
మరియు 30:40:48 - 32:15:32
సూర్యోదయం: 06:44:50
సూర్యాస్తమయం: 17:51:04
చంద్రోదయం: 11:47:50
చంద్రాస్తమయం: 00:02:49
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ముద్గర యోగం - కలహం
11:45:31 వరకు తదుపరి ఛత్ర యోగం
- స్త్రీ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🍀. గురు గోవింద్ సింగ్ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Guru Gobind Singh Jayanti to all 🍀*
*ప్రసాద్ భరద్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 303 / Bhagavad-Gita - 303 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 23 🌴*
*23. అన్తవత్తు ఫలం తేషాం తద్ భవత్యల్పమేధసాం |*
*దేవాన్ దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి ||*
🌷. తాత్పర్యం :
*అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు. కాని వారొసగెడి ఫలములు అల్పములు, తాత్కాలికములై యున్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు.*
🌷. భాష్యము :
ఇతరదేవతలను పూజించువారు కూడా శ్రీకృష్ణభగవానునే చేరుదురని భగవద్గీతా వ్యాఖ్యాతలు కొందరు పలుకుదురు. కాని దేవతలను పూజించువారు ఆ దేవతలు నివసించు లోకమునె చేరుదురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అనగా సూర్యుని పూజించువారు సూర్యలోకమును చేరగా, చంద్రుని పూజించువారు చంద్రలోకమును చేరుదురు. అదే విధముగా ఇంద్రుని వంటి దేవతను పూజించినచో ఆ దేవతకు సంబంధించిన లోకమును మనుజుడు పొందగలడు.
అంతియే గాని ఏ దేవతను పూజించినను చివరకు అందరును శ్రీకృష్ణభగవానునే చేరుదున్నది సత్యము కాదు. అట్టి భావనమిచ్చుట ఖండింపబడినది. అనగా దేవతలను పూజించువారు భౌతికజగమునందలి ఆయా దేవతలా లోకములను చేరగా, దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తులు మాత్రము ఆ భగవానుని దివ్యధామమునే నేరుగా చేరుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 303 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 7 - Jnana Yoga - 23 🌴*
*23. antavat tu phalaṁ teṣāṁ tad bhavaty alpa-medhasām*
*devān deva-yajo yānti mad-bhaktā yānti mām api*
🌷 Translation :
*Men of small intelligence worship the demigods, and their fruits are limited and temporary. Those who worship the demigods go to the planets of the demigods, but My devotees ultimately reach My supreme planet.*
🌹 Purport :
Some commentators on the Bhagavad-gītā say that one who worships a demigod can reach the Supreme Lord, but here it is clearly stated that the worshipers of demigods go to the different planetary systems where various demigods are situated, just as a worshiper of the sun achieves the sun or a worshiper of the demigod of the moon achieves the moon. Similarly, if anyone wants to worship a demigod like Indra, he can attain that particular god’s planet. It is not that everyone, regardless of whatever demigod is worshiped, will reach the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 150 / Agni Maha Purana - 150 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 46*
*🌻. శాలగ్రామాది మూర్తి వర్ణనము - 1🌻*
హయగ్రీవుడు చెప్పెను.
బ్రహ్మదేవా! సాలగ్రామాదులపై నుండు హరిమూర్తులను గూర్చి చెప్పదను. ఇది భోగ మోక్షముల నిచ్చునది.
ద్వారము నందు రెండు చక్రములతో నల్లని సాలగ్రామము వాసుదేవుడు.
రెండు చట్రములున్న ఎఱ్ఱని శాల గ్రామము సంకర్షణుడు.
చిన్న చక్రము, అనేక రంధ్రములును ఉన్న నీలవర్ణ సాలగ్రామము ప్రద్యుమ్నుడు.
కమల చిహ్నము, గోలాకారము, పచ్చని రంగు, మూడురేఖలు ఉన్నది అనిరుద్ధుడు.
నాభి యందు ఉన్నతమై, పెద్ద రంధ్రములతో నల్లగా నుండునది నారాయణుడు.
కమల-చక్రచిహ్నములు, పృష్ఠభాగమున రంధ్రము, బిందువు ఉన్న శాలగ్రామము పరమేష్ఠి.
స్థూలమైన చక్రము మధ్య గద వంటి రేఖ ఉన్న శ్యామవర్ణమగు శాలగ్రామము విష్ణువు.
స్థూలచక్రము ఐదు బిందువులు ఉన్న కపిలవర్ణ శాలగ్రామము నృసింహుడు.
శక్తి అను అస్త్రముగుర్తు, విషమములైన రెండు చక్రములు, మూడు స్థూల రేఖలు ఉన్న ఇంద్రనీలమణి వంటి రంగుగల శాలగ్రామము వరాహము.
ఎత్తైన పృష్ఠ భాగము, గోలాకారమైన సుడి ఉన్న శ్యామవర్ణ శాలగ్రమము కూర్మము.
అంకుశ రేఖలు, బిందువులు ఉన్న నీల వర్ణ శాలగ్రామము హయగ్రీవుడు.
ఒక చక్రము, ఒక కమలము, పుచ్ఛాకారమేన రేఖలు ఉన్న, మణి వలె ప్రకాశించు శాలగ్రామము వైకుంఠుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 150 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 46
*🌻Characteristics of different Śālagrāma stones- 1 🌻*
The Lord said:
1. I shall describe (the characteristics of) the śālagrāma mūrti[1] (the different gods represented by different kinds of śālagrāma stones) which yield enjoyment and emancipation. (The stone called) Vāsudeva is black (coloured) around its mouth and has (marks) of two discs on it.
2. The Saṅkarṣaṇa (stone) is red (in colour) and has marks
3. The Aniruddha (stone) is yellow (in colour) and has the mark of a lotus. It is circular (in shape) and has two or three rays. The Nārāyaṇa (stone) is black (in colour) with an elevated, and deep hole.
4. The Parameṣṭi (stone) (has the marks of) the lotus and. disc. It is perforated at the back and has dots on the surface. The Viṣṇu (stone) has a big disc (mark). It is black (in colour). It has a line in the middle part. It is of the shape of a mace.
5-6. The Nṛsiṃha (stone) is tawny. It has (the mark of) a big disc and five dots. The Varāha (stone) is of the shape of the female divinity. It has unequal discs. It is of the colour of sapphire. It is large with the marks of three lines and is good. The Kūrma stone has an elevated hinder part with circular lines. and is black (in colour).
7. The Hayagrīva (stone) has a line of the shape of a good. It is blue (coloured) and is dotted. The Vaikuṇṭha (stone) has (the mark of) a disc and lotus. It has the radiance of a gem. It has tail-shaped lines.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 15 / DAILY WISDOM - 15 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 15. వైవిధ్యాన్ని నొక్కి చెప్పడం అంటే సంపూర్ణతను తిరస్కరించడం 🌻*
*అనేకత్వాన్ని గుర్తించడమంటే సంపూర్ణతను తిరస్కరించడమే. అంటే దాని అర్థం సంపూర్ణత భిన్నత్వాన్ని తిరస్కరిస్తుందని కాదు. భిన్నత్వం సంపూర్ణతలో కరిగిపోయి తన ఉనికిని కోల్పోతుందని అర్థం. భేదాలను విస్మరించడం అంటే సంపూర్ణత యొక్క ఉనికిని తిరస్కరించడమే అని కొంతమంది వాదిస్తారు. సంపూర్ణమైనది భేదపూరితమైన వాస్తవికతపై ఆధారపడి ఉండదు. సాపెక్షాన్ని గుర్తించకపోవడం ద్వారా మనం సంపూర్ణతను ప్రభావితం చేయలేము.*
*కానీ మనం, తద్వారా, మన ప్రస్తుత చైతన్య స్థితిని మెరుగుపరచుకొగలుగుతాము. వ్యక్తిత్వం ప్రతి అణువులో ఉంటుంది. ఈ అహాలు ఎంత అవిభాజ్యమై ఉండాలంటే, విడిపాటు అనేది ఒక అసాధ్యమైన భావనగా మారాలి. అప్పుడు సంపూర్ణత యొక్క స్వభావం అవగతమౌతుంది. మనం అనేకత్వాన్ని గుడ్డిగా నొక్కిచెప్పవచ్చు, కానీ ఏదైనా ఆమోదయోగ్యమైన తార్కికం ద్వారా దానిని స్థాపించడం సాధ్యం కాదు.*
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 15 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 15. To Assert Diversity is to Deny Absoluteness 🌻*
*To assert diversity is to deny absoluteness. It does not, however, mean that the Absolute excludes the diverse finitudes, but the finite is eternally dissolved in or is identical with the Absolute, and therefore, it does not claim for itself an individual reality. It is argued that to ignore differences is to reduce the Absolute to a non-entity. The Absolute does not depend upon the reality of egoistic differences. By cancelling the relative we may not affect the Absolute.*
*But we, so long as we are unconscious of the fundamental Being, improve thereby our present state of consciousness. Individuality is in every speck of space and these egos must be so very undivided that diversity becomes an impossible conception and homogeneity persists in every form of true reasoning in our effort to come to a conclusion in regard to the nature of the Absolute. We may blindly assert difference, but it is not possible to establish it through any acceptable reasoning.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 280 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఒకసారి నువ్వు సిద్ధపడితే నువ్వు ఆశ్చర్యపోతావు. సమస్త అస్తిత్వం గొప్ప కవిత్వ పరిమళంతో కళకళలాడుతోంది. వ్యక్తి అన్నిటిలో అర్థాన్ని వెతకాల్సిన పన్లేదు. అప్పుడది తాత్విక అన్వేషణ అవుతుంది.🍀*
*పక్షుల నుంచి వాటి పాటల్ని నేర్చుకో. వృక్షాల నించీ నాట్యాన్ని నేర్చుకో. నదుల నించీ సంగీతం నేర్చుకో. ఒకసారి నువ్వు సిద్ధపడితే నువ్వు ఆశ్చర్యపోతావు. సమస్త అస్తిత్వం గొప్ప కవిత్వ పరిమళంతో కళకళలాడుతోంది. వ్యక్తి అన్నిటిలో అర్థాన్ని వెతకాల్సిన పన్లేదు. అప్పుడది తాత్విక అన్వేషణ అవుతుంది. నువ్వు 'దీని అర్థమేమిటి?' అని అడిగిన క్షణం నువ్వు కవిత్వ మార్గం నించి తప్పుకుంటావు.*
*'ఈ చెట్టు గాల్లో ఎందుకు కదులుతోంది' అని నువు అడగని క్షణం నువ్వు కవితాత్మకంగా మారతావు. అప్పుడు అద్భుతాలకు అద్భుతం సంభవం. అర్థాన్ని లక్ష్యపెట్టని వ్యక్తికి అప్పుడు అర్థం తెలిసి వస్తుంది. చెట్లతో నాట్యం చేయి. పిట్టలతో పాటలు పాడు. సముద్రంలో ఈతకొట్టు. ఎట్లాంటి అన్వేషణతో సంబంధం లేకుండా నీకు అర్థం తెలిసి వస్తుంది. నువ్వు ఈ అద్భుత అస్తిత్వంలో భాగమవుతావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 17 / Siva Sutras - 17 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻6. శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 1 🌻*
*🌴. అనేక శక్తుల కలయికలో ద్వందాత్మకమైన విశ్వం నాశనం అవుతుంది. 🌴*
*చక్ర అనే పదం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. క్రమా వ్యవస్థ అంతిమ తత్వం యొక్క ఐదు శక్తులను అంగీకరిస్తుంది. అవి సృష్టి, జీవనోపాధి, వినాశనం, అనిర్వచనీయ స్థితి (అనాఖ్య) మరియు స్వేచ్ఛ (భాస, కాంతి, మెరుపు, ప్రకాశం మరియు మనస్సుపై చేసిన ముద్ర.). క్రమ వ్యవస్థ మరియు భాసం గురించి సూత్రం 5లో చర్చించబడ్డాయి (ఖచ్చితమైన ఆలోచన యొక్క శుద్ధీకరణ అంతిమ సాక్షాత్కారానికి సాధనం అని క్రమ వ్యవస్థ చెబుతుంది.*
*అనిశ్చిత ప్రకృతిలో శూన్యం నుండి పరిపూర్ణ స్పష్టత వరకు వరుస దశల ద్వారా శుద్దీకరణ జరగుతుంది). పైన పేర్కొన్న ఐదింటిలో మొదటి నాలుగింటిని చక్రాలు అంటారు. సంధానము (సంధిః (संधिः) పదం నుండి ఉద్భవించింది) అంటే కలయిక, సంయోగం, అనుసంధానం మొదలైనవి. విశ్వ అంటే విశ్వం మరియు సంహారః అంటే విధ్వంసం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 017 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻6. Śakticakrasandhāne viśvasaṁhāraḥ - 1 🌻*
*🌴. In union of multitude of powers is destruction of the differentiated universe. 🌴*
*Śakti means energy. The word chakra is slightly complicated. The krama system accepts five powers of the Ultimate. They are creation, sustenance, annihilation, assumption of the indefinable state (anākhya) and freedom (bhāsā, the light, luster, brightness and impression made on the mind.). Krama system and bhāsā have been discussed in sūtrā 5 (Krama system says that purification of definitive idea is the means to the realization of the Ultimate.*
*It is the nature of indetermination where purification happens through successive stages from nothingness to perfect clarity). Out of the five mentioned above the first four are known as cakras. Sandhāna (derived from the word sandhiḥ (संधिः) means union, conjunction, connection, etc. Viśva means the universe and saṁhāraḥ means destruction.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
コメント