top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 29, JANUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 29, JANUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 29, JANUARY 2023 SUNDAY, శనివారం, భాను వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 318 / Bhagavad-Gita -318 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 08 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 165 / Agni Maha Purana - 165 🌹 🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 5 / Characteristics of an image of the Goddess - 5 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 030 / DAILY WISDOM - 030 🌹 🌻 29. వస్తువుగా మారడం విషయం యొక్క లక్ష్యం / 29. Becoming the Object Seems to be the Aim of the Subject 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 295 🌹

6) 🌹. శివ సూత్రములు - 32 / Siva Sutras - 32 🌹

🌻 8. జ్ఞానం జాగృత, 9. స్వప్నో వికల్పం, 10. అవివేకో మాయా సుషుప్తం - 3 / 8.Jñānaṁ jāgrat, 9. Svapno vikalpāḥ, 10. Aviveko māyāsauṣuptam - 7🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹29 జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌻*


*🍀. సూర్య మండల స్త్రోత్రం - 6 🍀*


6. యన్మండలం వ్యాధి వినాశదక్షం |

యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |

ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : గుణకర్మలు - గుణాలు వేరు, ఆహంకారమూ, కామమూ వేరు వేరు కనుకనే, అహంకార, కామప్రవృత్తులు లేకుండా, అనగా సంగరహితంగా గుణాలు ప్రవర్తిల్లడానికి వీలున్నది. సంగరహితుడైన జీవన్ముక్తుని గుణకర్మల స్వరూపం ఇటువంటిదే. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: శుక్ల-అష్టమి 09:06:24 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: భరణి 20:22:16 వరకు

తదుపరి కృత్తిక

యోగం: శుభ 11:04:48 వరకు

తదుపరి శుక్ల

కరణం: బవ 09:07:25 వరకు

వర్జ్యం: 05:12:00 - 06:53:00

దుర్ముహూర్తం: 16:38:47 - 17:24:11

రాహు కాలం: 16:44:28 - 18:09:34

గుళిక కాలం: 15:19:21 - 16:44:28

యమ గండం: 12:29:07 - 13:54:14

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51

అమృత కాలం: 15:18:00 - 16:59:00

సూర్యోదయం: 06:48:40

సూర్యాస్తమయం: 18:09:34

చంద్రోదయం: 12:16:38

చంద్రాస్తమయం: 00:35:44

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: కాలదండ యోగం - మృత్యు

భయం 20:22:16 వరకు తదుపరి ధూమ్ర

యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 318 / Bhagavad-Gita - 318 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 08 🌴*


*08. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |*

*పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్ ||*


🌷. తాత్పర్యం :

*ఓ పార్థా! మనస్సును ఎల్లవేళలా నా స్మరణము నందే నియుక్తము జేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసెడివాడు నన్ను తప్పక చేరగలడు.*


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు తన స్మరణ ప్రాముఖ్యమును ఈ శ్లోకమున నొక్కి చెప్పుచున్నాడు. అట్టి శ్రీకృష్ణుని స్మరణము హరేకృష్ణమాహామంత్ర జపకీర్తనముల ద్వారా మనుజుని హృదయమునందు జాగృతము చేయబడును. అట్ట్ శ్రీకృష్ణనామము యొక్క శ్రవణ, కీర్తనములందు కర్ణములు, జిహ్వ, మనస్సు సంపూర్ణముగా నియుక్తమగుచున్నందున ఈ ధ్యానము ఆచరణకు అత్యంతసులభమై యున్నది. ఇట్టి ధ్యానము భగవానుని పొందుటకు తోడ్పడగలదు. “పురుషం” అనగా భోక్త యని భావము.


జీవులు శ్రీకృష్ణభగవానుని తటస్థశక్తి స్వరూపులైనను భౌతికకల్మషములకు గురియై యున్నారు. వారు తమను తాము భోక్తలుగా తలచినను వాస్తవమునకు దివ్యభోక్తలు కాజాలరు. శ్రీకృష్ణభగవానుడే తన సంపూర్ణాంశములైన నారాయణుడు, వాసుదేవుడు మొదలగు పలురూపములలో పరమ భోక్తయై యున్నాడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.


కనుక భక్తుడైనవాడు హరేకృష్ణమహామంత్ర జపకీర్తనములను చేయుచు తన పూజాధ్యేయమైన భగవానుని నారాయణ, కృష్ణ, రామాది ఏ రూపములలోనైనా నిరంతరము తలచవచ్చును. ఈ విధానము అతనిని పవిత్రుని చేయగలదు. నిరంతర జపకీర్తనముల వలన అతడు అంత్యకాలమున భగవద్ధామమును చేరగలడు. యోగాభ్యాసమునందు అంతరమందున్న పరమాత్మపై ధ్యానము నిలిపినట్లు, హరినామ జపకీర్తనము ద్వారా మనస్సును సదా శ్రీకృష్ణుని యందు నిలుపవలెను. మనస్సు సదా చంచలమై యుండును గనుక దానిని బలవంతముగా శ్రీకృష్ణుని చింతించునట్లు చేయుట అత్యంత అవసరము.


భ్రమరమునే సదా తలచుచు కీటకము ప్రస్తుత జన్మముననే భ్రమరముగా మారెడి వృత్తాంతము ఇచ్చట సాధారణముగా ఉదహరింపబడును. అదేవిధముగా మనము శ్రీకృష్ణుని నిరంతరము స్మరించినచో అంత్యమున ఆ దేవదేవుని స్వరూపమును బోలిన స్వరూపమునే పొందగలము.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 318 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 08 🌴*


*08. abhyāsa-yoga-yuktena cetasā nānya-gāminā*

*paramaṁ puruṣaṁ divyaṁ yāti pārthānucintayan*


🌷 Translation :

*He who meditates on Me as the Supreme Personality of Godhead, his mind constantly engaged in remembering Me, undeviated from the path, he, O Pārtha, is sure to reach Me.*


🌹 Purport :

In this verse Lord Kṛṣṇa stresses the importance of remembering Him. One’s memory of Kṛṣṇa is revived by chanting the mahā-mantra, Hare Kṛṣṇa. By this practice of chanting and hearing the sound vibration of the Supreme Lord, one’s ear, tongue and mind are engaged.


This mystic meditation is very easy to practice, and it helps one attain the Supreme Lord. Puruṣam means enjoyer. Although living entities belong to the marginal energy of the Supreme Lord, they are in material contamination.


They think themselves enjoyers, but they are not the supreme enjoyer. Here it is clearly stated that the supreme enjoyer is the Supreme Personality of Godhead in His different manifestations and plenary expansions as Nārāyaṇa, Vāsudeva, etc.


The devotee can constantly think of the object of worship, the Supreme Lord, in any of His features – Nārāyaṇa, Kṛṣṇa, Rāma, etc. – by chanting Hare Kṛṣṇa. This practice will purify him, and at the end of his life, due to his constant chanting, he will be transferred to the kingdom of God.


Yoga practice is meditation on the Supersoul within; similarly, by chanting Hare Kṛṣṇa one fixes his mind always on the Supreme Lord. The mind is fickle, and therefore it is necessary to engage the mind by force to think of Kṛṣṇa.


One example often given is that of the caterpillar that thinks of becoming a butterfly and so is transformed into a butterfly in the same life. Similarly, if we constantly think of Kṛṣṇa, it is certain that at the end of our lives we shall have the same bodily constitution as Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 165 / Agni Maha Purana - 165 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 50*


*🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 5 🌻*


క్షమాదేవి చుట్టు ఆడ నక్కలుండును. వృద్ధ స్త్రీరూపములో నున్న ఆమెకు రెండు హస్తములుండును. నోరు తెరచి ఉండును, పండ్లు ఎత్తుగా ఉండును, మోకాళ్లు చేయి ఆనుకొని భూమిపై కూర్చుండును. ఈమె ఉపాసకులకు కల్యాణప్రదాయిని, యక్షిణిలు కండ్లు తెరచికొని (మూయకుండ చూచుచు) ఉందురు. అప్సరసలు సర్వదా సౌందర్యవతులు, వీళ్ళ కండ్లు పచ్చగా ఉండును.


నందీశ్వరునకు ఒక చేతిలో అక్షమాల, రెండవ చేతిలో త్రిశూలము ఉండును. మహాకాలుని చేతిలో కత్తి, రెండవ చేతిలో ఖండితమైన సిరస్సు, మూడవ చేతిలో శూలము, నాల్గవ చేతిలో ఖేడము ఉండవలెను. కృశ##మైన శరీరము గల భృంగి నృత్యముద్రలో నుండును. ఈతని శిరస్సు కూష్మాండమువలె స్థూలమై బట్టతలయై ఉండును. వీరభద్రడు మొదలగు గణములకు ఏనుగులు, గోవుల వంటి చెవులు ముఖములు ఉండును.


ఘంటాకర్ణునకు పదునెనిమిది భుజములుండును. అతడు పాపములను, రోగములను నశింపచేయును. ఎడమ ప్రక్కన నున్న ఎనిమిది చేతులలో వజ్ర-ఖడ్గ-దండ-చక్ర-బాణ-ముసల-అంకుశ-ముద్గరములను, కుడి ప్రక్కనున్న ఎనిమిది చేతులలో తర్జనీ-ఖేట-శక్తి-ముండ-పాశ-ధనుస్‌-ఘంటా-కుఠారములను ధరించును. మిగిలిన రెండు చేతులతో త్రిశూలమును పట్టుకొని యుండును. ఘంటామాలచే అలంకృతుడగు ఘంటా కర్ణుడు విస్ఫోటకమును నివారించును.


అగ్నేయ మహాపురాణమునందు దేవీ ప్రతిమాలక్షణమను ఏబదియవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 165 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 50

*🌻Characteristics of an image of the Goddess - 5 🌻*


37. (The goddess) Kṣamā (Forbearance) (should be) surrounded by jackals, old, having two arms, and widely opened mouth. (The goddess) Kṣemaṅkarī (Benevolent) may have protruding teeth and be resting her knees on the ground.


38. The wives of semi-gods should be made to have long and motionless eyes. The Śākinīs (female attendants on Goddess Durgā) should be made to have oblique vision. The Mahāramyas should have yellow eyes. The (images of) nymphs should always be made beautiful.


39. (The form of) Nandīśa the bull, the door-keeper (of the goddess), should carry a rosary and a trident. (The image of) Mahākāla (a form of Śiva as the destroyer) may have a sword, human skull, trident and club.


40. (The form of) Bhṛṅgin (an attendant of Śiva) should have an emaciated body. Kuṣmāṇḍa (another attendant of Śiva) should have a stout and dwarf form dancing. Vīrabhadra and other attendants (of Śiva) should have ears and faces of elephants, cows, etc.


41. Ghaṇṭākarṇa (an attendant of Śiva) form should have eighteen hands crushing the accrued sin, (holding weapons) thunderbolt, sword, club, disc, arrow, mace, goad and hammer in the right hand and tarjanī (a weapon), club, dart, human skull, noose, bow, bell and axe on the left and a trident in the (remaining) two hands and wearing a garland of bells and crushing the eruptive diseases.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 30 / DAILY WISDOM - 30 🌹*

*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 30. స్వయం నాశనం లేనిది 🌻*


*ప్రపంచంలోని సాధారణ మనిషి తన మనస్సు మరియు ఇంద్రియాలను బహిర్ముఖంగా మార్చుకుంటాడు. చిన్నతనం నుండి అతను బాహ్య ఆనందాల వెంట పరుగెడతాడు. సృష్టించిన అన్ని వస్తువులను వ్యాపించే మృత్యువు అనే వలలోకి వెళ్తాడు. జ్ఞానులు, అయితే, అమరత్వాన్ని తెలుసుకుని, ఇక్కడ నశ్వరమైన వాటిలో శాశ్వతమైన జీవిని కోరుకోరు. కొంతమంది ఉన్నత వ్యక్తులు తమ చూపులను లోపలికి తిప్పి, ఆత్మ యొక్క అద్భుతమైన కాంతిని చూస్తారు.*


*ఈ స్వయమే అత్యంత ప్రియమైన వస్తువుల కంటే ప్రియమైనది, ఈ స్వయమే సమీపం కంటే అత్యంత దగ్గరగా ఉంటుంది. ఎవరైనా ఆత్మను కాకుండా మరేదైనా ప్రియమైనదిగా మాట్లాడినట్లయితే, అతను ఖచ్చితంగా తనకు ప్రియమైన దానిని కోల్పోతాడు. ఆత్మను మాత్రమే ప్రియంగా ఆరాధించాలి. ఆత్మను మాత్రమే ప్రియమైన వ్యక్తిగా ఆరాధించేవాడు తనకు ప్రియమైన దానిని కోల్పోడు. ఆత్మే నశించనిది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 DAILY WISDOM - 30 🌹*

*🍀 📖 The Realisation of the Absolute 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 30. The Self is Imperishable 🌻*


*The ordinary man of the world has his mind and senses turned extrovert. Childish, he runs after external pleasures and walks into the net of death which pervades all created things. The wise, however, knowing the Immortal, seek not that Eternal Being among things fleeting here. Some blessed one turns his gaze inward and beholds the glorious light of the Self.*


*This Self is dearer than the dearest of things, this Self is nearer than the nearest. If one would speak of anything else than the Self as dear, he would certainly lose what he holds as dear. One should adore the Self alone as dear. He who adores the Self alone as dear does not lose what he holds as dear. The Self is Imperishable.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 295 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. లోపలికి చూడు. ఆనందం కనిపిస్తుంది. కేవలం సత్యం కనిపిస్తుంది. జీవితం పరిమళిస్తుంది, పరవశిస్తుంది. మనం సమగ్రంగానే పుట్టాం. మనం ఆనందాన్ని అన్వేషించడానికి పుట్టలేదు. మనం కేవలం దాన్ని కనిపెట్టాలి. 🍀*


*మనం సమగ్రం కావడానికి పుట్టలేదు. మనం సమగ్రంగానే పుట్టాం. మనం ఆనందాన్ని అన్వేషించడానికి పుట్టలేదు. మనం కేవలం దాన్ని కనిపెట్టాలి. జనం అనుకునేంత కష్టమయిన విషయమేమీ కాదది. విశ్రాంతిని, విరామాన్ని పొందే సరళ మార్గమది. అప్పుడు మెల్లమెల్లగా కేంద్రానికి చేరుతాం. నువ్వు కేంద్రానికి చేరిన రోజు అక్కడంతా కాంతి కమ్ముకుంటుంది. నీకు స్విచ్ కనిపిస్తుంది. పరిస్థితి అది. మనం అనవసరంగా అరుస్తాం. గీపెడతాం.*


*నీ బాధ అర్థం లేనిది. తాడును చూసి పాముగా భ్రమించడం పరిగెట్టి అరటితొక్కపై కాలేసి పడి హాస్పిటల్లో చేరడం. చుట్టూ చూడు. అక్కడ ఏమీ వుండదు. లోపలికి చూడు. ఆనందం కనిపిస్తుంది. కేవలం సత్యం కనిపిస్తుంది. జీవితం పరిమళిస్తుంది, పరవశిస్తుంది. వ్యక్తి వీలయినంత పరవశాన్ని అందుకోవాలి. వ్యక్తిలో అనంత పరవశముంది. దానికి అంతం లేదు. ప్రయాణానికి అంతం లేదు.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శివ సూత్రములు - 032 / Siva Sutras - 032 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*1- శాంభవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 8. జ్ఞానం జాగృత 🌻 🌻 9. స్వప్నో వికల్పం 🌻 🌻 10. అవివేకో మాయా సుషుప్తం - 7🌻*

*🌴. జాగృత - స్పృహ, జ్ఞానం : స్వప్నం - ఊహ, కలలు : సుషుప్తి - అజ్ఞానం, మాయ. 🌴*


*అన్ని మానసిక కార్యకలాపాలను విరమించే నిరంతర అభ్యాసం ద్వారా సమాధి సాధించబడుతుంది. దీనిలో మనస్సు వ్యక్తపరచబడని ముద్రలను మాత్రమే కలిగి ఉంటుంది. ఏదైనా ప్రత్యామ్నాయ వస్తువు పరిశీలనకు అందుబాటులో ఉంటే మాత్రమే అవగాహనలలో వ్యత్యాసం జరుగుతుంది. కానీ అతను పరిగణించవలసిన ప్రత్యామ్నాయ విషయం లేదు. అతను ప్రతిదానిని శివునిగా భావిస్తాడు. అతను తన శివునికి భిన్నంగా లేడని గ్రహిస్తాడు. అతనికి తెలియడం, తెలిసినవాడు మరియు తెలుసుకునే వస్తువు వేర్వేరు కాదు.*


*అతను శివునిలో ఎడతెగని ఏకాగ్రతను పెంచుకున్నాడు. అతను తన స్వంత ఇష్టానుసారం చైతన్యం తుర్యా మరియు తుర్యాతీత యొక్క ఉన్నత స్థాయిలలోకి ప్రవేశిస్తాడు. అతనికి చైతన్యం యొక్క ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మార్పు సులభంగా జరుగుతుంది. ఈ దశను చేరుకోవడానికి, అతని స్వేచ్ఛా సంకల్పం ప్రధాన పాత్ర పోషించింది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 Siva Sutras - 032 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 8.Jñānaṁ jāgrat 🌻 🌻9. Svapno vikalpāḥ 🌻 🌻 10. Aviveko māyāsauṣuptam - 7 🌻*

*🌴. Knowledge is Jagrat: Fancy is Svapna. Ignorance, Maya, is Susupti 🌴*


*Samādi is attained by constant practice of cessation of all mental activities, in which the mind retains only the unmanifested impressions. The difference in perceptions happens only if any alternate object is available for consideration. But he does not have an alternate matter to consider. He considers everything as Shiva. He has realised that he is not different from his own Shiva. For him the knowing, the knower and the object of knowing are not different.*


*He has developed unbroken flow of concentration in Shiva. He enters the higher tiers of consciousness turya and turyātīta at his own will and for him the transition from one level of consciousness to another level of consciousness happens with ease. To attain this stage, his free-will would have played a preponderant role.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

1 view0 comments

Comments


Post: Blog2 Post
bottom of page