top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 30, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

🌹🍀 30, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 30, JANUARY 2023 MONDAY, సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 126 / Kapila Gita - 126 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 10 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 10 🌴

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 718 / Vishnu Sahasranama Contemplation - 718 🌹

🌻718. మహామూర్తిః, महामूर्तिः, Mahāmūrtiḥ🌻

4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 679 / Sri Siva Maha Purana - 679 🌹 🌻. గణేశుని వివాహము - 3 / The celebration of Gaṇeśa’s marriage - 3 🌻

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 300 / Osho Daily Meditations - 300 🌹 🍀 300. మూలపు తాళం చెవి / 300. THE MASTER KEY 🍀

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 427 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 2 🌹 🌻427. 'నిస్సీమ మహిమ’ - 2 / 'Nisseema Mahima' - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹30, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*


*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 18 🍀*


33. సాంఖ్యప్రసాదో దుర్వాసాః సర్వసాధునిషేవితః |

ప్రస్కందనో విభాగజ్ఞో అతుల్యో యజ్ఞభాగవిత్

34. సర్వవాసః సర్వచారీ దుర్వాసా వాసవోఽమరః |

హైమో హేమకరో యజ్ఞః సర్వధారీ ధరోత్తమః


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : నిస్సంగత్వం - జీవన్ముక్తులు తమ యందలి ప్రకృతితత్త్వమందు సంగం కలవారైనా పురుషతత్వ మందు నిస్సంగముగా వుంటారు గనుక వారు నిస్సంగులే ననడంలో అర్థంలేదు. సంగం ఏ విభాగంలో ఉన్నా అది సంగమే. నిస్సంగుడు కావడానికి మానవుడు ఎక్కడనో అంతరాత్మలోనే కాక, అంతటా అనగా దేహ, ప్రాణ, మనః ప్రవృత్తులలో కూడా నిస్సంగుడు గానే ఉండడం అవసరం. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: శుక్ల-నవమి 10:13:52 వరకు

తదుపరి శుక్ల-దశమి

నక్షత్రం: కృత్తిక 22:17:09 వరకు

తదుపరి రోహిణి

యోగం: శుక్ల 10:48:45 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: కౌలవ 10:13:52 వరకు

వర్జ్యం: 09:18:30 - 11:02:10

దుర్ముహూర్తం: 12:52:01 - 13:37:27

మరియు 15:08:20 - 15:53:47

రాహు కాలం: 08:13:41 - 09:38:53

గుళిక కాలం: 13:54:30 - 15:19:42

యమ గండం: 11:04:05 - 12:29:17

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51

అమృత కాలం: 19:40:30 - 21:24:10

సూర్యోదయం: 06:48:29

సూర్యాస్తమయం: 18:10:07

చంద్రోదయం: 12:57:53

చంద్రాస్తమయం: 01:29:33

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: స్థిర యోగం - శుభాశుభ

మిశ్రమ ఫలం 22:17:09 వరకు తదుపరి

వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 126 / Kapila Gita - 126🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 10 🌴*


*10. నివృత్తబుద్ధ్యవస్థానో దూరీభూతాన్యదర్శనః|*

*ఉపలభ్యాత్మనాఽఽత్మానం చక్షుషేవార్కమాత్మదృక్॥*


*ఆత్మదర్శియైన ముని బుద్ధి యొక్క జాగ్రదాది అవస్థల నుండి తనను వేరుగా భావించు కొనును. అతడు పరమాత్మను తప్ప మరి ఏ యితర వస్తువును చూడగూడదు (ఆయన దృష్టిలో పరమాత్మ ఒక్కడే సత్యము. తక్కినవి నశ్వరములు. కావున వాటివైపు తన దృష్టిని పోనీయడు). నేత్రములు సూర్యుని చూచిన విధముగా తన శుద్ధాంతః కరణము ద్వారా పరమాత్మ సాక్షాత్కారముసు పొంది అద్వితీయమైన బ్రహ్మపదమును చేరును.*


*శరీరమునకూ ఇంద్రియములకూ మనసుకూ జ్ఞ్యానం ఉండదు. ప్రకృతి పురుషుల యధార్థ తత్వము తెలిపే జ్ఞ్యానముతో బుద్ధి అవస్థానం (బుద్ధి యొక్క సమూహం - బుద్ధి మనసు చిత్తం అంతఃకరణం) చేసే పని అయిన సంకల్ప వికల్పాలు, నిశ్చయ, విపరీత జ్ఞానాల నుంచి పక్కకు తొలగుతుంది. ఇలా జరగాలంటే ప్రకృతి అంటే ఏమిటో పురుషుడు అంటే ఏమిటొ తెలిస్తే, ప్రకృతితో పురుషుడు సంబంధం ఏర్పరుచు కోవడానికి చేసే వ్యాపారమే, సంకల్పం వికల్ప్లం, భ్రమ అన్యధా జ్ఞానం విపరీత జ్ఞ్యానం. ఇవి మానేసినపుడు, బుద్ధి మనసు యొక్క పనులైన సంకల్ప వికల్పాలను విడిచిపెడతాడు. దాని వలన పరమాత్మ కన్నా ఇతరమైన వాటిని దర్శించడు.*


*భగవంతుని కంటే భిన్నమైన వాటిని చూడకుండా అయ్యి, పరమాత్మ చేత జీవాత్మను తెలుసుకుంటాము. భగవంతుని చేతనే జీవాత్మ స్వరూపం తెలుస్తుంది. బుద్ధి యొక్కా, మనసు యొక్కా, ఆసక్తిని తొలగించాలి, ప్రవృత్తిని తొలగించాలి. మనసు బుద్ధీ వేటి యందు ప్రవర్తిస్తుందో వాటిని వెనక్కు మరల్చాలి. ఇతరములను చూడకూడదు. అప్పుడు జీవునితో పరమాత్మను తెలుసుకోవాలి. పరమాత్మ అనుగ్రహం తోటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆయన సంకల్పము లేకుంటే ఉన్న శాస్త్ర జ్ఞానముతో ఆయుష్షు వ్యయము అవుతుంది తప్ప లాభం ఉండదు.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 126 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 10 🌴*


*10. nivṛtta-buddhy-avasthāno dūrī-bhūtānya-darśanaḥ*

*upalabhyātmanātmānaṁ cakṣuṣevārkam ātma-dṛk*


*One should be situated in the transcendental position, beyond the stages of material consciousness, and should be aloof from all other conceptions of life. Thus realizing freedom from false ego, one should see his own self just as he sees the sun in the sky.*


*Consciousness acts in three stages under the material conception of life. When we are awake, consciousness acts in a particular way, when we are asleep it acts in a different way, and when we are in deep sleep, consciousness acts in still another way. To become Kṛṣṇa conscious, one has to become transcendental to these three stages of consciousness. Our present consciousness should be freed from all perceptions of life other than consciousness of Kṛṣṇa, the Supreme Personality of Godhead. This is called dūrī-bhūtānya-darśanaḥ, which means that when one attains perfect Kṛṣṇa consciousness he does not see anything but Kṛṣṇa.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 718 / Vishnu Sahasranama Contemplation - 718🌹*


*🌻718. మహామూర్తిః, महामूर्तिः, Mahāmūrtiḥ🌻*


*ఓం మహామూర్తయే నమః | ॐ महामूर्तये नमः | OM Mahāmūrtaye namaḥ*


*మహతీ మూర్తిరేతస్య శేష పర్యఙ్కశాయినః ।*

*ఇతి విష్ణుర్మహామూర్తిరితి సఙ్కీర్త్యతే బుధైః ॥*


*అపరిమిత శరీరుడైన అనంతుడు అనగా శేషుని తన పర్యంకముగా చేసికొని శయనించి యున్నందున ఈతని మూర్తి చాలా పెద్దదియే కదా!*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 718🌹*


*🌻718. Mahāmūrtiḥ🌻*


*OM Mahāmūrtaye namaḥ*


महती मूर्तिरेतस्य शेष पर्यङ्कशायिनः ।

इति विष्णुर्महामूर्तिरिति सङ्कीर्त्यते बुधैः ॥


*Mahatī mūrtiretasya śeṣa paryaṅkaśāyinaḥ,*

*Iti viṣṇurmahāmūrtiriti saṅkīrtyate budhaiḥ.*


*Since He lies on Ādiśeṣa for His bed - who is enormously big in size, He too is big in His form and that is why He is called Mahāmūrtiḥ.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 679 / Sri Siva Maha Purana - 679 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 20 🌴*

*🌻. గణేశుని వివాహము - 3 🌻*


బ్రహ్మ ఇట్లు పలికెను -


ఓ నారదా! మహేశ్వరుని మనస్సులో ధ్యానించే నీవు ఆ కుమారునితో ఈ వాక్యమును పలికి మౌనమును వహించితివి(22). కోపమనే అగ్నితో మండిపడుచున్న స్కందుడు తండ్రికి నమస్కరించి, తల్లిదండ్రులు వారించిననూ వినక, క్రౌంచపర్వతమునకు వెళ్లెను (23).


'నీవు ఇపుడు ఎట్లు వెళ్లెదవు?' అని వారించి నిషేధించిననూ ఆతడు 'కుదరదు' అని బదులిడి వెళ్లిపోయెను (24). తల్లిదండ్రులారా! నేను ఇచట క్షణకాలమైననూ ఉండరాదు. ఏలయన, మీరు ప్రేమను ప్రక్కన బెట్టి నా యందు కపటమును చేసితిరి (25). ఓ మునీ! ఇట్లు పలికి ఆతడు అచటకు వెళ్లెను. ఇప్పటికినీ అచటనే యున్నాడు. ఆయన దర్శన మాత్రముచే సర్వమానవుల పాపములను పోగొట్టును (26). ఓ దేవర్షీ! ఆ దినమునుండి శివపుత్రుడగు కార్తికేయుని బ్రహ్మ చర్యము స్థిరముగా నుండెను (27).


కార్తికేయుని నామము ముల్లోకములలో ప్రసిద్ధమైనది. ఆ శ్రేష్ఠ పవిత్ర నామము సర్వపాపములను పోగొట్టి బ్రహ్మచర్యమునిచ్చును (28). ప్రతి సంవత్సరములో కార్తీక మాసము నందు దేవతలు, శిష్యులతో గూడి ఋషులు, మరియు మునిశ్రేష్ఠులు కుమారుని దర్శనముకొరకు వెళ్లు చుందురు (29). ఎవడైతే కార్తీక మాసములో కృత్తికానక్షత్రమునాడు కుమారస్వామిని దర్శించునో, వాని పాపములన్నియు భస్మమై, మనస్సులో కోరిన ఫలములు లభించును (30). స్కందుడు దూరమగుటచే దుఃఖమును పొందిన ఉమాదేవి కూడా దీనురాలై శివునితో 'ప్రభూ! నన్ను అచటకు తీసుకొని వెళ్లుడు' అని పలికెను (31). ఆమె సుఖము కొరకు శంభుడు ఆమెతో గూడి స్వయముగా ఆ పర్వతమునకు వెళ్లి మల్లికార్జునుడు అను పేర అచట జ్యోతిర్లింగమై వెలసి జనులకు సుఖములనిచ్చు చున్నాడు (32). ఈనాటికీ శివుడు పార్వతితో గూడి అచట దర్శనమిస్తూ, తన భక్తులందరి కోర్కెలనీడేర్చుచూ సత్పురుషులకు శరణమై ఉన్నాడు(33).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 679🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 20 🌴*


*🌻 The celebration of Gaṇeśa’s marriage - 3 🌻*


Brahmā said:—


22. O Nārada, following the mental process of lord Śiva, you spoke these words to Kumāra and then kept quiet.


23. After bowing to his father, the infuriated Skanda went to the Krauñca mountain[2] though forbidden by his parents.


24. “Even when forbidden by us why do you go?” Although he was prevented by saying this, he went away saying “No”.


25. “O parents, I shall not stay here even a moment when deception has been practised on me eschewing affection towards me.”


26. O sage, he went away saying so. Even today he is staying there removing the sin of all by his very vision.


27. Ever since that day, O celestial sage, the son of Śiva, Kārttikeya remains a bachelor.


28. His name bestows auspiciousness in the world. It is famous in the three worlds. It dispels all sins, is meritorious and confers the sanctity of celibacy.


29. In the month of Kārttika, the gods, the holy sages and great ascetics go there to see Kumāra.


30. He who has the vision of the lord in the Kṛttikā Nakṣatra in the month of Kārttika is divested of all sins. He derives all desired fruits.


31. Pārvatī became grief-stricken by separation from Skanda. She piteously told her lord. “O lord, let us go there.”


32. Śiva went to that mountain partially for her happiness. He assumed the pleasing form of Jyotirliṅga named Mallikārjuna.[3]


33. Even now Śiva is seen there with Pārvatī satisfying the desires of his devotees. He is the goal of the good.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 300 / Osho Daily Meditations - 300 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 300. మూలపు తాళం చెవి 🍀*


*🕉. పూర్తి అంగీకారం కీలకం. ఇది మూలపు తాళం చెవి. అది అన్ని తలుపులు తెరుస్తుంది. 🕉*


*అంగీకారం ద్వారా తెరవలేని తాళం లేదు. ఇది అన్ని తాళాలకు సరిపోయే చెవి -ఎందుకంటే మీరు ఏదైనా అంగీకరించిన క్షణం, మీ ఉనికిలో ఒక పరివర్తన ప్రారంభమైంది ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి వైరుధ్యం లేదు. మీరు ఇద్దరు కాదు. అంగీకారంలో మీరు ఒక్కటయ్యారు, మీరు ఐక్యత అయ్యారు. మీ ఐక్యతను, మీ సంక్లిష్టతను గుర్తుంచుకోండి. ఇది చాలా బాగుంది. కోరికలు అందమైనవి. అభిరుచి మంచిది - మీరు దానిని అంగీకరిస్తే, అది కరుణ అవుతుంది. మీరు కోరికలను అంగీకరిస్తే, అదే శక్తి కోరిక లేనిదిగా మారడం మీరు చూస్తారు. కోరికలలో చేరి ఉండే శక్తి అదే. మీరు కోరికలను అంగీకరించినప్పుడు, మీరు విశ్రాంతి తీసుకుంటారు మరియు శక్తి మరింత సహజంగా ప్రసారం ప్రారంభమవుతుంది.*


*మీరు వాటిని ఉన్నట్లుగా చూడటం ప్రారంభించండి. మీరు ఈ కోరికతో లేదా దానితో ఎక్కువ పాలుపంచుకోలేదు. మీరు అంగీకరించారు, కాబట్టి సమస్య లేదు. మీరు కోరిక అని పిలవబడేది కోరిక లేనిది అవుతుంది. ప్రస్తుతం బొగ్గులా ఉంది. ఇది వజ్రాలుగా రూపాంతరం చెందుతుంది; అది విలువైనదిగా మారవచ్చు. కోరిక లేని వ్యక్తి గురించి ఆలోచించండి - అతను నపుంసకుడు అవుతాడు. నిజానికి, అది సజీవంగా ఉండదు. ఎందుకంటే అతను కోరిక లేకుండా ఎలా జీవిస్తాడు? కాబట్టి కోరికలేమి ప్రతికూలమైనది కాదు. ఇది అన్ని కోరికల యొక్క అంతిమ సానుకూలత. కోరికలు తెలిసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, జీవించినప్పుడు మరియు అనుభవించి నప్పుడు, మీరు వాటిని మించిపోయారు. నీకు యుక్తవయస్సు వచ్చింది.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 Osho Daily Meditations - 300 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 300. THE MASTER KEY 🍀*


*🕉. Total acceptance is the key. It is the master key; it opens all the doors. 🕉*


*There is no lock that cannot be opened by acceptance. It is simply the key that fits all the locks-because the moment you accept something, a transformation has started in your being because now there is no conflict. You are not two. In acceptance you have become one, you have become a unity. Remember your unity, your complexity. It is beautiful. Desires are beautiful. Passion is good-if you accept it, it will become compassion. If you accept the desires, by and by you will see that the same energy is becoming desirelessness. It is the same energy that was involved in the desires. When you accept the desires, by and by you relax, and energy starts streaming more naturally.*


*You start seeing things as they are. You are not too involved with this desire or that. You have accepted, so there is no problem. Whatever you call desire will become desirelessness. Right now is like coal. It can be transfigured into diamonds; it can become precious. Just think of the man who is desireless--he will be impotent. In fact, she will not be alive, because how will he live without desire? So desirelessness is not negative. It is the ultimate positivity of all desires. When desires are known, understood, lived, and experienced, you have gone beyond them. You have come of age.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 427 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।

నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀*


*🌻 427. 'నిస్సీమ మహిమ’ - 2 🌻*


*శ్రీమాత మహిమను కొలతలు వేయుటకు పూనుకొనిన త్రిమూర్తులు ఆమె మహిమను తెలియుటలో భయమును చెందిరి. తమ తమ స్థానములకు పరిమితులై కర్తవ్యోన్ముఖులైరి. జీవులు శ్రీమాత స్వరూపులే గనుక వారు కూడ వారి దేహ పరిమాణమునకు లొంగి యుండవలసిన అవసరము లేదు. జీవుని దేహము సృష్టివంటిది. అందు జీవుడు దైవాంశ. అతడు కూడ నిజమునకు దేహపరిమితులను దాటి యుండవచ్చును.*


*అతడి మహిమ కూడ దూర తీరములకు వ్యాపించ వచ్చును. శ్రీమాత భక్తులగు మహాత్ములట్లే యుందురు. బ్రహ్మర్షులు, మహర్షులు, రాజర్షులు వారి యోగ తపో బలములచే తీరముల నతిక్రమించి మహిమ చూపుచుండుట తెలిసిన విషయమే. ఇట్లు జీవులందరును కూడ నిజమునకు పరిమితులు లేనివారే. ఉన్నదని భావించుటచే అట్లు ఇమిడి యుందురు. వారి యందు జ్ఞానము వికసించు చుండగా వ్యాప్తి చెందుచు నుందురు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita

Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻*


*🌻 427. 'Nisseema Mahima' - 2 🌻*


*Trimurthi( The Holy triumvirate) who tried to measure Srimata's glory got scared upon knowing Her glory. They were bound by their duty and limited to their respective positions. As living beings are forms of Sri Mata, there is no need for them to be limited by the bodies. Jiva's body is like creation. In that, the creature is divine. He may also be beyond the physical limits of his body.*


*Their glory too can spread to distant shores. Devotees of Sri Mata who are Mahatmas are like this. It is a well-known fact that Brahmarshis, Maharshis and Rajarshis have shown their powers and glory well beyond their physical existence. All such living beings are also limitless. They are limited because they think they are. As knowledge blossoms in them, they walk towards omniscience .*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

Commenti


Post: Blog2 Post
bottom of page