*🌹. శ్రీమద్భగవద్గీత - 212 / Bhagavad-Gita - 212 🌹* *✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద* *📚. ప్రసాద్ భరద్వాజ* *🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 08 🌴* *08. నైవ కించిత్ కరోమీతి యక్తో మన్యేత తత్త్వవిత్ |* *పశ్యన్ శృణ్వన్ స్పృశన్జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్స్వపన్ శ్వపన్ ||* 🌷. తాత్పర్యం : *దివ్యచైతన్య యుక్తుడైన వాడు చూచుట, వినుట, తాకుట, వాసనజూచుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవముగా ఏదియును చేయనట్లుగా ఎరిగియుండును.* 🌷. భాష్యము : కృష్ణభక్తిభావనలో నున్నటువంటివాడు శుద్ధస్థితిలో యున్నందున కర్త, కర్మము, స్థితి, ప్రయత్నము, అదృష్టములను ఐదు విధములైన కారణములపై ఆధారపడియుండు ఎటువంటి కర్మలతో సంబంధమును కలిగియుండడు. శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుక్తసేవలో అతడు నిలిచియుండుటచే అందులకు కారణము. దేహేంద్రియములతో వర్తించుచున్నను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన వాస్తవస్థితిని గూర్చి సర్వదా ఎరిగియుండును. భౌతికభావనలో ఇంద్రియములు ఇంద్రియభోగమునకై నియోగించబడగా, కృష్ణభక్తిభావన యందు అవి కృష్ణుని ప్రీత్యర్థమై నియోగించబడును. కావుననే కృష్ణభక్తిపరాయణుడు ఇంద్రియకర్మలలో వర్తించుచున్నట్లు తోచినను ఎల్లవేళలా విముక్తుడై యుండును. 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Bhagavad-Gita as It is - 212 🌹* *✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada* *📚 Prasad Bharadwaj* *🌴 Chapter 5 - Karma Yoga - 08 🌴* *08. naiva kiñcit karomīti yukto manyeta tattva-vit* *paśyañ śṛṇvan spṛśañ jighrann aśnan gacchan svapañ śvasan* 🌷 Translation : *A person in the divine consciousness, although engaged in seeing, hearing, touching, smelling, eating, moving about, sleeping and breathing, always knows within himself that he actually does nothing at all.* 🌹 Purport : A person in Kṛṣṇa consciousness is pure in his existence, and consequently he has nothing to do with any work which depends upon five immediate and remote causes: the doer, the work, the situation, the endeavor and fortune. This is because he is engaged in the loving transcendental service of Kṛṣṇa. Although he appears to be acting with his body and senses, he is always conscious of his actual position, which is spiritual engagement. In material consciousness, the senses are engaged in sense gratification, but in Kṛṣṇa consciousness the senses are engaged in the satisfaction of Kṛṣṇa’s senses. Therefore, the Kṛṣṇa conscious person is always free, even though he appears to be engaged in affairs of the senses. 🌹 🌹 🌹 🌹 🌹 #భగవద్గీత #BhagavadGita https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://www.tumblr.com/blog/bhagavadgitawisdom https://chaitanyavijnanam.tumblr.com/
top of page
bottom of page
Comments