🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 302 / DAILY WISDOM - 302 🌹
🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 28. మృత్యుభయం మరేమీ కాదు, ఆనందాన్ని కోల్పోతామనే భయం 🌻
మన అభౌతిక అనుభవాలు సూక్ష్మ వాస్తవికతపై నమ్మకంతో పాటు మనలో భయం యొక్క అనుభూతిని కూడా సూక్ష్మంగా సృష్టిస్తుంది. ఇది మనం అనుకున్న నమ్మకానికి విరుద్ధంగా ఉంటుంది. మనం విషయాలకు ఎందుకు భయపడుతున్నాము? ఇంద్రియ వస్తువులతో సంపర్కం కోల్పోతామని భయం. మృత్యుభయం అనేది భౌతిక ఆనందాన్ని కోల్పోతామనే భయం తప్ప మరొకటి కాదు. ' మృత్యువు కబళిస్తే మన ఆనందాలన్ని కోల్పోతాము'. అనే భయం. ప్రతి వ్యక్తిలో జీవితం పట్ల ప్రేమ తో పాటు, మృత్యు భయం కూడా ఉంటుంది. రెండు కూడా విషయ వాంఛలపై మోహం తప్ప మరొకటి కాదు. లేకుంటే చావు అంటే భయం ఎందుకు?
ఎందుకంటే అస్మిత (అహంకారం) సృష్టించిన సంబంధాలు ఇక్కడ ఆనందానికి కేంద్రాలుగా ఉన్నాయని మరియు అవి మాత్రమే వాస్తవాలు మరియు వాటిని మించినది ఏమీ లేదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండడమే. ఇంద్రియ భోగాలకు మించిన ఆనందం ఏదయినా సాధ్యమవుతుందని, ఎవరైనా ఊహించగలరా? ఎవరూ ఊహించలేరు. మనం మేధోపరంగా, విద్యాపరంగా మాత్రమే ఊహించుకుంటాము - ఇంద్రియ సుఖాలలో ప్రతిదీ చేర్చబడింది, అదే సర్వస్వం అని భావిస్తాము. కాని నిజంగా, ఆచరణాత్మకంగా చూస్తే అలాంటిది ఏదీ లేదు అని తెలుస్తుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 302 🌹
🍀 📖 from The Study and Practice of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 28. The Fear of Death is Nothing but the Fear of Loss of Pleasure 🌻
The confirmed belief in the substantiality of our phenomenal experiences subtly creates a feeling of fear in us simultaneously, which is contrary to the apparent belief in the reality of things. Why are we afraid of things? The fear is due to the subtle feeling of the possibility of one's being wrenched out of one's contact with the objects of sense. The fear of death is nothing but the fear of loss of pleasure. “I may lose all my centres of pleasure if the forces of death come and catch hold of my throat.” The love of life which is so inherent in every individual, accompanied by the fear of death, is another form of the love of pleasure; otherwise, why should one fear death so much?
It is because the so-called phenomenal relationships created by asmita have formed the impression that there are centres of joy here, and they are the only realities—there is nothing beyond. Can anyone imagine, even with the farthest stretch of thought, that there is any delight possible, or even conceivable, beyond the pleasures of sense? There is nothing conceivable. We only imagine intellectually, academically — Everything is included within sense pleasures. They are everything. But when we see practically, we understand there is none like that.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
コメント