top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 303 - 29. This is the Reason of Bondage / నిత్య ప్రజ్ఞా సందేశములు - 303 - 29. ఇది బంధ



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 303 / DAILY WISDOM - 303 🌹


🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀


📝 .స్వామి కృష్ణానంద

📚. ప్రసాద్ భరద్వాజ


🌻 29. ఇది బంధం యొక్క కారణం 🌻


ఇంద్రియ సంపర్కంలో మనం ఎందుకు ఆనందాన్ని పొందుతున్నామో, అదంటే మనకు ఎందుకు ఇష్టమో అనుభూతి యొక్క నిర్మాణం మనకు తెలియకపోతే తెలుసుకోవడం కష్టం. మనం వస్తువులను ఎందుకు చూస్తున్నాము? ఏది మనల్ని బలవంతం చేస్తుంది లేదా వస్తువుల వైపు నడిపిస్తుంది? మనం విషయాలతో సంప్రదించ వలసిన అవసరం ఎక్కడ ఉంది? శారీరక శాస్త్రముు యొక్క లోతైన అధ్యయనం చేస్తే, ఈ పరిస్థితికి కారణమును, మనం బాధను, ఆనందంగా తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నామో మరియు ఇంద్రియాలు సృష్టించే ఈ మాయలో ఎందుకు పడతామో కొంతవరకు తెలుసుకో గలుగుతాము.


నరాల ఒత్తిడి నుంచి లభించే కొద్ది ఉపశమనాన్ని మనం ఆనందం అనుకుంటాము. దానినే సత్యం అనుకుంటాము. ఈ విషయాలను గ్రహించలేక పోవడం వల్లనే శారీరక ప్రక్రియలు మరియు వాటి అనుభవాలు తమంతట తాముగానే ఒక వాస్తవంగా వ్యవహరిస్తాయి అనే దురభిప్రాయాన్ని కలిగి ఉంటున్నాము. ఇదే బంధాలు ఏర్పడడానికి ప్రధాన కారణం. దాని నుండి బయటపడటం ఎంత కష్టమో ఉపరితలంపై స్పష్టంగా తెలుస్తుంది. కారణాలను కాకుండా కేవలం వాటి ప్రభావాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇది కొంతవరకు సందర్భోచిత కారణాల వల్ల జరుగుతుంది.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 303 🌹


🍀 📖 from The Study and Practice of Yoga 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 29. This is the Reason of Bondage 🌻


It is difficult to know why we feel happiness, why there is pleasure at all in sense contact, unless we know the anatomy of perception itself. Why is it that we are seeing objects? What is it that compels us or drives us towards objects? Where is the need for us to come in contact with things? If the history and the anatomical background of this situation are properly grasped, we may also be able to know to some extent why it is that we wrongly mistake pain for pleasure, and how is it that we can get fooled by the senses in creating a notion of falsehood—how a negative reaction, which is merely a little bit of freedom from tension of nerves, can look like a positive bliss.


It is the inability to grasp these things that has created an impression that bodily experiences and phenomenal processes are independent by themselves—a reality taken by themselves. This is the Reason for bondage; and how difficult it is to get out of it is clear on the very surface. Most of the endeavours in spiritual practice become failures on account of the causes being left untouched and the effects being taken into consideration with great ardour and force of concentration. This is partly due to circumstantial reasons.


Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


Post: Blog2 Post
bottom of page