top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 310 - 5. A Method of Meditation / నిత్య ప్రజ్ఞా సందేశములు - 310 - 5. ఒక ధ్యాన మార్గము


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 310 / DAILY WISDOM - 310 🌹


🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀


📝 .స్వామి కృష్ణానంద

📚. ప్రసాద్ భరద్వాజ


🌻 5. ఒక ధ్యాన మార్గము 🌻


మీరు ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ చైతన్యం కొంత ఆ విషయానికి బదిలీ అవుతుంది. అప్పుడు మీ శరీరానికి ఉన్న చైతన్యం కొంత తగ్గుతుంది. మీరు మీ శరీరం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఇతర వస్తువుల నుంచి వేరు అవుతున్నారు. కానీ ధ్యానం యొక్క ఒక మార్గం ఏమిటంటే మీరు మీ చైతన్యాన్ని మీరు కాక వేరే వస్తువుపై కేంద్రీకృతం చేయడం. అది ఏ వస్తువైనా కావచ్చు. అప్పుడు ఈ శరీరం పై ఉన్న వ్యామోహం కొంత తగ్గుతుంది. ఇది పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడిన ఒక మార్గం.


మీరు మీ చైతన్యాన్ని కేంద్రీకృతం చేసిన విషయం ఏదైనా కావచ్చు. అది ఒక ప్రాపంచిక విషయం కావచ్చు, లేదా స్వయంగా భగవంతుడే కావచ్చు, లేదా పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, విశ్వం, కాలం - ఇలా దేనికైనా మీ చైతన్యాన్ని బదిలీ చేయొచ్చు. అప్పుడు మీ శరీరం పై ఉన్న వ్యామోహం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. నెమ్మదిగా మీ మనస్సు విశ్వవ్యాప్తం అవుతుంది. ఇది ఒక రకమైన ధ్యానం. ఇక్కడ చైతన్యం మీకు, మీ వెలుపల ఉన్న వస్తువుల మధ్యలో ఉంటుంది. ఇది నిజంగా అద్భుతమే. ఇది చేస్తూ ఉండండి. అప్పుడు ఇది మీ నియంత్రణ లోకి రావడాన్ని మీరు గమనిస్తారు.


కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 310 🌹


🍀 📖 from Your Questions Answered 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 5. A Method of Meditation 🌻


When you concentrate on any object, your consciousness is transferred to that object, and then the consciousness of your body becomes less. You are thinking too much of this body; therefore, the objects are cut off. But one of the techniques of meditation is to concentrate the consciousness on another thing. It may be anything. Then immediately the attachment to this body gets loosened. That is one method which is prescribed by Patanjali in the Yoga Sutras.


That thing which you are concentrating upon can be any object. It can be a little material thing, or it can be God Himself, or all the five elements, or the sun, the moon, the stars, space, time—to anything you can transfer your consciousness. Then, the attachment to this body gets loosened and becomes less and less. Slowly you will find that your mind spreads into a universal state. This is one method of meditation. Here, the consciousness exists between you and what is outside you! Wonder indeed! Keep doing it, and you will see that it comes under control.


Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


Post: Blog2 Post
bottom of page