🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 313 / DAILY WISDOM - 313 🌹
🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ
🌻 8. అంతర్ దృష్టి యొక్క మెరుపును సృష్టించడం 🌻
బుద్ధి లోతైన ధ్యానంలో నిమగ్నమైనపుడు, అది అనుభూతిగా మారుతుంది. బుద్ధి మరియు అనుభూతి కలిసి పనిచేస్తే అవి తక్షణం అంతర్దృష్టి గా మారతాయి. అంతర్ దృష్టి అనేది బుద్ధి మరియు అనుభూతి కలయిక తప్ప మరొకటి కాదు. అవి సాధారణంగా విడిగా వ్యవహరిస్తాయి. మనం విషయంగా అర్థం చేసుకున్నది, మనకు అనుభూతికి రాదు; మనకు కేవలం అనుభూతికి వచ్చింది, మనకు పూర్తిగా అర్థం కాదు. అలా ఉండకూడదు. అవి సమాంతరంగా కలిసి పనిచేయాలి, తద్వారా అర్థం చేసుకోవడం మరియు అనుభూతికి రావడం ఏక కాలంలో జరగాలి.
అవగాహన కంటే అనుభూతి మనకు దగ్గరగా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే అనుభూతి చెందడం అంటే మీ ఉనికి లో భాగం అవడమే. దాంట్లో మీ అవగాహన కుదుటపడాలి. దీన్నే శ్రవణ, మనన, నిదిధ్యాసం అని అంటారు. మనం ఇప్పుడు చర్చిస్తున్నది శ్రవణం, వినికిడి. మీరు చెప్పేది నేను వింటాను మరియు నేను చెప్పేది మీరు వింటారు. అప్పుడు మీరు విన్న విషయం గురించి ఆలోచించండి, మీలో ఆ అవగాహన పెంచండి. చివరగా, మీరు ఆ ఆలోచనగానే మారండి; దానిని నిదిధ్యాసనం అంటారు. ఈ పద్ధతిని రోజంతా కొనసాగించాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 313 🌹
🍀 📖 from Your Questions Answered 🍀
📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 8. Creating a Flash of Intuition 🌻
When the intellect asserts itself in deep contemplation, it becomes feeling, and if the intellect and the feeling go together, they can create a flash of what is called intuition. Intuition is nothing but the blending together of intellect and feeling. They are generally acting separately. What we understand, we don't feel; and what we feel, we don't understand. It should not be like that. They must act together parallelly, so that it may be one action of understanding and feeling.
Feeling is nearer to you than understanding. Feeling is what you are, actually speaking. Into that the understanding has to sink. This is what they call the process of sravana, manana and nididhyasana. Whatever we are discussing now is sravana, hearing. I hear what you say, and you hear what I say. Then you cogitate over this matter and sink these thoughts into yourself. Finally, you be that thought itself; that is called nididhyasana. This practice has to be carried on throughout the day.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments