🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 327 / DAILY WISDOM - 327 🌹
🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀
✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ
🌻 22. వస్తువులు వస్తాయి, పోతాయి. 🌻
మీరు ఆప్యాయత, దయ మరియు కరుణ, సేవాభావం మరియు దాతృత్వం కలిగి ఉండాలని చెప్పబడింది. నిజానికి ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైనవే, కానీ వీటన్నింటి కంటే ముఖ్యమైనది మరొకటి ఉంది, ఇది ఆత్మ చివరకు ఎక్కడికి చేరుకుంటోంది అనే విషయం. ఈ ప్రపంచం మానవజాతితో సహా ఏదో ఒక రోజు అదృశ్యమవుతుంది. ఒక దానికి ప్రారంభం ఉంటే, ముగింపు కూడా ఉంటుంది. సౌర వ్యవస్థ కూడా శాశ్వతంగా మనుగడ సాగించక పోవచ్చు. మన ఇంద్రియాలకు అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా, అది నిజం అనుకొని సంతృప్తి చెందడం అంత తెలివైన పనేమీ కాదు.
వస్తువులు వస్తాయి, పోతాయి. మనుషులు పుడతారు, చనిపోతారు. సామ్రాజ్యాలు పెరుగుతాయి, పతనమవుతాయి. చాలా మంది సీజర్లు మరియు నెపోలియన్లు వచ్చారు మరియు పోయారు. ఏమీ మిగలలేదు. ఈ డ్రామా ఏమిటి? ఈ నిగూఢ విశ్వ చరిత్రలో ఏదీ శాశ్వతంగా ఉన్నట్లు అనిపించదు. కొంత కాలం పాటు మనుగడలో ఉన్నట్లు కనిపించినా, అది ఎంత కాలం ఉంటుంది తెలీదు. ఈ ప్రపంచంలో మనకు సంవత్సరాలు కాదు కదా ఎన్ని నిమిషాలు ఉన్నాయో తెలీదు. కొన్ని కారణాల వల్ల కొన్ని నిమిషాలు మాత్రమే ఉండవచ్చు. గత అనుభవాలను బట్టి, చరిత్రను బట్టి మనం నేర్చుకోవాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 327 🌹
🍀 📖 from Your Questions Answered 🍀
📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 22. Things Come, and Things Go 🌻
You must be affectionate, kind and compassionate, serviceful and charitable, they say. All this is very, very important indeed, but there is something more important than all these things, which is the destiny of the soul of the human individual—what happens, finally. This world shall vanish one day, with all its humanity. If it had a beginning, it shall have an end, also. Even the solar system may not survive eternally. It would not be a wise complacence on the part of anyone to imagine that everything is fine, as it appears on the surface to the sense organs.
Things come, and things go. People are born, and people die. Empires rise, and empires fall. Caesars and Napoleons have come, and many have gone, also. Nothing remains. What is this drama? In this mysterious presentation of the history of the universe, the history of humanity, nothing seems to be enduring, and even when something appears to be enduring for some time, we do not know for how long it will endure. None of us knows how many minutes more we will be in this world, let alone years. There may be only a few minutes, for some reason. We have to learn by past experience, and by history.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários