top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 329 - 24. You Cannot Know the Environment Unless You Know Yourself First / నిత్య ప్రజ



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 329 / DAILY WISDOM - 329 🌹


🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀


✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ


🌻 24. ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటే తప్ప మీరు పర్యావరణాన్ని తెలుసుకోలేరు 🌻


మిమ్మల్ని మీరు తెలుసుకోవాలను కోవడంలో తప్పు లేదు. శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు ఎవరైనా సరే, వారు విశ్వానికి వెలుపల ఉన్నారని, వారు దానిని నిర్వహించ గలరని మరియు దానిని ఎద్దు, గుర్రం లేదా ఏనుగులాగా ఉపయోగించు కోగలరని భావించడమే ప్రాథమిక తప్పు. - వారు తెలుసుకోవాలనే దానిలో వారు కూడా భాగమని గుర్తించట్లేదు. మీరు మొదట మిమ్మల్ని మీరు తెలుసుకుంటే తప్ప, మీరు పర్యావరణాన్ని తెలుసుకోలేరు. తమను కూడా తనలో కలిగి వున్న ఈ పర్యావరణాన్ని తమకు వెలుపల ఉన్నట్లు ఈ ప్రజలు ఎందుకు భావిస్తారు?


శాలువాలా, దుప్పటిలాగా పర్యావరణం మనకు అంటుకుని ఉందని ఎప్పుడూ అనుకుంటాం. కానీ, అలా కాదు. పర్యావరణం అనేది మనం కప్పుకునే దుప్పటి కాదు. ఇది చర్మం వంటిది; మీరు చర్మాన్ని తొలగించలేరు. పర్యావరణం మీ చర్మం లాంటిది కాబట్టి మీరు దాని మీద పని చేస్తున్నప్పుడు, మీరు మీ మీదే పని చేసుకుంటున్నారు. అయినప్పటికీ, ఏ రాజకీయ నాయకుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోడు, ఎందుకంటే అతను స్వార్థపరుడు, మరియు స్వల్ప తాత్కాలిక లాభం కోసం ఆలోచిస్తాడు మరియు రాజనీతిజ్ఞ స్ఫూర్తితో భవిష్యత్తు గురించి ఆలోచించడు.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 329 🌹


🍀 📖 from Your Questions Answered 🍀


📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj


🌻 24. You Cannot Know the Environment Unless You Know Yourself First 🌻


You are perfectly right in saying that you would like to know yourself. Scientists, philosophers, ecologists, politicians, sociologists, whoever they are, make the fundamental mistake of thinking that they are outside the universe, that they can handle it, and harness it as if it is a bull, or a horse, or an elephant—not knowing that they are included in that which they seek. You cannot know the environment, unless you know yourself first. Why should people have such problems, but for the fact that they have misconstrued the whole structure of the environment, which includes themselves, as if the environment is outside?


We always think that the environment is sticking to us, like a shawl or a blanket, but, it is not so. The environment is not a blanket which we can throw it away. It is rather like skin; you cannot remove the skin. The environment is your skin itself, so when you handle it, you are handling yourself. Yet, no politician will understand this point because he is selfish, and is concerned with a little temporary gain, and not thinking of the future in the spirit of a statesman.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


Post: Blog2 Post
bottom of page