top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 338 - 3. Every Individual Asks for Freedom / నిత్య ప్రజ్ఞా సందేశములు - 338 - 3. ప్రతి



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 338 / DAILY WISDOM - 338 🌹


🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀


📝. ప్రసాద్ భరద్వాజ్


🌻 3. ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసం అడుగుతాడు 🌻


మనిషి కారాగారంలో బంధించబడిన ఆత్మ అని అనిపిస్తుంది. అతను ఆశించిన దాన్ని పొందే అవకాశం లేనట్లుగానే ఉంది. తను కోరుకునేది ఈ ప్రపంచం ఇవ్వట్లేదు, ఇవ్వలేదు. ఈ ప్రపంచంలో ఎక్కడా స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది ఎక్కడా కనిపించట్లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యవస్థ, నియంత్రణ, చట్టం, నీతి, నైతికత - ఇలా అనేక సంకెళ్లతో ముడిపడి ఉన్నారు. ప్రభుత్వ చట్టాలు మనిషిని నిర్ణీత పద్ధతిలో ప్రవర్తించేలా చేసే బాహ్య ఆదేశాలు. కానీ మనిషిని అలా బలవంతం ఎవరూ చేయలేరు. తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ఏదైనా చేయాలని, లేదా ఆలోచించాలని ఎవరూ కోరుకోరు. మనిషిలో సహజత్వం ఉంటుంది.


ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛ కోసం అడుగుతాడు కానీ బానిసత్వం కాదు, అది ఏ రకంగా అయినా. ప్రభుత్వ చట్టానికి లోబడి ఉండటం కూడా ఒక బానిసత్వమే. కానీ మనిషి కోరుకున్నది స్వేచ్ఛ! మనుషులు స్వేచ్ఛ కోరినప్పుడు, వారు బానిసత్వం పొందారు! ఒక రకమైన బానిసత్వం నుండి వారు మరొక రకమైన బానిసత్వం లోకి ప్రవేశించారు; వారికి స్వేచ్ఛ మాత్రం లభించ లేదు. మనిషికి ఇప్పుడు వేరే రకమైన భయం ఉంది. ఒకప్పుడు అతను ఒక వ్యక్తికి లేదా ఒక వ్యక్తి యొక్క సమూహానికి భయపడ్డాడు. ఇప్పుడు అతను తానే సృష్టించుకున్న ఒక పెనుభూతానికి భయపడుతున్నాడు. దానికి సాటి వచ్చేలా అతనేమీ కనిపించట్లేదు.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 338 🌹


🍀 📖 from The Philosophy of Religion 🍀


📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj


🌻 3. Every Individual Asks for Freedom 🌻


It appears that man is a bound soul pressed into a concentration camp, and it further appears that he just cannot hope to discover what he is internally aspiring for. The world does not seem to have the capacity to deliver the goods. There is no freedom in this world. It cannot be seen anywhere. Everybody is tied down by the shackles of some system, regulation, law, ethics, morality—whatever they may be. Governmental laws are external mandates which force man to behave in a given manner. But man cannot be forced like that. Nobody wishes to be compelled to do, or even to think, something by force. There is a spontaneity in man.


Every single individual asks for freedom and not bondage, be it of any kind whatsoever. Even to be subjected to the law of a government is a bondage, and to think what man aspired for was freedom! So, when men asked for freedom, they got bondage! From one kind of bondage they have entered into another kind; in the bargain, no freedom has come. Man, now, has a fear of a different type. While he was afraid of one individual or one group of individuals then, now he is afraid of a larger spectre that is before him, which he has himself created, and he does not seem to be any the better for it.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page