🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 339 / DAILY WISDOM - 339 🌹
🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀
📝. ప్రసాద్ భరద్వాజ్
🌻 4. మనిషికి తన స్వయంలోనే సమస్యలు ఉన్నాయి 🌻
మనిషి సమస్యలు ఏమిటి? తనలో ఉన్న లోపాలు ఏమిటి? ఇది సమస్యల సముద్రం. ఈ ఇబ్బందుల మూలాన్ని సూచించే సమాధానం ఎవరూ అంత సులభంగా ఇవ్వలేరు. మనిషి అన్ని వైపులా అనేక సమస్యలు అవరించి ఉన్నాయి. మనిషికి తనంతట తానుగా సృష్టించుకునే సమస్యలు, బయటి సమాజం నుండి సమస్యలు ఉన్నాయి. అంతేకాక ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు మొదలైన దైవీపరమైన తెలియని ఇబ్బందులు ఉన్నాయి. భారతీయ తాత్విక పరిభాషలో, ఈ మూడు రకాల ఇబ్బందులను తాపత్రయం అంటారు. ఇవి కాక స్వభావ అంతర్భాగంలో కొంత సమస్య ఉంది, బాహ్యంగా కొంత ఉంది, మరియు పై నుండి మొత్తంగా ఇంకేదో ఉంది.
మనిషికి తన వెలుపలి వస్తువుల నుండి, మనుషుల నుండి మరియు విషయాల నుండి కలిగే భయమే బాహ్య సమస్య. వ్యక్తి విషయాలను పూర్తిగా విశ్వసించలేడు. ప్రతిదాని గురించి కొంత ఆందోళన చెందుతాడు. బయట జరిగే పరిణామాల వల్ల అతను పడే కష్టం ఇది. వరదలు, కరువులు, భూకంపాలు, తుఫానులు, పిడుగులు వంటి ఇతర ప్రకృతి వైపరీత్యాలు వల్ల కలిగే విభిన్న రకాల భయాలు కూడా ఉన్నాయి. కానీ వీటికి మించి, ప్రతి వ్యక్తికి స్వంత అంతర్గత ఇబ్బందులు కూడా ఉన్నాయి. మనిషి తనలో తాను మానసిక వికలాంగుడు. అతని వ్యక్తిత్వంలోనే ఒక వైరుథ్యత, సంఘర్షణ కనబడుతుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 339 🌹
🍀 📖 from The Philosophy of Religion 🍀
📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 4. Man has Problems within His Own Self 🌻
What are man's problems? What does he lack finally? It is an ocean of problems, and no one can easily give an answer offhand indicating the source of these difficulties. Man is apparently buffeted from every side. Man has problems within his own self, problems from outside society, and problems and unknown difficulties descending from the heavens like natural cataclysms, catastrophes, etc. In Indian philosophical terminology, these difficulties arising from the three sources are called tapatraya, a problem which is threefold in its nature. Inwardly there is some problem, outwardly there is some, and from above there is something else altogether.
The fear that man has from things outside him, from men and things, etc., is the external problem. One cannot trust things fully. There is an anxiety about everything. This is the difficulty that he faces from the phenomena outside. There are also fears of a different type whose causes are unknown, which are capable of descending on man from above, like floods, droughts, earthquakes, cyclones, tempests and thunderstorms, and other such natural calamities. But over and above these, there are inward difficulties of one's own. Man is a psychological derelict in himself. There is a conflict in his own personality.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Bình luận