🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 353 / DAILY WISDOM - 353 🌹
🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀
📝. ప్రసాద్ భరద్వాజ్
🌻18. పదార్ధం జీవితంతో సమానం అన్నది నిజం కాదు🌻
ప్రాణం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? జీవం అనేది స్థూలపదార్థంతో ముడిపడి లేనిది అని జీవశాస్త్రం చెప్తుంది. జీవం సైతం పదార్థం లో ఒక భాగమని నిపుణులు అనేక సందర్భాలలో చెప్పినప్పటికీ ఆ విషయం అర్ధం చేసుకోవడం చాలా మందికి సాధ్యం కాలేదు. ఎవరైనా ఇటుక లోనూ, దేహం లోనూ ఉండే జీవం ఒకటే అంటే, ఆ దేహం లేకపోయినా జీవం మనుగడ సాగుతుంది అంటే ఎలా నమ్ముతారు? మనిషి ఆ దేహం యొక్క స్పృహ లేకుండా కూడా జీవించగలడు. దేహము ప్రాణముతో సమానమైతే, దేహము నుండి విడిపోయినప్పుడు జీవము నశించి పోయేది. కానీ మనిషి కలలలోను, నిద్రలోను, లోతైన ఏకాగ్రత సమయాల్లో సైతం దేహ స్పృహ లేకున్నా సరే జీవించే ఉన్నాడు.
శరీరం తన స్పృహకు సంబంధించిన వస్తువు కానటువంటి పరిస్థితుల్లో, పదార్థమే జీవం అన్నది నిజమైతే, మనిషి ఒక్కసారిగా చచ్చిపోతాడు. పదార్ధం అంటే ప్రాణం అన్నది నిజం కాదు. అవి రెండు వేర్వేరు విషయాలు. అయితే ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటో అర్థం చేసుకోవడం కష్టం. జీవితం అంటే ఏమిటో ఎవరూ ఒక నిర్ధారణకు రాలేదు. ఈ జీవం యొక్క శక్తినే ప్రాణశక్తి అంటారు. ఈ ప్రాణ శక్తే, జీవం యొక్క శక్తి. ఈ ప్రణ శక్తినే తేజస్సు అని, జీవశక్తి అని అంటారు. ఇదే మనిషిలో ఉండే స్థూల, సూక్ష్మ మరియు తేజో శక్తులు. కొన్నిసార్లు ప్రాణం శ్వాసతో గుర్తించబడుతుంది. కానీ అది శ్వాస కంటే కూడా సూక్ష్మంగా ఉంటుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 353 🌹
🍀 📖 from The Philosophy of Religion 🍀
📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻18. It is not True that Matter is the Same as Life🌻
What is meant by prana? What is life? The biologists tell us that there is a thing called life which is incapable of identification with matter. Though, many times, mechanistic materialists have held the opinion that life is not different from matter, it has become very difficult to accept this doctrine. How can anyone say that life is the same as brick, or a body with which one is lumbering, and without which also one can exist? It is seen that man can exist even without being conscious of the body. If the body were the same as life, life would be extinct when it is dissociated from the body. But man is alive even in dream, sleep, and states of deep concentration. In deep meditation one is not aware of the body.
Man would be dead at one stroke, if it were true that matter is life, in conditions when the body is not an object of his consciousness. It is not true that matter is the same as life. They are two different things. But it is difficult to understand what the relationship is between these two. No one has ever come to a final conclusion as to what life means. It is this life-force that is called prana-sakti. There is the prana-sakti, the power of the prana. Prana is vitality, living force, organic energy. It is a living, protoplasmic, organismic, and energising vitality in man. Sometimes prana is identified with breath. But it is interior even to breath.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Opmerkingen