top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 357 - 22. Man Cannot . . . / నిత్య ప్రజ్ఞా సందేశములు - 357 - 22. మనిషి . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 357 / DAILY WISDOM - 357 🌹


🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀


📝. ప్రసాద్ భరద్వాజ్


🌻22. మనిషి బ్రహ్మను ధ్యానించలేడు 🌻


బ్రహ్మం సంపూర్ణమైనది. బ్రహ్మాన్ని ఎవరూ ధ్యానించలేరు, ఎందుకంటే అది ధ్యానం చేసేవారిని కూడా కలిగి ఉంటుంది. దేవుడు మానవులను తనలో కలిగి ఉన్నందున మనిషి భగవంతుడిని విడిగా ధ్యానించలేడు. అంటే, భగవంతుడిని ధ్యానించడమంటే తన స్వంత ఉనికిని కోల్పోవడమే. దేవుడు ఉన్నప్పుడు, మనిషి ఉండడు. ఇది ఒక సూక్ష్మమైన ఫలితం, ఇది సర్వవ్యాపి అయిన భగవంతునిపై ధ్యానం చేసే ప్రయత్నంలో ఉత్పన్నమయ్యే ఒక స్థితి.


దేవుడు, ఆ విధంగా, మనిషి ఆలోచించే ఒక వస్తువుగా కాక, సర్వావ్యాపిగా తనను తాను ధ్యానిస్తాడు. సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు ధ్యాని వేరు, ధ్యానించబడే వస్తువు వేరు. కానీ, భగవంతుని ధ్యానించేటపుడు ఆ ధ్యాని భగవంతునితో ఎంత మమేకం చెందుతాడంటే ధ్యాని తాను ధ్యానించే భగవంతుడే అయిపోతాడు. అంటే, భగవంతుడే తనను తాను ధ్యానిస్తాడు.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 357 🌹


🍀 📖 from The Philosophy of Religion 🍀


📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj


🌻22. Man Cannot Meditate on Brahman🌻


Brahman is the Absolute, and one cannot meditate on Brahman, because it is inclusive of even the meditator himself. Man cannot meditate on God because God includes the human location. Thus, to endeavour to meditate on the omnipresence of God would be a simultaneous attempt to abolish one's own individual existence. When God is, man ceases to be. This is a subtle result that would insinuate itself into the effort at meditation on the supremacy of All-Being.


God, thus, ceases to be an object of individual contemplation. God is the Supreme Subject which contemplates Itself as the All. One, generally, regards oneself as the subject, and what is contemplated upon as the object. But in the case of God, conceived in the true sense of the term, the meditating consciousness affiliates itself with the object in such an intimate manner that in this inward association of the meditator with the object of meditation it would appear that the object itself is in a state of meditation.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page