🌹Mass Extinction : ఆరో యుగాంతంలో ఉన్నాం.. సైంటిస్టుల హెచ్చరిక 🌹
Mass Extinction : ఈ భూమిపై ఉన్న జీవరాశి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి దాదాపు 90 శాతం దాకా అంతరించిపోతుంది.
మళ్లీ కొత్తగా జీవరాశి పుట్టుకొస్తుంది. దీన్నే సామూహిక నాశనం (Mass Extinction) అంటారు. ఇలా ఇప్పటికే ఐదుసార్లు జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆరోసారి జరుగుతోందనీ, ఆరో యుగాంతం మధ్యలో ఉన్నామని సైంటిస్టులు తెలిపారు.
ఈసారి యుగాంతం వస్తుండటానికి కారణం మనమే. భూమిపై మనుషుల సంఖ్య పెరిగిపోతోంది. ఇతర జీవులకు నిలువ నీడ లేకుండా పోతోంది. 1970లో ఈ భూమిపై 350 కోట్ల మంది జనం ఉండేవారు. మరి ఇప్పుడో 800 కోట్ల మంది. 50 ఏళ్లలో రెట్టింపుకి మించి పెరిగారు. అందువల్ల ప్రాణులు, మొక్కలకు ప్లేస్ లేకుండా పోతోందని సైంటిస్టులు తెలిపారు.
ఆరున్నర కోట్ల సంవత్సరాల కిందట ఇలాగే జరిగి.. అప్పట్లో బతికున్న రాక్షసబల్లులన్నీ చనిపోయాయి. అప్పటి జీవులన్నీ ప్రాణాలు కోల్పోయాయి. మళ్లీ ఆ స్థాయి ప్రమాదకర పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (WWF) ప్రకారం.. గత 50 ఏళ్లలో.. భూమిపై జీవుల్లో 69 శాతం కనుమరుగయ్యాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ అడవులు, చెరువులు, నదులు అన్నీ మాయమవుతున్నాయి. జీవులకు నిలువ నీడ లేకుండా పోతోంది. అందుకే తరచూ వన్యమృగాలు ఇళ్లలోకి వస్తున్నాయి.
ప్రాణులన్నీ బతకాలంటే.. ఇప్పుడు భూమిపై ఉన్న జనాభాకు ఒక భూమి సరిపోదు. ఇలాంటి భూములు ఐదు కావాల్సి ఉంటుంది. అన్ని ఉంటేనే.. మనుషులతోపాటూ ప్రాణులు, మొక్కలు కూడా బతకగలవు అని సైంటిస్టులు చెబుతున్నారు. 1968లో ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ రివల్యూషన్ వచ్చింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ దిగుబడులు భారీగా పెరిగాయి. ఐతే.. అప్పటి నుంటి గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుతున్నాయి. ఫలితంగా ధ్రువాల దగ్గరున్న మంచు కరిగిపోతోంది. ఓజోన్ పొర దెబ్బతింది. ప్రస్తుతం భూమిపై 70 శాతం భూమిని జనాభా ఆక్రమించింది. అలాగే.. తాజా నీటిలో 70 శాతం నీటిని మనుషులు వాడుకుంటున్నారు. సైంటిస్టులు చెబుతున్నది నిజమే. ఓ 20 ఏళ్ల కిందట నెమళ్లు, గుర్రాలు, గాడిదలు, పిచ్చుకలు, కోతులు, మేకలు, కోళ్లు, పందులు ఇళ్ల దగ్గరే తిరిగేవి. తెల్లారితే కోయిల కూత వినిపించేది. చూరులో పిచ్చుకలు సందడి చేసేవి. అవన్నీ ఏమైపోయాయి? ఎందుకు కనిపించట్లేదు? వాటి సంఖ్య ఎందుకు తగ్గిపోయింది? కారణం జనాభా. ఇదే పరిస్థితి అడవుల్లోనూ ఉంది. ఒకప్పటిలా ఇప్పుడు పక్షులు, జంతువులూ లేవు. వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. ఆ మాటకొస్తే.. అడవులే పెద్దగా లేవు. దట్టమైన అడవులు రాన్రానూ వాటి బలాన్ని కోల్పోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల, శేషాచలం అడవులు.. నానాటికీ తగ్గిపోతున్నాయి. వాటి పరిధి తగ్గిపోతోంది. ఫలితమే ప్రాణుల హననం. ప్రపంచ దేశాల్లో 3 వేల ఏళ్లుగా ఉన్న ఎన్నో అడవులు ఇప్పుడు లేవు. పూర్తిగా మాయమయ్యాయి. అమెజాన్ అడవులు, అమెజాన్ నది ఉన్న దక్షిణ అమెరికాలోనూ ఇదే పరిస్థితి. 1970 నుంచి ఇప్పటివరకూ అక్కడ 94 శాతం జీవులు మాయమయ్యాయంటే నమ్మగలరా? అందుకే సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుగాంతం అంటే ఇదే అంటున్నారు. సామూహిక ప్రాణి హననం జరుగుతోందని హెచ్చరిస్తున్నారు. ఇదివరకు జరిగిన ఐదు యుగాంతాలకు కారణంగా అగ్నిపర్వత పేలుళ్లు, గ్రహశకలం దాడిని చెబుతున్న సైంటిస్టులు.. ఆరో యుగాంతానికి కారణం మాత్రం మనుషులే అని చెబుతున్నారు. ఇప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందనీ.. ఇక ఈ యుగాంతం ఆగుతుందనే ఆశలు కనిపించట్లేదని అంటున్నారు. 🌹🌹🌹🌹🌹
Comentários