*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 190 🌹* *✍️. సౌభాగ్య* *📚. ప్రసాద్ భరద్వాజ* *🍀. ప్రేమ గుండా, నమ్మకం గుండా హృదయం విచ్చుకుంటే హృదయం అనంతానికి లొంగిపోతుంది. అప్పుడు నీలో కొత్త అంతర్దృష్టి కలుగుతుంది. నువ్వెవరో తెలుస్తుంది. ఈ అనంత అస్తిత్వం ఎందుకు వునికిలో వుందో తెలిసి వస్తుంది. 🍀* *మనిషి వివేకాన్ని కాదు జ్ఞానాన్ని కోరుతాడు. జ్ఞానం సులభం. మనసు గుండా చేసే చిన్ని ప్రయత్నం చాలు. దాంతో జ్ఞాపకయంత్రానికి సమాచారాన్ని అందించవచ్చు. అది కంప్యూటర్. దాంట్లో అన్ని లైబ్రరీలనూ పెట్టవచ్చు. వివేకమన్నది సంపాదించేది కాదు. అది మనసు గుండా సమకూరదు. అది హృదయం గుండా సంభవించేది. ప్రేమ గుండా అది వీలవుతుంది. హేతువు గుండా రాదు.* *ప్రేమ గుండా, నమ్మకం గుండా హృదయం విచ్చుకుంటే హృదయం అనంతానికి లొంగిపోతుంది. సమస్తానికి శరణాగతి చెందుతుంది. అప్పుడు నీలో కొత్త అంతర్దృష్టి కలుగుతుంది. జీవితం గురించిన స్పష్టత, గొప్ప అవగాహన కలుగుతుంది. నువ్వెవరో తెలుస్తుంది. ఈ అనంత అస్తిత్వం ఎందుకు వునికిలో వుందో తెలిసి వస్తుంది. అన్ని రహస్యాలూ బహిర్గతమవుతాయి.* *సశేషం ...* 🌹 🌹 🌹 🌹 🌹 #ఓషోరోజువారీధ్యానములు #OshoDailyMeditations #ఓషోబోధనలు #OshoDiscourse #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj https://t.me/ChaitanyaVijnanam http://www.facebook.com/groups/oshoteachings/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/
top of page
bottom of page
Comments