top of page
Writer's picturePrasad Bharadwaj

అనంత చతుర్దశి విశిష్టత - గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారు? Significance of Ananta Chaturdashi - Why is


🌹. అనంత చతుర్దశి విశిష్టత - గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారు? 🌹


🙏. ప్రసాద్‌ భరధ్వాజ


భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఇది పది రోజుల పండుగ. వినాయకుడి పుట్టిన రోజు గణేష్ చతుర్థి. వినాయకుడి నిమజ్జనం రోజును అనంత చతుర్థి అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.


భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి రోజున అనంత చతుర్దశి జరుపుకుంటారు. ఆ రోజునే గణేశుడి నిమజ్జనం చేస్తారు. అయితే ఈ రోజున శ్రీ మహా విష్ణువును కూడా పూజించడం అనవాయితీ.


🌴. గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారు? 🌴


పురాణాల ప్రకారం, మహర్షి వేదవ్యాసుడు ఆదేశానుసారం గణపతి మహాభారతాన్ని సరళమైన భాషలో రాశాడు. అయితే దీనిని రాయడాన్ని గణేష్ చతుర్థి నుండి ప్రారంభించాడు. అలా 10 రోజుల ఆగకుండా రాస్తూనే ఉన్నాడు. అప్పుడు వ్యాసుడు గణేశుడి శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగినట్లు తెలుసుకున్నాడు. దీంతో అతడు గణపతిని నీటిలో స్నానం చేయమని చెప్పాడు. దీంతో అతడి శరీరం చల్లబడింది. అప్పటి నుండి దానికి ప్రతీకగా గణపతి విగ్రహాన్ని అనంత చతుర్ధశి నాడు నిమజ్జనం చేయడం జరుగుతోంది.


నిమజ్జనానికి శాస్త్ర ప్రకారం ఇంకొక కారణం కూడా ఉంది. విగ్రహ ప్రతిష్టతో పాటు యంత్ర ప్రతిష్ట జరగనందున తాత్కాలికంగా ప్రతిష్టించిన విగ్రహాల రూపురేఖల్లో మార్పులు వచ్చి దోషం ఏర్పడుతుంది. కాబట్టి నిమజ్జనం చేయాలని శాస్త్రం చెబుతోంది.


🍀. గణేష్ నిమజ్జన శుభ ముహూర్తం 🍀


భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి 08 సెప్టెంబర్ 2022న గురువారం రాత్రి 09:02 గంటలకు ప్రారంభమై... 09 సెప్టెంబర్ 2022, శుక్రవారం సాయంత్రం 06:07కి ముగుస్తుంది.


ఉదయం నిమజ్జన ముహూర్తం - 6.03 నుండి -10:44 వరకు


మధ్యాహ్నం నిమజ్జన ముహూర్తం - 12:18 నుండి 1:52 నిమిషాలు


సాయంత్రం నిమజ్జన ముహూర్తం - సాయంత్రం 5.00 - 6.31 వరకు


🌹 🌹 🌹 🌹 🌹



Comments


Post: Blog2 Post
bottom of page