🌹. అష్టలక్ష్మి ప్రార్థనలు - తాత్పర్యము 🌹
ప్రసాద్ భరద్వాజ
1. సంతాన లక్ష్మి, 2.ఆదిలక్ష్మి, 3.గజలక్ష్మి , 4.ధనలక్ష్మి, 5.ధాన్యలక్షి, 6.విజయలక్ష్మి, 7.ఐశ్వర్యలక్ష్మి, 8.వీరలక్ష్మి
🍀. సంతాన లక్ష్మీ ప్రార్థన 🍀
శ్లో : దరహసిత మనోజ్ఙాన్ కర్దమానంద ముఖ్యాన్
కరధృత విజ హస్తాన్ లాలయన్తీ స్వపుత్రావ్‌ః
వితరతు పరితుష్టా స్మాసు సంతాన లక్ష్మీః
మహిత సుగుణ భవ్యాం. సంతతిం సంతతేర్నః
భావం:- చిరునవ్వుతో ముచ్చట గలిగించు కర్దముడు, ఆనందుడు, చిక్తీతుడు అను తన కుమారులను ప్రేమతో ఎత్తుకొని లాలించుచూ ఆనందించు నట్టి సంతాన లక్ష్మి గుణ శ్రేష్ఠులైన మంచి సంతానమును మాకు ప్రసాదించుగాక.
🍀. ఆదిలక్ష్మీ స్తుతి 🍀
శ్లో : కరయుగ ధృత పద్మా పద్మ మాలాభిరామా
శ్రీతజన నిధిరేషా సర్వ లోకైక మాతా
కమల నయన వక్షఃపీఠ మాతస్ధుషీనః
ప్రదిశతు పురషార్థా నాది లక్ష్మీ రభీష్టాన్‌ః
భావం:- హస్తముల యందు పద్మములను, కంఠమున పద్మమాలను ధరించి ప్రకాశించునదియూ, ఆశ్రయించిన భక్తుల కోరికలను తీర్చుటలో విధి వంటిదియూ, సర్వ జగత్తుకూ ఏకైక మాతయూ, పుడరీకాక్షుని వక్ష స్థలము నిత్య నివాసముగా గలదియునగు ఆదిలక్ష్మీ ధర్మార్థ కామ మోక్షాది సకల పురుషార్థములను, సర్వాభీష్టములను దయతో మాకు అనుగ్రహించుగాక. 🍀. గజలక్ష్మీ ప్రార్థన 🍀 శ్లో : జలజ మధి వసన్తీ మత్త వేదండ శుండో ధృతి జల కణికాభి స్పిచ్చ మానా నితాన్తమ్‌ః నత జన దురవస్థా ధంసనీయమ గజాన్తాం ప్రదిశతు గజలక్ష్మీ స్పంపదం న స్పమృద్దామ్‌ః భావం:- పద్మమున కూర్చున్నదియూ, రెండు వైపులా మదపుటేనుగులు తొండములతో నీరు గ్రహించి చేయు అభిషేకమును స్వీకరించుచున్నదియ, ఆశ్రయించిన భక్తుల దురవస్థలను నశింపజేయునట్టిదియూ అయిన గజలక్ష్మీ గజములను (ఏనుగులను) పోషింప గల సమృద్ధమైన సంపదను ఇచ్చి కాపాడుగాక. 🍀. ధనలక్ష్మీ ప్రార్థన 🍀 శ్లో : ధనపతి ముఖదేవై స్తూయమానా దయార్ధ్రా దినకర విభవర్లా బిల్వ వృక్షాలయా శ్రీః ధృత నవవిధి హస్తా దేవతా మంగళానాం వితరతు ధనలక్ష్మీ విత్త రాశీన్ పదా నః భావము:- మహా ధనాధిపతియైన కుబేరుడు, మున్నగు దేవతలచే స్తుతింపబడుచున్న దయా స్వరూపిణీయూ, సూర్యుని కాంతితో సమనమైన శరీరచ్ఛాయ కలదియూ, మారేడు వృక్షము నివా సముగా గలదియూ ‘మంగళం మంగళానాం’ అనురీతిగా శుభ ములను సాధించునట్టి దేవతయు, అయిన ధనలక్ష్మీ మాకెల్లప్పుడూ సమృద్ధమైన సంపదల నిచ్చి కాపాడుగాక. 🍀. ధాన్యలక్ష్మీ ప్రార్థన 🍀 శ్లో : అభయ వరద ముద్రా సధృక్త శోకా కరకమల విరాజ ఛ్చాలి మంజర్యుదారాః ప్రతికల మిహ దత్తాం సర్వ సస్యోపయాతాం అతులిత బహుధాన్యాం సంపదం ధాన్యలక్ష్మీః భావం:- ఒక చేయి అభయమునూ, మరియొక చేయి వరములనూ ప్రసాదించునట్లు హస్త ముద్రలను ధరించి భక్తుల దుఃఖమును తొలగించునదియూ కరద్వయమున ధాన్యపు కంకులను ధరించినదియూ అగు ధాన్యలక్ష్మీ సకలములైన సస్యములను ఫలింపజేసి సకలవిధ ధాన్యసమృద్ధి, ధనసమృద్ధి కలుగునట్లు అనుగ్రహించుగాక. 🍀. విజయలక్ష్మీ ప్రార్థన 🍀 శ్లో : శుభమణిగల చారు స్వర్ణ సింహాసనస్ధా సురనర వనితాభి స్పాదరం సేవ్యమానాః సకల శుభ విధాత్రీ సర్వలోనేశ్వరీయం దిశతు విజయలక్ష్మీ ర్విష్ణుపత్నీ జయం నః భావం:- మణులచే పొదగబడిన, మిక్కిలి సుందరమైన స్వర్ణ సింహాసనము నధిష్టించి దేవతా స్ర్తీలచే అదర పూర్వకముగా సేవింప బడుచున్నదియూ, భక్తులకు సకల శుభము లను ప్రసాదించునదియు. శ్రీ మహా విష్ణువున కు పత్నియై సకల లోకములను శాసించున దయు అయిన విజయలక్ష్మీ అన్ని కార్యములం దును మనకు విజయమును కలుగ జేయుగాక. 🍀. ఐశ్వర్యలక్ష్మీ ప్రార్థన 🍀 శ్లో : రుచిర కనక భూషా భూషితా స్వర్ణవర్ణా శ్రీత నయన చకోరా నంద దాస్సేందు బింబాః కలశ జలధి కన్యా సేయమైశ్వర్య లక్ష్మీః నిరవధిక విభూతిర్న:ప్రదద్వాది హో ష్టౌః భావం:- మనోజ్ఙమైన (కన్నులకు ఆనందము కలిగించు) బంగారు ఆభరణము లెన్నిటినో ధరించి సువర్ణ ఛ్చాయతో నొప్పు శరీరము గలదియు చక్రవాక పక్షులకు చంద్రబింబము ఆనందము కల్గించునట్లు ఆశ్రీతులకు ఆనందము కలిగించు ముఖ సౌందర్యము గలదియు పాల సముద్రము నుండి అవతరించి నదియు అయిన ఐశ్వర్యలక్ష్మీ అణియు మున్నగు నిరవధికములైన అష్టైశ్వర్యములను మనకు ప్రసాదించి కాపాడుగాక. 🍀. వీరలక్ష్మీ ప్రార్థన 🍀 శ్లో : గజవర మధిరూఢా శంఖ చక్రాల సిశార్ధా ద్యమిత నిశిత శస్త్రాస్త్రోద్భటా శాత్రవేషు: సుమధుర దరహోసేనాశ్రీఆన్ హర్షయన్తీ రిపునివహ నిరాసం వీరలక్ష్మీ ర్విధత్తామ్: భావం:- మదపుటేనుగు నధిరోహించి శంఖము, చక్రము, ఖడ్గము, విల్లు మున్నగు ప్రభావ భాసురములైన ఆయుధములను ధరించి శతృవులపై ఆగ్రహమును చూపుచూ వారిని వణికించునదియూ అదే సమయమున భక్తులను చిరునవ్వులతో ఆనందించేయు నట్టిదయూ అయిన వీరలక్ష్మీ శతృవినాశమును గావించి భక్తులను కాపాడుగాక. 🌹 🌹 🌹 🌹 🌹
Comentários