top of page
Writer's picturePrasad Bharadwaj

కామ శరీరం ~ మానసిక శరీరం Lust Body ~ Mental Body


🌹. కామ శరీరం ~ మానసిక శరీరం 🌹


మనలో నిరంతరం ఎన్నో భావాలు ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి.. ఈ భావాలే భావ చిత్రాలు గా మారతాయి..( Thought Forms ).


ఈ భావాల్లో కోరిక ల ద్రవ్యం దానికి సంబంధించిన ఆలోచన ల ద్రవ్యం రెండు కూడా ఉంటాయి. ఈ భావ చిత్రం లో కామ మానసిక శరీరాల రెండింటి తత్త్వం ఉందని తెలుసుకోవాలి.


మనం సృష్టించిన ఒక భావ చిత్రం లో మన లోని కోరిక , దాని గురించిన ఆలోచన ప్రాధమికం గా ఉంటాయి.


మన లోని కోరిక ,దానికి సంబంధించిన ఆలోచన ఎంత గాఢంగా ఉంటే , ఆ భావ చిత్రం అంత దృఢంగా. తయారు అవుతుంది.


ప్రతిరోజు ఒకే కోరిక తో కూడిన ఆలోచన నిరంతరాయంగా ఒకే సమయానికి కనుక ఏర్పడితే, ఆ ఆలోచన శక్తిమంతమైన. భావచిత్రంగా మారుతుంది. ధ్యానం దీని పై కొనసాగితే అది ఇంకా శక్తిమంతం అవుతుంది.


దీనిని ఒకరికి ఆశీర్వచనం గా మనం పంపిస్తే, దానిని స్వీకరించే వారికి ఎంతో. ప్రయోజనం కలుగుతుంది. ఇలాంటి భావ చిత్రాల వల్ల దాని తత్త్వాన్ని బట్టి అనుకూల ప్రతికూల ప్రభావాలు రెండూ కూడా కలిగే అవకాశముంది..


అధ్యాత్మిక ప్రస్థానం లో వేగం గా ప్రయాణం చేద్దామనుకునే సాధకులు దీనిని చాలా చక్కగా ఉపయోగించుకో వచ్చును.


మనం ఒక సమయం లో కొన్ని వందల మంది మధ్య లో ఉన్నప్పుడు కొన్ని వందల మంది సృష్టించి వదిలి పెట్టే భావ చిత్రాల మధ్య లో మనం ఎంతో సమయం ఉండ వలసి వస్తుంది..


మనలను మనం శక్తీ మంతం గా దృఢ పరచుకోక పోతే మనవి కానీ ఈ భావ చిత్రాల ప్రభావానికి మనం లోను కాక తప్పదు..చాలామందికి దిష్టి ఇలాగే తగులుతుంది...


మనం ఒకసారి పొద్దుటి నుండి రాత్రి వరకు మన లో చెల రేగే భావోద్వేగాలను, మనం సృష్టించే భావ చిత్రాలను ఒకసారి పరిశీలించుకోవడం చాలా అవసరం.. నిజానికి ఇవే మన కర్మని సృష్టిస్తున్నాయి.


మనకు ఒక రోజు లో కొంత భాగం చిరాకుగా, మరి కొంతభాగం ఆహ్లాదంగా , చిలిపి గా, క్రూరంగా, దయగా, దుఃఖం తో ఇలా ఎన్నో భావాలతో నిండి ఉన్నట్లుగా అనిపిస్తుంది.


దీనికి కారణం మనం గతం లో ఇలా పరస్పర విరుద్ధ భావాలతో కూడిన భావ చిత్రాలను, దానికి సంబంధించిన కర్మని చేశామనే అర్ధం కదా.


ఈ విషయాల దృష్ట్యా మనం ఇంకో విషయం పై దృష్టి ఉంచాలి. ఈ భావ చిత్రాల వల్లనే మనం మన కామ మానసిక శరీరాల ను ప్రతి క్షణం మనమే తయారు చేసుకుంటున్నాము.


మన లో చెలరేగే కోరికలు మన కామ శరీరాన్ని, ఆలోచనలు మానసిక శరీరాన్నీ నిర్మిస్తున్నాయి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ఈ కారణం గా ఇంద్రియ నిగ్రహం ఎంతో అవసరం. మనం ఉత్తమ ఆలోచనలు, కోరికలు పఠనం ,ధ్యానం వల్ల చాలా ఉత్తమ కామ మానసిక శరీరాలు. తయారు

అవుతాయి.


జీవితానికి ఒక లక్ష్యం, దానికి తగిన ప్రణాళిక , దానికి అవసరమైన సాధన మనం రూపొందించుకుంటే దీనికి తగిన కర్మలే చేస్తాము. నిర్లక్ష్యం గా అనాలోచితం గా సోమరితనం తో తెలువి తక్కువ గా జీవించము..


ఇలా ఒక యోగాభ్యాసానికి అనుగుణమైన రీతి లో మన జీవితాన్ని తీర్చి దిద్దుకుంటే, ఈ జన్మ లోను, వచ్చే జన్మ లోను కూడా మన కర్మలు మనం కోరుకున్న ఫలితాలు ఇస్తాయి.


🌹🌹🌹🌹🌹

0 views0 comments

Comentários


Post: Blog2 Post
bottom of page