🌹. కపిల గీత - 125 / Kapila Gita - 125🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 09 🌴
09. సానుబంధే చ దేహేఽస్మిన్నకుర్వన్న సదాగ్రహమ్|
జ్ఞానేన దృష్టతత్త్వేన ప్రకృతేః పురుషస్య చ॥
ప్రాణుల యెడల మైత్రీభావమును కలిగి యుండ వలెను. దయాళువై యుండ వలెను. సుఖదుఃఖాది ద్వంద్వములకు వెరవక ధీరుడై యుండవలెను. ప్రకృతి పురుషులయొక్క వాస్తవస్వరూపమును తెలిసికొని, తత్త్వజ్ఞానియై, స్త్రీపుత్రాదుల యందును, దేహము పైనను నేను-నాది అను మిథ్యాభిమానమును త్యజింప వలెను.
ఈ శరీరము యందు ఆసక్తిని తగ్గించాలి. దుష్టమైన కోరికనూ, ఆసక్తినీ తగ్గించాలి. ఒక్క దేహానికి మాత్రమే కాదు. స బంధు. పుత్ర మిత్రాదులతో ఉన్న దేహం యొక్క ఆసక్తిని తగ్గించాలి. ఈ భోగాలలో ఏదీ ఆత్మకోసం లేదు. ఇన్ని అనుబంధాలతో ఉన్న శరీరమునకు సత్ స్నేహాలు పెంచుకోవాలి. ఆ స్నేహాలు వలన భక్తి పెరిగితే మంచిదే, కానీ అసత్ స్నేహాలని దూరముగా ఉంచాలి. ప్రకృతి తత్వమునూ పురుష తత్వమునూ చక్కగా తెలుసుకోవడమే జ్ఞానం. అసదాగ్రహం - లేని దాన్ని గురించి పట్టుదల. శరీరము నేనే అనుకోవడం కూడా అసదాగ్రహమే. నేనూ-నాదీ అనుకోవడం కూడా అసదాగ్రహం. ఇది పోగొట్టుకోవాలి. జ్ఞానం కేవలం ఆత్మకే ఉంటుంది. జ్ఞానానికి నెలవు ఆత్మ.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 125 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 09 🌴
09. sānubandhe ca dehe 'sminn akurvann asad-āgraham
jñānena dṛṣṭa-tattvena prakṛteḥ puruṣasya ca
One's seeing power should be increased through knowledge of spirit and matter, and one should not unnecessarily identify himself with the body and thus become attracted by bodily relationships.
The conditioned souls are eager to identify with the body and consider that the body is "myself" and that anything in relationship with the body or possessions of the body is "mine." In Sanskrit this is called aham-mamatā, and it is the root cause of all conditional life. A person should see things as the combination of matter and spirit. He should distinguish between the nature of matter and the nature of spirit, and his real identification should be with spirit, not with matter. By this knowledge, one should avoid the false, bodily concept of life.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios