top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 90 / Kapila Gita - 90


🌹. కపిల గీత - 90 / Kapila Gita - 90🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 46 🌴


46. భావనం బ్రహ్మణః స్థానం ధారణం సద్విశేషణమ్|

సర్వసత్త్వగుణోద్భేదః పృథివీవృత్తిలక్షణమ్॥


విగ్రహాది రూపములలో పరబ్రహ్మము యొక్క సాకార భావనకు ఆశ్రయము గలిగించుట, జలము మొదలగు కారణతత్త్వములకంటె వేరైన ఇతర వస్తువులను ఆశ్రయింపకయే స్థిరముగా ఉండుట, జలము మున్నగు ఇతర పదార్థములను ధారణ చేయుట, ఆకాశాదులచే నిండుట అనగా - ఘటాకాశము, మఠాకాశము - మొదలగు తీరులలో పరిచ్ఛిన్నము చేసినట్లు గోచరించుట అట్లే పరిణామ విశేషములచే సకల ప్రాణుల యొక్క స్త్రీత్వ-పురుషత్త్వాది గుణములను ప్రకటించుట అనునవి పృథివీతత్త్వము యొక్క కార్యరూప లక్షణములు.



భూమి చేసే పనులు


1. భావనం - ఆకారం ఏర్పడుట (కుండ మనం భూమితోనే చేస్తున్నాము. మట్టికి ఆయా ఆకారములుగా మారగల శక్తి ఉన్నది. వివిధ రూపములు పొందగలుగుట మట్టి యొక్క లక్షణం. బంగారము కూడా మట్టి యొక్క ఆకారమే. దానిలో తేజో గుణం ఎక్కువగా ఉంది, అంతే. మనకు కంటికి కనపడే ప్రతీ ఆకారం మట్టి). ఆకారం ఉంది అంటే మట్టి.


2. బ్రహ్మణః స్థానం - సకల చరా చర జగత్తు నిలవడానికి ఆధారం భూమి. స్వర్గములో కూడా భూమి ఉంది. స్వర్గములో కూడా ఇక్కడిలాగే వాయువూ, అగ్నీ, సూర్యుడు చంద్రుడు భూమి ఉంటాయి.


3. ధారణం - మనము ఏమి వేసిన ధరిస్తుంది.


4. సద్విశేషణం - పదార్ధాలలో సారమునీ రుచినీ మార్చేది భూమి. ఒక్కో ప్రాంతములో ఒక్కో పంట విశేషముగా పండుతుంది. అలాగే ఒక ప్రాంతములో పండినవి, ఇంకో ప్రాంతములో పండిన దాని కన్నా రుచిగా ఉంటుంది. అన్ని చోట్లా పండినా, కొన్ని చోట్ల పండిన ధ్యానం రుచి బాగా ఉంటుంది. ఎంత మంచి భూమి అయినా, విత్తనం బాగా లేకుంటే పండదు. ఎంత మంచి విత్తనమైనా చౌటు భూమిలో పండదు. మంచి విత్తనము కూడా మంచి భూమిలో పెరిగినదే. దేశ భేదాన్ని బట్టి సారవంతములూ నిస్సారవంతములూ అవుతాయి.


సర్వసత్త్వగుణోద్భేదః - మట్టి ప్రాణుల ఆకారాన్ని కూడా మారుస్తుంది. ఒక ప్రాంతములో ఉన్న వారికి కళ్ళు చిన్నగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో తెల్లగా, కొన్ని ప్రాంతాలలో నల్లగా ఉంటారు. అంటే స్వరూపానీ, రుచినీ, ఆకారాన్ని మార్చేది భూమి. స్వభావాన్ని మార్చేది కూడా భూమే. దేవాలయానికి వెళితే ప్రశాంతముగా ఉంటుంది. వ్యగ్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసు వ్యగ్రముగా ఉంటుంది. హిమాలయాలలో ఉన్న జంతువులకి జుట్టు ఎక్కువ ఉంటుంది.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 90 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 46 🌴


46. bhāvanaṁ brahmaṇaḥ sthānaṁ dhāraṇaṁ sad-viśeṣaṇam

sarva-sattva-guṇodbhedaḥ pṛthivī-vṛtti-lakṣaṇam


The characteristics of the functions of earth can be perceived by modeling forms of the Supreme Brahman, by constructing places of residence, by preparing pots to contain water, etc. In other words, the earth is the place of sustenance for all elements.


Different elements, such as sound, sky, air, fire and water, can be perceived in the earth. Another feature of the earth especially mentioned here is that earth can manifest different forms of the Supreme Personality of Godhead. By this statement of Kapila's it is confirmed that the Supreme Personality of Godhead, Brahman, has innumerable forms, which are described in the scriptures. By manipulation of earth and its products, such as stone, wood and jewels, these forms of the Supreme Lord can be present before our eyes. When a form of Lord Kṛṣṇa or Lord Viṣṇu is manifested by presentation of a statue made of earth, it is not imaginary. The earth gives shape to the Lord's forms as described in the scriptures.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page