నేటి విశేషం
🌹. కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం - ఉ10.57నుండి 🌹
శాస్త్ర ప్రకారం జనవరి 15 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణం ,
జూలై 17 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు...
దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం , సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి.
సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు...
భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.
ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం...
కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది...
సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది.
ఆ సమయంలో స్నాన , దాన , జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి...
ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ , దక్షిణాయనాలు, 'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం.
దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది.
సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు, కానీ సూర్యోదయాన్ని గమనిస్తే , అది తూర్పు దిక్కున జరగదు.
సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే, అవి మార్చి 21 , సెప్టెంబరు 23. మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది...
సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు...
ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు...
ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం.
ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు...
ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం, అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు.
అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది, శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు.
ఈ సమయంలో యోగులు , మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.
శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది, ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు.
వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప , దాన , పూజలు ఆరోగ్యాన్ని , అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి...
ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు.
ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహలయ పక్షాలు వస్తాయి...
పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది.
శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు.
బతికుండగా తల్లిదండ్రుల సేవ , మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి , ఎంతో ముఖ్యం , శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం.
అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.
చేయవలసినవి
ధ్యానం , మంత్ర జపాలు , సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు , పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు , సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం , అవసరంలో ఉన్న వారికి దానం చేయడం , అన్నదానం , తిల (నువ్వుల ) దానం , వస్త్ర దానం , విష్ణు పూజ , విష్ణు సహస్రనామ పారాయణ , సూర్యరాధన , ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి , మనసుకు మేలు చేస్తాయని , పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు, దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి ?
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు.... అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది.
అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది.
శనిగ్రహం 2 1/2 సం పడుతుంది.
రాహు , కేతువులకి 1 1/2 సం , రవికి నెల రోజులు... ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీన రాశులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది.
సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని
సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని
సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని
సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని
ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి ‘జరగటం’ , ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు.
సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది. సాధారణంగా జూలై 16వ తేదీనే ! ఈ కర్కాటక సంక్రమణాన్ని ‘దక్షిణాయన’ మని అంటుంటారు. (మనకి సంవత్సరానికి అయనములు రెండు. ఒకటి ఉత్తరాయనం , రెండవది దక్షిణాయనం) ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం , తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలాన్ని సంక్రమణంగా చెప్తాం, (మకర సంక్రమణం (సం క్రాంతి)... మకరరాశి ప్రవేశం ! కుంభరాశి ప్రవేశం (మహా శివరాత్రి) అయితే సూర్యుని మకర సంక్రమణ మే ‘ఉత్తరాయన పుణ్యకాలం’. ఏ తిథులతోను సంబంధం లేకుండాను , ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ - దక్షిణాయన మనేవి. జనవరి 14 న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ , జూలై 16 న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది. సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా , దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు , దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం , విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు. దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి , వినాయక చవితి , రాఖీపూర్ణిమ , ఆదిపరాశక్తి మహిమలనుచాటే దసరా , నరక బాధలు తొలగించిన దీపావళి , శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక , మార్గశిర మాసాలు , గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి. దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ , గృహ ప్రవేశం. , ఉపనయనం , వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు , భైరవ , వరాహ , నృసింహ , మహిషాసుర మర్దని , దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు , జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని , లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు , పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు. సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే మోక్షానికి ఉత్తరాయణం , ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు. ఈరోజు పుణ్యనదీ స్నాన , దాన , జప , హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది... 🌻శుభమస్తు🌻 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 🌹🌹🌹🌹🌹 17 Jul 2022
Yorumlar