దేహభ్రాంతి ఎలా పోతుంది ? How does the delusion go away?
- Prasad Bharadwaj
- Nov 11, 2022
- 1 min read

"దేహభ్రాంతి ఎలా పోతుంది ?"
ఇష్టాయిష్టాలు మనసుకు సంబంధించినవేనని, శరీర సంబంధమైనవి కావని గుర్తించాలి. నదిలోకి దిగినప్పుడు నీటి చల్లదనం వల్ల మనసుకే అనుభూతి కలుగుతుంది. కాళ్ళకి ఉండదు. ఈ విషయాన్ని విచారణతో గ్రహిస్తే మనం ఈ శరీరం కాదని తెలుస్తుంది. శరీరాన్ని నడిపే మనసు, దాని మూలంలోని చైతన్యం మన అసలు స్వరూపమని తెలుస్తుంది. మనలోనే ఉనికిగా ఉన్న దైవాన్ని తెలుసుకోవటానికి అనేక పాట్లు పడుతున్నాం. అందుకు కారణం.. మన ఉనికిని మనం మరిచిపోవటమే. నాలుక ఉన్నదని తెలియాలంటే రుచులే చూడాలా ? రుచి తెలుసుకోవటానికి నాలుక కావాలి కానీ నాలుక ఉన్నదని తెలుసుకోవటానికి ఏ రుచితో పనిలేదు. మనసు కూడా అంతే. ఆలోచనలు మనసును ఆవరించి ఉన్నాయేగాని, ఆలోచనలే మనసు యొక్క స్వరూపం కాదు. దానికంటూ ఓ స్వరూపం ఉంది. మన ఉనికే దాని స్వరూపం. ముందు మన ఉనికి మనకు తెలిస్తే మనమేమిటో, దైవం ఏమిటో తెలుస్తుంది..!"
ఒకపక్క దైవం, మరోపక్క దేహంతో నేను.. ఈ రెండు భావనలతోనే జీవితం సాగిపోతోంది కదా ?
Comments