top of page
Writer's picturePrasad Bharadwaj

దశావతార దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి. Happy Dasavatara Dashami


🌹. దశావతార దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి. 🌹


🙏. ప్రసాద్‌ భరధ్వాజ


☘️. భాద్రపద శుద్ధ దశమి దశావతార దశమి ☘️


లోకంలో సాధు సజ్జనుల జీవితానికి దుష్టుల వలన అంతరాయం కలుగుతున్నప్పుడు బలవంతుల హింసకి నిస్సహాయులు తాళలేక పోతున్నప్పుడు భక్తుల ప్రశాంతతకి భంగం వాటిల్లినప్పుడు ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి శ్రీమహా విష్ణువు రంగంలోకి దిగుతూ వచ్చాడు. సందర్భాన్ని బట్టి లోక కల్యాణం కోసం ఒక్కో అవతారాన్ని ధరిస్తూ వచ్చాడు. వాటిలో దశావతారాలు అతి ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి.


మత్స్యావతారం , కూర్మావతారం , వరాహావతారం , నరసింహావతారం , వామనావతారం , పరశురామావతారం , రామావతారం , కృష్ణావతారం , బుద్ధావతారం , కల్క్యవతారం , దశావతారాలుగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఆయా అవతారాలను ధరించిన రోజున ఆ రూపంలో స్వామిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది.


'భాద్రపద శుద్ధ దశమి' దశావతారాలను పూజించవలసిన రోజుగా చెప్పబడుతూ వుండటం విశేషం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల ప్రతిమలను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని , వ్రత విధానం ద్వారా పూజించవలసి ఉంటుంది. ఈ రోజున ఉపవాస నియమం పాటించ వలసి ఉంటుంది. దశావతార వ్రత విధానంతో దశావతారాలలోనున్న స్వామిని ఈ రోజున పూజించడం వలన , సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


🌹. దశావతారస్తుతి 🌹


నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||


వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే


మీనాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౧


మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో


కూర్మాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౨


భూచోరకహర పుణ్యమతే క్రీఢోద్ధృతభూదేశహరే


క్రోఢాకార శరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౩


హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో


నరసింహాచ్యుతరూప నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౪


బలిమదభంజన వితతమతే పాదోద్వయకృతలోకకృతే


వటుపటువేష మనోజ్ఞ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౫


క్షితిపతివంశసంభవమూర్తే క్షితిపతిరక్షాక్షతమూర్తే


భృగుపతిరామవరేణ్య నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౬


సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో


రావణమర్దన రామ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౭


కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే


కాళియమర్దన కృష్ణ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౮


త్రిపురసతీ మానవిహరణా త్రిపురవిజయమార్గనరూపా


శుద్ధజ్ఞానవిబుద్ధ నమో భక్తాం తే పరిపాలయ మామ్ ౯


శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే


కల్కిరూపపరిపాల నమో భక్తాం తే పరిపాలయ మామ్ ౧౦


నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే


రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ౧౧


🌹 🌹 🌹 🌹 🌹🌹

Comments


Post: Blog2 Post
bottom of page