top of page
Writer's picturePrasad Bharadwaj

నిత్య ప్రజ్ఞా సందేశములు - 04 - 04. అపరిచతంలోకి . . . / DAILY WISDOM - 04 - 04. The Heroic Leap . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 04 / DAILY WISDOM - 04 🌹


🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 04. అపరిచతంలోకి వ్యక్తి వీరోచిత దూకుడు 🌻


అపరిచితం లోకి వీరోచితంగా దూకడం అనేది ఉన్నతమైన ఆనందము అందుకోవడానికి గల సంసిద్ధతను తెలియజేస్తుంది. జీవితంలో పరిమితికి సంబంధించిన అసంతృప్తి వల్ల ఆత్మ తన వ్యక్తిత్వ పరిధి అందుకోలేని పరిపూర్ణతను పట్టుకోవడానికి పూనుకుంటుంది. అందువల్ల, విశ్వచలనము మరియు వ్యక్తిగత ప్రయత్నం, ప్రకృతి పట్ల వారి వైఖరి భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తున్నా, జీవుడు తన పరిపూర్ణత అందుకునే ప్రక్రియలోని భిన్న పార్శ్వాలు.


సర్వత్రా సత్యమే అయి ఉన్న చైతన్యం యొక్క ఒత్తిడి వ్యక్తులను వారి పరిమితులను అధిగమించడానికి, ఆ అపరిమితంలో వారి శాశ్వతమైన విశ్రాంతిని కనుగొనడానికి ప్రేరేపించే శక్తికి మూలం. ఈ శాశ్వత సత్యం అనేది సృష్టిలో విశ్వప్రయత్నం ద్వారా అన్వేషించబడే అత్యున్నత వస్తువు, ఇందులో మాత్రమే శక్తుల బాహ్యీకరణకు సంబంధించిన అన్ని ప్రేరణలు అంతం చేయబడతాయి. సర్వం తానకే కావాలనే కోరిక అనంతం యొక్క అనుభవంలో ముగుస్తుంది.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 04 🌹


🍀 📖 From The Realisation of the Absolute 🍀


📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj

🌻 04. The Heroic Leap of the Individual Into the Unknown 🌻 The heroic leap of the individual into the unknown is the expression of the want of a superior joy. The dissatisfaction with limitedness in life directs the soul to catch the fullness of perfection in the truth of its Integrality, with which the individualised condition is not endowed. Hence, universal movement and individual effort, though differing in their altruism of nature, can be understood as a reflection of the tendency to Self-Perfection of Being. The pressure of the truth of the absoluteness of consciousness is the source of the force that compels individuals to transcend their finitude and find their eternal repose in it alone. This permanent Verity is the supreme object of quest through the cosmical endeavour in creation, wherein alone all further impulses for externalisation of forces are put an end to. The desire to become the All terminates in the experience of Infinitude. Continues... 🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page