🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 192 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మానవజాతికి జ్ఞానం పోగవుతూ వుంది. నువ్వు బుద్ధుడుని కలిస్తే ఆయనకు ఎన్నో విషయాలు వివరించగలవు. వేల సంగతులు ఆయనకు తెలియనివి వున్నాయి. ఆయన తెలియని వాడని కాదు. ఆయనకు తెలుసు. విభిన్నమార్గంలో ఆయనకు తెలుసు. 🍀
మానవజాతికి గతంలో కన్నా యిప్పుడు చాలా విషయాలు తెలుసు. జ్ఞానం పోగవుతూ వుంది. యిప్పటి మనిషికి బుద్ధుడు కన్నా ఎక్కువగా తెలుసు. నువ్వు బుద్ధుడుని కలిస్తే ఆయనకు ఎన్నో విషయాలు వివరించగలవు. వేల సంగతులు ఆయనకు తెలియనివి వున్నాయి. ఆయన మెట్రిక్ కూడా పాసయ్యే వాడు కాడనుకుంటాను. అంత మాత్రాన ఆయన తెలియని వాడని కాదు. ఆయనకు తెలుసు. విభిన్నమార్గంలో ఆయనకు తెలుసు.
ఆయన అనుభవం ఆయన అస్తిత్వాన్ని రూపాంతరం చెందించిది. ఆయన దగ్గర నీ దగ్గరున్నంత సమాచారం లేకపోవచ్చు. కానీ ఆయన రూపాంతరం చెందిన వ్యక్తి. పరిణితి చెందిన మనిషి అసలు విషయం అది. సమాచార సేకరణ పనికి మాలినది. నీ దగ్గర కన్నా కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమాచారం వుంటుంది. కానీ కంప్యూటర్ బుద్ధుడు కాలేదు. కంప్యూటర్ జ్ఞానోదయం పొందగలదని అంటావా? అసాధ్యం.
సశేషం …
🌹 🌹 🌹 🌹 🌹
Comments