top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 195



🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 195 🌹


✍️. సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ


🍀. ఎవరి హృదయాలు అద్భుతంతో నాట్యం చేస్తాయో ఎవరి అస్తిత్వం సంభ్రమంతో సంచలిస్తుందో దేవుడు వాళ్ళకు సన్నిహితంగా వుంటాడు. అస్తిత్వం అలుపు లేనిది. అద్భుతం నిరంతరం కొనసాగుతుంది. రహస్యం కొనసాగుతుంది. 🍀


జీవితాన్ని చూడ్డం మాత్రమే కాదు. జీవించాలి. అప్పుడు తెలుసు కోవడమన్నది సాగుతూ వుంటుంది. అది కొనసాగే ప్రక్రియ. అది అంతం లేని మహాప్రస్థానం. అక్కడున్న సౌందర్యమేమిటంటే అక్కడ అద్భుతం నిరంతరం కొనసాగుతుంది. రహస్యం కొనసాగుతుంది. మనం నిరంతం అక్కడ యింకా చాలా తెలుసుకోవాలని తెలుసుకుంటూ వుంటాం.


అస్తిత్వం అలుపు లేనిది. మనిషి ఎప్పటికీ పసివాడుగా మిగిలిపోతాడు. అద్భుతాల మధ్య, ఆశ్చర్యాల మధ్య వున్న పసివాడవుతాడు. దేవుడు రహస్యం. ఐతే ఎవరి హృదయాలు అద్భుతంతో నాట్యం చేస్తాయో ఎవరి అస్తిత్వం సంభ్రమంతో సంచలిస్తుందో దేవుడు వాళ్ళకు సన్నిహితంగా వుంటాడు.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹



Kommentare


Post: Blog2 Post
bottom of page