🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 197 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. చైతన్యం లేకుంటే నువ్వు రోజు మరణిస్తావు. ఈ క్షణం నించీ చైతన్యాన్ని జీవస్మరణ సమస్యగా భావించు. అప్పుడు జీవితం మరింత మరింత ఎదుగుతుంది. నీ నించీ జీవితం, ప్రేమ, కాంతి పొంగి పొర్లుతుంది. అదే జీవనముక్తుని స్థితి. 🍀
ఈ క్షణం నించీ చైతన్యాన్ని జీవస్మరణ సమస్యగా భావించు. అవును. నిజంగా అది జీవన్మరణ సమస్యే. చైతన్యం లేకుంటే నువ్వు రోజు మరణిస్తావు. చైతన్యంతో నువ్వు మొదటిసారి జీవించడం ఆరంభిస్తావు. అప్పుడు జీవితం మరింత మరింత ఎదుగుతుంది. విస్తృతమవుతుంది.
ఒకరోజు అదెంత అనివార్యమవుతుందో నువ్వు సజీవత్వంతో తొణికిన లాడ్డమే కాదు, నిన్ను సమీపించినవాళ్ళు కూడా సజీవత్వంతో స్పందిస్తారు. నువ్కొక ఇంద్రజాలాన్ని యితరుల్లోకి ప్రసరిస్తావు. నీ నించీ జీవితం, ప్రేమ, కాంతి పొంగి పొర్లుతుంది. అదే బుద్ధుని స్థితి. జీవనముక్తుని స్థితి. ఒక వివేకవంతుడయిన పురుషుడి, వివేకవంతురాలయిన స్త్రీ స్థితి!
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments