🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 198 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. సత్యం గురించి తెలుసు కోవడమంటే సత్యం గురించిన సమాచార సేకరణ కాదు. ఎట్లాంటి సమాచారము సహాయపడదు. వ్యక్తి ఆ అనుభవంలోకి అడుగుపెట్టాలి. లేకపోతే అవి నీకు అడ్డంకిగా తయారవుతాయి. 🍀
మనసుకు సత్యం గురించి తెలీదు. అది సత్యానికి సంబంధించిన రకరకాలయిన సమాచారాన్ని సేకరిస్తుంది. సత్యం గురించి తెలుసు కోవడమంటే సత్యం గురించిన సమాచార సేకరణ కాదు. ప్రేమ గురించి వినడం ప్రేమను తెలుసుకోవడం కాదు. ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ప్రేమికుడు కావాలి. ఎట్లాంటి సమాచారము సహాయపడదు.
వ్యక్తి ఆ అనుభవంలోకి అడుగుపెట్టాలి. సత్యానికి సంబంధించిన సంగతి కూడా అలాంటిదే. నువ్వు ప్రపంచంలోని గొప్ప ఫిలాసఫర్ల గురించి గొప్ప మాటలను గురించి, సిద్ధాంతాలను గురించి, సూత్రీకరణల గురించి తెలుసుకోవచ్చు. నిర్ణయాలకు రావచ్చు. అవన్నీ అంచులోనివే. వాటి పునాదులు నీ అనుభవంలో వుండవు. కాబట్టి నువ్వు తెలుసుకున్నవి నీకు అడ్డంకిగా తయారవుతాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments