నిర్మల ధ్యానాలు - ఓషో - 201
- Prasad Bharadwaj
- Jun 27, 2022
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 201 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నాకు కచ్చితంగా తెలుసునన్న వాడు మూర్ఖుడు. బుద్ధిహీనులు, మొండి మనుషులు. మేథకు కావలసినన్ని తీర్మానాలు. హృదయమెప్పుడూ అమాయకమైంది. తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. హృదయమెప్పుడూ పసిపాపే.🍀
వివేకవంతుడికి తనకు తెలిసింది ఎంతో అల్పమని తెలుసు. బుద్ధిహీనుడికి మాత్రమే తనకు చాలా తెలుసన్న భావన వుంటుంది. నాకు కచ్చితంగా తెలుసునన్నవాడు మూర్ఖుడు. బుద్ధిహీనులు మొండిమనుషులు. తమ జ్ఞానోదయాన్ని పొందామని భీష్మిస్తారు. వాళ్ళ తీర్మానాల్ని అందరిపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు జనం పట్ల ప్రేమగా వుంటారు. సోక్రటీస్ నాకు ఒక్క సంగతి మాత్రమే తెలుసు. అది ఏమిటంటే నాకు ఏమీ తెలీదు.
పాశ్చాత్య ప్రపంచంలో ఆ నాటి నించీ ఉన్నతోన్నతమైన వ్యక్తి ఆయనే. ఆయన ఆనాటి నించే బుద్ధులలో ఒకడయ్యాడు. ఆనాటి నించీ ఆయన ఫిలాసఫర్ కాడు. ఆనాటి నించీ ఆయన జ్ఞానోదయం పొందిన వ్యక్తి. మేథకు కావలసినన్ని తీర్మానాలు. హృదయమెప్పుడూ అమాయకమైంది. తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. హృదయమెప్పుడూ పసిపాపే. మెదడు ఎప్పుడూ ముసలిదే. తల ఎప్పుడూ యవ్వనాన్ని పొందదు. హృదయమెప్పుడూ ముసల్ది కాదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments