🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 202 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జ్ఞానానికి మొదటి అడుగు 'నాకేమీ తెలియదు' అని అంగీకరించడం. అట్లా ఆమోదిస్తే మార్పు జరుగుతుంది. అంతర్దృష్టి ఏర్పడుతుంది. జ్ఞానం నీ లోపలి నించీ రావాలి. అధ్యయనం ద్వారా రాదు. ధ్యానం గుండా వస్తుంది. బయటి నించీ నేర్చుకున్నవన్నీ వదిలిపెట్టు. అప్పుడు లోపల వున్నది నీతో మాట్లాడుతుంది. 🍀
ఇతరుల్ని సంపాందించిన జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. అది నీ అజ్ఞానాన్ని దాచిపెడుతుంది. కానీ నిన్ను వివేకవంతుణ్ణి చెయ్యలేదు. అది నీ గాయాల్ని దాచిపెడుతుంది. కానీ గాయాన్ని మాన్పలేదు. వ్యక్తి తన గాయాన్ని మరచి పోతాడు. అది ప్రమాదకరం. గాయం పెరుగుతూనే వుంటుంది. కాన్సర్గా మారే ప్రమాదముంది. గాయాల్ని గ్రహించడం మంచిది. గాయాలకు కాంతి తగలాలి. దాచిపెట్టడం వినాశకరం. బహిరంగపరిస్తే గాయాలు మానతాయి. జ్ఞానానికి మొదటి అడుగు 'నాకేమీ తెలియదు' అని అంగీకరించడం. అట్లా ఆమోదిస్తే మార్పు జరుగుతుంది. అంతర్దృష్టి ఏర్పడుతుంది.
జ్ఞానం నీ లోపలి నించీ రావాలి. అది ఆలోచనల నించీ రాదు. నీలోని ఆలోచనారహిత స్థలం నించే అది ఆవిర్భవిస్తుంది. అధ్యయనం ద్వారా రాదు. ధ్యానం గుండా వస్తుంది. మనసు మలినపడనపుడు, మనసు మాయమైనపుడు వస్తుంది. అన్ని అడ్డంకులూ తొలిగినపుడు నీలో నించీ అది పొంగి పోర్లుతుంది. అక్కడ వసంతం ప్రవహిస్తుంది. కానీ దారిలో ఎన్నో రాళ్ళుంటాయి. అది జ్ఞానమని భ్రమించే అవకాశముంది. అవి జ్ఞానం కాదు, జ్ఞానానికి శత్రువులు, బయటి నించీ నేర్చుకున్నవన్నీ వదిలిపెట్టు. అప్పుడు లోపల వున్నది నీతో మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు నిజమైన జ్ఞానానికి సంబంధించిన పరిమళమవుతావు. తెలుసుకోవడమన్నది స్వేచ్ఛనిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments