🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 204 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జ్ఞానం అస్తిత్వాన్ని రూపాంతం చెందించలేదు. అస్తిత్వాన్ని రూపాంతరం చెందించాలనుకున్న వ్యక్తి దాన్ని దాటి వెళ్ళాలి. లక్ష లైబ్రరీల్ని మెదడులో నిక్షిప్తం చేసుకోగలిగిన వ్యక్తి కూడా బుద్ధుడు కాలేడు. 🍀
సైంటిస్టులు ఒక జ్ఞాపక కేంద్రం. ఒకే ఒక్క మానవుని మెదడు ప్రపంచంలోని లైబ్రరీల నన్నిట్నీ నిక్షిప్తం చేసుకోగలిగినంత శక్తివంతమైందని అంటారు. లక్ష లైబ్రరీల్ని మెదడులో నిక్షిప్తం చేసుకోగలిగిన వ్యక్తి కూడా బుద్ధుడు కాలేడు. అతను అప్పటికీ బుద్ధిహీనుడుగానే వుండవచ్చు. గాడిద బరువు మోస్తూ వుండవచ్చు.
కానీ ఆ జ్ఞానం అస్తిత్వాన్ని రూపాంతం చెందించలేదు. తన అస్తిత్వాన్ని రూపాంతరం చెందించాలనుకున్న వ్యక్తి పదాన్ని దాటి వెళ్ళాలి. మాటల్ని దాటి వెళ్ళాలి. సిద్ధాంతాల్ని, సూత్రాల్ని, అభిప్రాయాల్ని, పవిత్ర గ్రంథాల్ని దాటి వెళ్ళాలి. సమాచార సేకరణని పక్కన పెట్టు. దానికి పులుస్టాఫ్ పెట్టు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments