🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 206 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నువ్వు మళ్ళీ జన్మించాలి. పునర్జన్మ పొందాలి. అహమన్నది నీపై బలవంతంగా రుద్దబడిందన్న సంగతి గుర్తించాలి. నువ్వు వేరు కాదని అనంతంలో భాగమని తెలుసుకోవాలి.🍀
మనల్ని పెంచిన సమాజం, నాగరికత, మతం యివన్నీ మనకొక తప్పుడు గుర్తింపు నిచ్చాయి. మనల్ని మోసగించాయి, వంచించాయి. మనల్ని మోసగించిన వాళ్లు చాలా బలమైన వాళ్ళు. అసలు వాళ్ళ అధికారమే మోసాన్ని ఆధారం చేసుకున్నది. శతాబ్ధాలుగా జరుగుతున్నదదే. వాళ్ళు రాజకీయాన్ని, మతాన్ని హస్తగతం చేసుకున్నారు. సత్యాన్ని గ్రహించే అన్ని మార్గాల్ని బంధించాయి. వాళ్ళ వ్యాపారమే జనాల్ని మోసగించడం. పసితనం నించే జనాల్ని మలుస్తారు. రాజీపడకుంటే జీవితం లేదని చెబుతారు. కాబట్టి జనం రాజీ పడటానికి అలవాటయ పోతారు.
సత్యానికి సంబంధించిన స్పృహ తలెత్తినప్పుడల్లా దాన్ని అదుపు చేస్తారు. ఆ విధంగా సత్యాన్ని అణిచి పెట్టడం అలవాటయి పెద్ద అయ్యే సరికి చైతన్యరహితంగా మారుతారు. ఆ స్థితి నించీ బయటకు తీసుకురావటం అసాధ్యమయి పోతుంది. సమాజం నీకు ఏమి చేస్తుందో అది చేయరానిది. నువ్వు మళ్ళీ జన్మించాలి. పునర్జన్మ పొందాలి. అ,ఆ ల నించీ ఆరంభించాలి. అహమన్నది నీపై బలవంతంగా రుద్దబడిందన్న సంగతి గుర్తించాలి. నువ్వు వేరు కాదని అనంతంలో భాగమని తెలుసుకోవాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments