నిర్మల ధ్యానాలు - ఓషో - 209
- Prasad Bharadwaj
- Jul 13, 2022
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 209 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. సత్యం ఎన్నో వరాల్ని తీసుకొస్తుంది. వ్యక్తి ధ్యానమనే తలుపు తెరవాలి. సత్యాన్ని ఎవరో అందించాల్సిన పని లేదు. దాన్ని దేవుడే ఇచ్చాడు. నీ యథార్థ స్థితిలోనే అది వుంది. 🍀
అస్తిత్వ ఆనందమే సత్యం. చీకట్లోనే వుండాలని ఎవడు కోరుకుంటాడు? అస్తిత్వ సంబంధమయిన నిరాడంబరత నిజం. సంక్లిష్టతలోకి, సమస్యలోకి అడుగుపెట్టాలని కోరతాడు? ఎవరైనా అబద్ధాన్ని సమర్థిస్తే అది వేల రెట్లు పెరుగుతుంది. అబద్ధాన్ని అబద్ధాలు మాత్రమే పెద్ద చేస్తాయి. దాన్ని సత్యం సమర్థించదు. ఒక అబద్ధం యింకో అబద్ధాన్ని సృష్టిస్తుంది. చిన్ని అబద్ధంతో జీవితం బలహీనపడుతుంది.
సత్యం ఎన్నో వరాల్ని తీసుకొస్తుంది. వ్యక్తి ధ్యానమనే తలుపు తెరవాలి. సత్యాన్ని ఎవడో అందించాల్సిన పని లేదు. దాన్ని దేవుడే ఇచ్చాడు. నీ యథార్థ స్థితిలోనే అది వుంది. నువ్వు కొన్ని అడుగులు వేయాలి. అంతే. సన్యాసి అంటే 'సత్యాన్ని తెలుసుకునే నిర్ణయానికి రావడం' ఈ క్షణం నించీ సత్యాన్ని తెలుసుకోవడానికి నా 'జీవితాన్ని అంకితం చేస్తాను' అనడం. సత్యమెక్కడో దూరంగా లేదు. ఒకడుగు ముందుకు వేయాలి. అడుగు కాదు. పెద్ద అంగ. మనసు నించీ మనసు లేనితనానికి వేసే అడుగు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments