top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 210


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 210 🌹


✍️. సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ


🍀. జీవితం కన్నా సత్యం పట్ల ప్రేమ గొప్పది. వ్యక్తి సత్యం కోసం ఆత్మ సమర్పణ చేయాలి. విశ్వసించే జనం బాధలు పడతారు. కారణం సమాజం అసత్యానికి కట్టుబడి వుంది. అది సత్యాన్ని భరించలేదు. 🍀


చరిత్ర కన్నా కథలు, సామెతలు అర్థవంతమైనవి. చరిత్ర సంఘటనల్ని రికార్డు చేస్తే పిట్టకథలు సత్యాన్ని రికార్డు చేస్తాయి. డేనియల్ తన నమ్మకాన్ని వదిలిపెట్టడానికి ఒప్పుకోక సింహం గుహలోకి అడుగుపెట్టాడు. అతనికి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం వల్ల ఒకటి తెలుస్తుంది. జీవితం కన్నా సత్యం పట్ల ప్రేమ గొప్పది. వ్యక్తి సత్యం కోసం ఆత్మ సమర్పణ చేయాలి. యింకా ఈ విషయం మనిషి ఎంత ఎదిగినా అతనిలో ప్రాథమిక సహజాతం అలాగే వుండి పోయిందని తెలుపుతుంది.


విశ్వసించే జనం బాధలు పడతారు. కారణం సమాజం అసత్యానికి కట్టుబడి వుంది. సత్యాన్ని భరించలేదు. రెండోది ఈ కథ సత్యానికి కట్టుబడిన మనిషి సింహానికయినా భయపడకూడదు. అతన్ని ఏదీ గాయపరచలేదు. అతనిలోని సత్యసంధతని ఏదీ విధ్వంసించలేదు. మరణం కూడా దాన్ని తీసుకుపోలేదు. అబద్ధాల జీవితం పనికిమాలింది. సత్యం కోసం మరణించడం జీవితంలో గొప్ప అదృష్టం.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


Post: Blog2 Post
bottom of page