top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 211


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 211 🌹


✍️. సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ


🍀. సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి అన్ని రకాల నమ్మకాలూ ఆటంకాలే. నువ్వు ఎప్పుడూ నమ్మడం ఆరంభిస్తావో నీలో పరిశీలన ఆగిపోతుంది. ఒకసారి నమ్మకం మొదలయితే నీకు అన్నీ తెలుసు అనుకుంటావు. సందేహాలు సజీవంగా వున్నపుడే అన్వేషిస్తావు. 🍀


నిజమైన మతం నమ్మకాల మీద ఆధారపడి వుండదు. నిజం కాని మతమే నమ్మకాల మీద ఆధారపడి వుంటుంది. నిజమైన మతం పునాదులు అనుభవం మీద ఆధారపడి వుంటాయి. సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి అన్ని రకాల నమ్మకాలూ ఆటంకాలే. నువ్వు ఎప్పుడూ నమ్మడం ఆరంభిస్తావో నీలో పరిశీలన ఆగిపోతుంది. ఒకసారి నమ్మకం మొదలయితే నీకు అన్నీ తెలుసనుకుంటావు.


నమ్మకమంటే అర్థమేమిటంటే నీ సందేహాల్ని అణిచిపెట్టావని, నీ సందేహాలు సజీవంగా, తాజాగా, యవ్వనంతో వున్నపుడే అన్వేషిస్తావు. అవి ముందు వెళ్ళే మెట్లు. అవి తప్పు కాదు. వాటిల్లో దోషం లేదు. అట్లా అని మనిషి ఎప్పటికీ సందేహాల్లోనే పడి కొట్టుకు పోకూడదు. సత్యాన్ని గ్రహించడానికి వ్యక్తి సందేహాల్ని ఆకారం చేసుకోవాలి. కాబట్టి అది పూర్తిగా వేరయిన విషయం. అది నిర్జీవమైన సత్యం కాదు. సజీవ సత్యం. అది నీ సత్యం. నీ జీవితంలో దాని కోసం నువ్వు శ్రమించాలి.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹




Comentarios


Post: Blog2 Post
bottom of page