top of page

నిర్మల ధ్యానాలు - ఓషో - 213


ree

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 213 🌹


✍️. సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ


🍀. మీ చైతన్య సరస్సుని నిశ్శబ్దంగా మార్చడానికి మీకు సాధ్యపడుతుంది. నువ్వు లోపలి నిశ్శబ్దాన్ని అందుకున్న క్షణం విప్లవాత్మక పరిణామం జరుగుతుంది. అప్పుడు 'నేను ఆనందిస్తాను' అని నువ్వు ప్రకటించవచ్చు. 🍀


సత్యమెప్పుడూ అక్కడే వుంది. మనం దాన్ని ప్రతిఫలించ లేనంత మసకబారి వున్నాం. పూర్ణచంద్రుడక్కడ వున్నాడు. నక్షత్రాలున్నాయి. కానీ కొలనే కలత పడింది. అక్కడ ఎన్ని అలలు వున్నాయంటే కొలను ఆకారణంగా చంద్రుణ్ణి ప్రతిఫలించలేదు. అది చంద్రుణ్ణి, నక్షత్రాల్ని ఆనందించలేదు. ఆకాశానికి అది గుడ్డిదయింది. కాబట్టి సరోవరం కాస్త నిశ్శబ్దంగా వుండడం మంచిది.


మీ చైతన్య సరస్సుని నిశ్శబ్దంగా మార్చడానికే నా ప్రయత్నమంతా. అది సాధ్యం. అది నాకు సాధ్యపడుతుంది. మీకు సాధ్యపడుతుంది. నేనేమీ అసాధ్యాలని ఆశించడం లేదు. అది ఎవరికయినా జరగవచ్చు. నువ్వు లోపలి నిశ్శబ్దాన్ని అందుకున్న క్షణం విప్లవాత్మక పరిణామం జరుగుతుంది. అప్పుడు 'నేను ఆనందిస్తాను' అని నువ్వు ప్రకటించవచ్చు.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹



Comentarios


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page