🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 214 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. శూన్యంగా వుండు. నిశ్చలంగా ఉండు. అప్పుడు సమస్తం నీలో ప్రతిఫలిస్తుంది. ఆ అనుభవమొకటే మార్మికమైన అనుభవం. అది నీకు దైవానికి సంబంధించిన నిశ్చితత్వాన్ని కలిగిస్తుంది. అది విశ్వాసం కంటే భిన్నమైంది. 🍀
గుర్తుంచుకోవాల్నిన విషయమేమిటంటే జ్ఞానం అన్నది విషయ సేకరణలో లేదు. ఇతర్ల నించీ నేర్చుకోవడంలో లేదు. దానికి భిన్నంగా నేర్చుకోక పోవండలో వుంది. పసిపిల్ల వాడుగా తిరిగి మారినపుడే వ్యక్తి తెలిసిన వాడవుతాడు. చైతన్యమనే అద్దం అప్పుడే దుమ్ము ధూళి అంటకుండా వుంటుంది. అప్పుడు సమస్త ఆకాశం, నక్షత్రాలు వాటి వైభవాన్ని అందులో స్పష్టంగా ప్రకటిస్తాయి. ఆ అనుభవమే దేవుడు.
శూన్యంగా వుండు. నిశ్చలంగా ఉండు. అప్పుడు సమస్తం నీలో ప్రతిఫలిస్తుంది. ఆ అనుభవమొకటే మత సంబంధమైన అనుభవం. అదొకటే మార్మికమైన అనుభవం. అది నీకు దైవానికి సంబంధించిన నిశ్చితత్వాన్ని కలిగిస్తుంది. అది విశ్వాసం కంటే భిన్నమైంది. అది నీకు విస్పష్టతనిస్తుంది. అది ఎవరో బుద్ధుడో మరెవరో చెప్పింది కాదు. అది నీ అనుభవపు లోతుల్లోనిది. నీ అస్తిత్వాంలో భాగం. అప్పుడే అసలయిన లక్ష్యం నెరవేరుతుంది. సంపూర్ణత సమకూరుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments