🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 216 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నీ లోపలి చెత్తా చెదారాన్ని బయటికి విసిరికొట్టు. అక్కడ విశాలస్థలాన్ని ఏర్పరచు. అప్పుడు ఆ స్థలం నీ అస్తిత్వంతో పొంగిపొర్లుతుంది. అస్తిత్వం ఎదగడానికి స్థలం కావాలి. అస్తిత్వం తన రేకుల్ని విచ్చుకుంటుంది.🍀
ఔన్నత్యమన్నది సహజంగా సంభవించేది. దేవుని రాజ్యాన్ని అందుకోవడమన్న మన లక్ష్యం కాదు. దాన్ని మరిచిపో. నా బోధనల సారాంశం నువ్వు ఏమీ కానివాడిగా, లేనివాడివిగా మారు. నీ లోపలి చెత్తా చెదారాన్ని బయటికి విసిరికొట్టు. అక్కడ విశాలస్థలాన్ని ఏర్పరచు. అప్పుడు ఆ స్థలం నీ అస్తిత్వంతో పొంగిపొర్లుతుంది.
అస్తిత్వం ఎదగడానికి స్థలం కావాలి. అస్తిత్వం తన రేకుల్ని విచ్చుకుంటుంది. అది వేల పత్రాల పద్మమవుతుంది. నీలోంచీ గొప్ప సంగీతం, కవిత్వం, నాట్యం, దయ మొదలవుతాయి. అటంకం లేకపోవడం వల్ల అనంత స్వేచ్చ విస్తరిస్తుంది. నువ్వు విశాలమవుతావు. జీవితం విస్ఫోటించి కాంతి, ప్రేమ ఆనందం కళకళలాడుతాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments