నిర్మల ధ్యానాలు - ఓషో - 217
- Prasad Bharadwaj
- Jul 29, 2022
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 217 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మరణం తీసుకు పోయేదేదయినా మోసకారి విజయమే. మనం ఏమీ కాకపోవడంలో అపూర్వమైన ఆనందముంది. అది వూహకందనిది. కీర్తి ప్రతిష్టలు ఏమీ లేదు. అదొక తెలివితక్కువ ఆట. అది పసితనపు అజ్ఞానం. 🍀
మనకు చిన్నప్పటి నించీ ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని, విజయం సాధించాలని, కీర్తి ప్రతిష్టలు పొందాలని, ప్రైమినిస్టర్, ప్రెసిడెంట్ కావాలని నోబుల్ అవార్డు పొందాలని ప్రత్యేకత పొందాలని చెబుతారు. యింకేదో కావాలని ప్రతి పసివాడికి విషమెక్కిస్తారు. కానీ నిజమేమిటంటే మనం ఏమీ కాము. మనం ఏమీ కాకపోవడమంటే అపూర్వమైన ఆనందముంది. అది వూహకందనిది. కీర్తి ఏమీ లేదు. అదొక తెలివితక్కువ ఆట. అది పసితనపు అజ్ఞానం.
నిజంగా సాధించడానికి సంబంధించి నా నిర్వచనమేమిటంటే మరణం కూడా దానిని తీసుకుపోలేదు. మరణం తీసుకు పోయేదేదయినా మోసకారి విజయమే. ఎవరూ కానితనం అంటే ఏమీలేనితనం అందులో అపూర్వ ఆనందముంది. అక్కడ ఆరాటం లేదు. ఆతృత లేదు. అక్కడ నువ్వు గాయపడడానికి అహం లేదు. అక్కడ నిన్ను ఎవరూ కించపరచరు. నువ్వు ఆనందించవచ్చు. నవ్వుకోవచ్చు. అప్పుడు తను అనంతంలో భాగమవుతాడు. శాశ్వతత్వం కలిగిన వాళ్ళలో ఒకడవుతాడు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments