🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 218 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జీవించడానికి ప్రతిమనిషికీ అవకాశం వుంది. అవకాశాన్ని యధార్థానికి పరివర్తింప జేయాలి. నువ్వు హిట్లర్‌వి కావచ్చు. బుద్ధుడివి కావచ్చు. రెండు తలుపులూ తెరుచుకునే వుంటాయి. 🍀
నీకు చూసే కళ్ళుంటే నువ్వు ఆశ్చర్యపోతావు. బిచ్చగాడు కూడా కేవలం బిచ్చగాడే కాదు. అతనూ మనిషే. అతనూ ప్రేమ, కోపాన్ని, వేల విషయాన్ని అనుభవానికి తెచ్చుకుని వుంటాడు. చక్రవర్తి కూడా ఈర్ష్యపడే అనుభవాలతనికి వుంటాయి. అతని జీవితం చదవదగింది పరిశీలించ దగింది. అర్థం చేసుకోదగింది. అతని జీవితం నీ జీవితం లాంటిదే. ప్రతిమనిషి జీవితమూ అంతే. జీవించడానికి ప్రతిమనిషికీ అవకాశం వుంది. అవకాశాన్ని యధార్థానికి పరివర్తింప జేయాలి. నువ్వు హిట్లర్‌వి కావచ్చు. బుద్ధుడివి కావచ్చు.
రెండు తలుపులూ తెరుచుకునే వుంటాయి. వ్యక్తి ద్వారం ద్వారా లోపలికి వెళ్ళవచ్చు. ఒకడు ఒక ద్వారం గుండా యింకొకడు యింకొక ద్వారం గుండా సాగుతారు. రెండు ద్వారాలూ తెరిచే వుంటాయి. మనిషి బుద్ధుడయ్యే, హిట్లరయ్యే అవకాశం వుంది. వ్యక్తి దీన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు సమస్త విశ్వం విశ్వవిద్యాలయమవుతుంది. విశ్వవిద్యాలయానికి అర్థమదే. అది విశ్వమన్న పదం నించీ వచ్చింది. మనం అవకాశాలుగా మాత్రమే పుట్టాం. అప్పుడు ప్రతిదీ మన మీద ఆధారపడి వుంటుంది. ఏమి కావాలన్నది మన నిర్ణయం మీద వుంటుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments