🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 219 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. లోపలి ప్రపంచంలో ప్రేమ వెలిగే తార, కాంతి, సూర్యుడు. అది నీ లోపలి ప్రపంచపు ఆత్మ. ఆధారం. లోపలికి వెళ్ళి దాన్ని కనిపెట్టు. ఆనందంగా వుండడానికి కాంతి ముఖ్య అవసరం. జీవితాన్ని ఒక సమస్యగా భావించకు. అది సమస్యే కాదు. అది జీవించదగిన రహస్యం. 🍀
నీ అస్తిత్వంలోని ఆకాశంలో ప్రేమ అన్నది మెరుస్తున్న నక్షత్రం. బాహ్య ప్రపంచాన్ని దాంతో పోల్చలేం. బాహ్యమైంది. అందంగానే వుంటుంది. కానీ ఆంతర్యలోని దాంతో దాన్ని పోల్చడానికి లేదు. లోపలి ప్రపంచంలో ప్రేమ వెలిగే తార, కాంతి. సూర్యుడు అది నీ లోపలి ప్రపంచపు ఆత్మ. ఆధారం. లోపలికి వెళ్ళి దాన్ని కనిపెట్టు. దాన్ని కనిపెడితే యితరుల్తో పంచుకో. ఉత్సవం జరుపుకో. నువ్వు కాంతిగా వుండడం అన్న దాని అర్థాన్ని మరచిపోతే ఆనంంగా వుండడమన్న అర్థాన్ని కూడా మరచి పోయావన్న మాట. అవి ఒకే విషయానికి రెండు కోణాలు.
ఆనందంగా వుండడానికి కాంతి ముఖ్య అవసరం. ఆట్లాంటి సందర్భంలోనే ఆనందం సంభవం. జీవితాన్ని ఒక సమస్యగా భావించకు. అది సమస్యే కాదు. అది జీవించదగిన రహస్యం. పరిష్కరించాల్సిన రహస్యం కాదు. అది ఆనందం, నాట్యం, ప్రేమ, అది ప్రహేళిక కాదు. విస్ఫోటించడానికి అవకాశం, అందం, అద్భుతం, ఆశ్చర్యం,. కాబట్టి ఉత్సాహంగా వుండడం నేర్చుకో. ఆటగా తీసుకో. ప్రతిదాన్ని నవ్వులాటగా భావించు. చివరికి మరణాన్ని కూడా నవ్వులాటగా తీసుకో.
సశేషం ...
Comments